హృతిక్ రోషన్‌కి ఇష్టమైన బైక్‌కి ఏం జరిగింది? కొనే వాళ్లు ఎవరూ లేరు! ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు
దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ భారత్‌లో బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకుని పలు టూవీలర్స్‌ను విడుదల చేస్తూ, హోండా, టీవీఎస్ వంటి ఇతర తయారీదారులకు గట్టి పోటీగా నిలుస్తుంది. తాజాగా హీరో తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్ 210 (karizma xmr 210)కు సంబంధించిన అమ్మకాల డేటా విడుదల అయింది. దీని ప్రకారం, వందలాది మోడళ్లతో భారతదేశాన్ని టూవీలర్ సెగ్మెంట్‌లో ఏలుతున్న హీరో కంపెనీ.. ఇప్పుడు తన ఒక ప్రధాన బైక్ మోడల్‌తో ఊహించని ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. అంచనాలు పెట్టుకున్న హీరో కరిజ్మా 210 బైక్ కు ఆశించిన స్పందన రాకపోవడం, వాస్తవానికి మూడు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం.
ఈ సేల్స్ డేటా వెలుగులోకి రావగంతో హీరో మోటోకార్ప్ అభిమానులు, ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు షాక్‌కు గురయ్యారు. కరిజ్మా xmr 210 లాంచ్ అయినప్పుడు మంచి అంచనాల మధ్య మార్కెట్లోకి అడుగుపెట్టింది. కానీ వినియోగదారుల నుంచి ఎలాంటి ఆసక్తి రాకపోవడం కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గత మూడు నెలలుగా కనీసం ఒక్క భారతీయుడు కూడా బైక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం షాకింగ్ విషయం అని చెప్పాలి.

హీరో కరిజ్మా పేరు వినగానే, 90ల నాటి యువతకు గుండెల్లో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేదీ. 2003లో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్పోర్ట్స్ బైక్ అప్పట్లో యూత్ ఐకాన్‌గా నిలిచింది. తరువాత 2007లో కరిజ్మా R మోడల్ వేరియంట్లో పూర్తిగా మారిపోయి విడుదల అయింది. కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్, స్టైలిష్ ఫెయిరింగ్ వల్ల యువత ఈ బైక్‌ను కలల బైక్‌గా భావించడం మొదలు పెట్టారు.
కానీ, పల్సర్ 220 వచ్చాక యువత కొత్త ఆప్షన్‌ను చూశారు. కరిజ్మా అప్పటివరకు స్టేటస్ సింబల్‌గా ఉన్నా, పల్సర్ హై-పెర్ఫార్మెన్స్, అట్రాక్టివ్ డిజైన్‌తో కరిజ్మాకు గట్టి పోటీ ఇచ్చింది. లేటెస్ట్ స్పోర్టియర్ బైక్‌లు వచ్చినప్పటికీ పూర్తిగా ఫెయిర్డ్ విభాగంలో కరిష్మా XMR 210 కొత్త అవతారంలో తిరిగి మార్కెట్లోకి వచ్చింది. ముఖ్యంగా దేశంలోని చాలా మంది హృతిక్ రోషన్ బైక్ అనేవారు కూడా.

తరువాత దీనికి క్రమంగా డిమాండ్ తగ్గతుండటంతో హీరో కంపెనీ దీన్ని మరింత కొత్తగా అప్‌డేట్ చేసి 2023లో కరిజ్మా XMR 210 మోడల్‌గా తీసుకొచ్చారు. ఈసారి సేల్స్ ఆశించిన మేరకు రాలేదు. మార్కెట్లో ఇతర తయారీదారులు ఇదే సెగ్మెంట్‌లో విడుదల చేస్తున్న బైక్‌ల నుంచి పోటీ విపరీతంగా పెరగడంతో, కరిజ్మా తన పాత వైభవాన్ని తిరిగి పొందలేకపోయింది. దీంతో అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
2023 ఆగస్టు 29న హీరో మోటోకార్ప్ భారీ అంచనాల మధ్య కరిజ్మా XMR 210ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రూ. 1.73 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ స్పోర్ట్స్ బైక్, కొత్తగా స్లీక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, మోడ్రన్ ఫీచర్లతో ఆకట్టుకుంది. హీరో తన స్టైల్‌ను కొనసాగిస్తూ, మంచి పనితీరును అన్ని వర్గాల వారు కొనగలిగే విధంగా తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఈ బైక్‌ను విడుదల చేసింది.

అయితే లాంచ్ అయిన మొదటి కొన్ని నెలల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, 2025 మార్చి చివరి నాటికి అమ్మకాల్లో భారీ క్షీణత కనిపించడం మొదలైంది. గత సంవత్సరం స్పోర్ట్స్ బైక్ విభాగంలో హీరో నెలకు సగటున 739 యూనిట్లను విక్రయించగా, తాజాగా ఈ సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం అందరిని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. ఈ బైక్‌ను నిలిపివేశారా? లేక అమ్మకాలు తగ్గాయా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇంకా లేదు.
కానీ, త్వరలో మార్కెట్లోకి రాబోతున్న కరిజ్మా XMR 250 అప్‌డేట్ వెర్షన్ కారణంగా, ప్రస్తుతం ఉన్న XMR 210 అమ్మకాలు తగ్గినట్లు భావిస్తున్నారు. ఒకప్పుడు వీధుల్లో హల్ చల్ చేసిన కరిజ్మా ఇప్పుడు అమ్మకాల్లో వెనుకపడిపోవడం, మార్కెట్‌లో నెమ్మదిగా తన హవాను కోల్పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కనీసం కొత్త అప్‌డేట్ మోడల్ రాకతో అయిన దీని అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ భావిస్తుంది.

మొత్తంగా ఈ బైక్ అమ్మకాలను ఒకసారి పరిశీలించినట్లయితే, హీరో గత 12 నెలల్లో కేవలం 4,806 యూనిట్ల కరిష్మాను మాత్రమే విక్రయించింది. 2024 మార్చి నెలలో 1,874 మంది బైకును కొనుగోలు చేయగా, ఏప్రిల్‌లో 947 యూనిట్లు, మూ నెలలో 663 యూనిట్లు, జూన్‌లో 476 యూనిట్లు, జులైలో 529 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. తరువాత నుంచి సేల్స్ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తున్నాయి.
ఆగస్టులో అమ్మకాలు 258 యూనిట్లకు, సెప్టెంబర్‌లో అయితే ఏకంగా రెండు సంఖ్యలకు అనగా 48 యూనిట్లకు పడిపోయాయి. అక్టోబర్ 2024లో హీరో కరిష్మా XMR 210 బైక్‌ను కొనుగోలు చేసింది కేవలం 7 మంది మాత్రమే, తరువాత నవంబర్‌లో నలుగురు కొనుగోలు చేశారు. ఈ లెక్కన డిసెంబర్ నెల నుంచి మొదలుకుని ఫిబ్రవరి వరకు కూడా ఓ ఒక్కరు కూడా బైక్‌ను కొనటానికి ముందుకు రాకపోవడం షాకింగ్ అని చెప్పాలి.
అయితే ఇదే సమయంలో హీరో కంపెనీకి షాక్ తగిలేలా మరో టూవీలర్ తయారీ కంపెనీ యమహా నుంచి R15 సిరీస్‌లో ప్రతి నెలా సగటున 8,883 యూనిట్ అమ్మకాలను సాధించింది. యమహా R15 కంటే ఎక్కువ శక్తి, టార్క్ కలిగి ఉన్నప్పటికీ, మైలేజ్, బ్రాండ్ ఇమేజ్, డిజైన్, మార్కెటింగ్ వ్యూహాల లోపం కారణంగా కరిజ్మా వెనుకబడి పోయింది. కరిజ్మా XMR 210 ఇప్పటికీ ప్రీమియం కేటగిరీ కింద ఉంది.
కంపెనీ జనవరి 2025లో కరిజ్మా XMR 210 కంబాట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. కరిజ్మా XMR 210 మార్కెట్లో ప్రధానంగా బజాజ్ పల్సర్ RS200, సుజుకి జిక్సర్ SF 250, యమహా R15 V4 వంటి వాటితో బలంగా పోటీ పడింది. ఇది మ్యాట్ బ్లాక్, రెడ్, ఎల్లో కలర్స్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.


Click it and Unblock the Notifications








