కేవలం రూ.59 వేలకే హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్.. ఒక్క కిలోమీటర్‌కి రు.0.96 ఖర్చు!
భారతదేశపు దిగ్గజ టూవీలకర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన ఎలక్ట్రిక్ వాహన ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ, కొత్త మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొంతకాలం క్రితం, విడా (Vida) బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ విభాగాన్ని ఏర్పాటు చేసి, V1 స్కూటర్‌ను వినియోగదారులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, దీనికి 2 అనే కొత్త పేరును పెట్టినప్పటికీ, టెక్నికల్ స్పెసిఫికేషన్లలో పెద్ద మార్పులు జరగలేదు. ఇప్పుడు మరింత మందికి చేరవకావడానికి హీరో కొత్త మోడల్ విడా వీఎక్స్2 (Vida Vx2)ను తాజాగా విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను తీసుకురావడానికి ముందు ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికర చర్చలు జరిగాయి. అంచనాలకు తగ్గట్టే, ఈ స్కూటర్‌ను అత్యంత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
విడా Vx2కు కేవలం రూ.59,490 మాత్రమే ప్రారంభ ధరగా నిర్ణయించడమే కాకుండా, ఇందులో బాస్(Battery as a Service (BaaS)) పద్ధతిలో బ్యాటరీని విడిగా పొందే అవకాశం కూడా కల్పించారు. ఈ కొత్త VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా, దాని ధర కూడా సాధారణ వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్టే ఉంచబడింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొదటిసారి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరింత బెస్ట్ ఆప్షన్.

విడా Vx2కు బాస్ పథకాన్ని ఎంచుకున్నట్లయితే రూ.59,490 ధర వద్ద లభిస్తుండగా, నేరుగా బ్యాటరీ ప్యాక్‌తో కొనుగోలు చేసినట్లయితే దాదాపు రూ.99,490 వరకు ఉంది. హీరో విడా VX2ను ఈసారి వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వేరియంట్లలో తీసుకువచ్చారు. మొదటిది గో అనే వేరియంట్, దీనిలో 2.2 kWh సామర్థ్యమున్న బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 92 కిలోమీటర్ల వరకు IDC పరిధిని అందిస్తుందని సంస్థ చెప్పింది.
మరొకటి ప్లస్ వేరియంట్, బ్యాటరీ సామర్థ్యం 3.4 kWhగా ఉంటుంది. దీని ద్వారా ఒక్కసారి పూర్తి ఛార్జ్‌యిన తర్వాత సుమారు 142 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. BaaS ప్లాన్ కింద VX2 ప్లస్ వేరియంట్‌కు ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,990గా నిర్ణయించారు. వీటితోపాటు, సాధారణ మోడల్‌లా బ్యాటరీతోపాటు VX2ను కూడా కొనుగోలు చేయవచ్చు. దీంతో ఒకవైపు కొనుగోలు ఖర్చు తగ్గిపోగా, బ్యాటరీ చార్జ్ అయ్యే సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.

VX2 ప్లస్‌ను నేరుగా బ్యాటరీ ప్యాక్‌తో కొనుగోలు చేసినట్లయితే రూ.1.10 లక్షల వరకు చెల్లించాలి. హీరో విడా VX2, కేవలం తక్కువ ధరతోనే కాకుండా, దాని వాడకానికి అయ్యే ఖర్చును కూడా వినియోగదారుల దృష్టిలో ఉంచి రూపొందించబడింది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, VX2 మోడళ్లకు ఒక్క కిలోమీటరు ప్రయాణం చేయడానికి కేవలం రూ.0.96 మాత్రమే రన్నింగ్ ఖర్చు అవుతుంది.
అంతేకాదు, మీరు BaaS ప్లాన్ ద్వారా VX2ను తీసుకుని ఉంటే, దాని బ్యాటరీ సామర్థ్యం 70 శాతం కంటే తక్కువగా దిగజారితే, హీరో మోటోకార్ప్ దానిని పూర్తిగా ఉచితంగా భర్తీ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ విధంగా, బ్యాటరీ లాంగ్‌టర్మ్ పనితీరుపై ఉండే ఆందోళనకు కూడా శాశ్వత పరిష్కారం అందించింది. డిజైన్ విషయానికి వస్తే, VX2, V2తో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా, కొత్తదనాన్ని కలిగిన రూపంలో కనిపిస్తుంది.

దీన్ని కుటుంబ అవసరాల కోసం మరింత సౌమ్యంగా తీర్చిదిద్దాయి. VX2పై దాదాపు పూర్తి ఫ్లాట్ సింగిల్-పీస్ సీటు ఉంటుంది, అందులో పిలియన్ ప్రయాణికుడికి వెనుక బ్యాక్‌రెస్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, హ్యాండిల్ బార్‌కి చుట్టూ ఉన్న ష్రౌడ్ డిజైన్ VX2కు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.అయితే, ప్రధానంగా హెడ్‌లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్‌ల వంటి కాంపోనెంట్లు V2 మోడల్ నుంచే తీసుకుని VXలో ఉపయోగించారు.


Click it and Unblock the Notifications








