ఈ కంపెనీ బైక్స్, స్కూటర్లంటే జనాలకు పిచ్చి.. ఏకంగా 5.53 లక్షల మంది షోరూమ్‌లకు ఎగబడ్డారు
దేశీయ టూవీలర్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన స్థిరమైన డిమాండ్‌ను మరోసారి నిర్ధారించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే బైక్స్, స్కూటర్లను సమయానికి, తక్కువ ధరలతో అందించడం ద్వారా ఎప్పుడూ ముందుండే కంపెనీ, తాజాగా అద్భుతమైన సేల్స్ రికార్డును సొంతం చేసుకుంది. సేల్స్ నివేదిక ప్రకారం, ఆగస్టు 2025లో హీరో మోటోకార్ప్ మొత్తం 5,53,727 మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను దేశవ్యాప్తంగా రవాణా చేసింది. ఇది గత సంవత్సరంలో, ఆగస్టు 2024లోని అమ్మకాలతో పోలిస్తే 8 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ అద్భుతమైన సేల్స్ రికార్డు కంపెనీని మాత్రమే, భారతీయ వినియోగదారుల టూవీలర్ వాహనాలపై పెరుగుతున్న ప్రేమను కూడా ప్రతిబింబిస్తుంది. సాధారణ ధరల్లో అందించే మోడళ్లు కలిగి ఉండటం కారణంగా ఎక్కువ మంది ఈ కంపెనీ వాహనాలను కొంటున్నారు.
హీరో మోటోకార్ప్ సేల్స్ గణాంకాలు ఇటీవల వెలువడిన తర్వాత, కంపెనీ పట్ల ప్రజల్లోని స్థిరమైన ఆదరణ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా, వినియోగదారులు హీరో వాహనాలను ఒకవైపు నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారు, ఇది దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో కంపెనీ స్థిరమైన డిమాండ్‌ను సూచిస్తుంది. రానున్న రోజుల్లో వరుసగా పండుగల సీజన్ ఉండటంతో ఈ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.

ఇదిలా ఉంటే ఆగస్టు 2025 సేల్స్‌లో , బైక్ విభాగం కీలక పాత్ర పోషించింది. ఆగస్టులో 5,01,523 యూనిట్లు పంపిణీ అయ్యాయి, ఇది గత సంవత్సరం ఇదే సమయంలోని 4,78,215 యూనిట్లతో పోలిస్తే 4.87% వృద్ధి. స్కూటర్ విభాగం కూడా గణనీయంగా పెరిగింది. ఆగస్టు 2025లో 52,204 యూనిట్లు రిజిస్టర్ చేయబడగా, ఇది గత ఏడాది ఇదే సమయంలో 34,145 యూనిట్ల నుండి విశేషంగా పెరుగుదలను చూపిస్తుంది.
ఆగస్టు 2025లో హీరో మోటోకార్ప్ దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి ప్రదర్శన కనబరిచింది. దేశీయ మార్కెట్లో మొత్తం 5,19,139 యూనిట్లు అమ్మకాలకు చేరుకున్నాయి, ఇది గత సంవత్సరం ఇదే సమయంలోని 4,92,263 యూనిట్లతో పోలిస్తే 5.46 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ గణాంకాలు, దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలపై వినియోగదారుల నమ్మకం, స్థిరమైన డిమాండ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

అంతే కాకుండా, ఎగుమతుల పరంగా కూడా మంచి ప్రదర్శన కనిపించింది. ఆగస్టులో 34,588 యూనిట్లు ఇతర దేశాలకు సరఫరా చేయబడ్డాయి, ఇది గత సంవత్సరం ఇదే సమయంలో నమోదైన 20,097 యూనిట్లతో పోలిస్తే గొప్పగా పెరుగుదల. ఈ విధమైన వృద్ధి, హైరో మోటోకార్ప్ భారతీయ మార్కెట్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా తన స్థిరమైన పట్టు కలిగినదని చూపిస్తుంది.
హీరో మోటోకార్ప్ రాబోయే నెలల్లో మార్కెట్ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని నమ్మకంగా పేర్కొంది. కంపెనీ అంచనాల ప్రకారం, రుతుపవనాలు సానుకూలంగా ఉండడం, వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరగడం, అలాగే రాబోయే GST సంస్కరణలు వినియోగంలో పెరుగుదలకు దోహదపడతాయి. ఈ కారణంగా, రాబోయే పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్ చాలా ఆశాజనకంగా ఉండబోతుందని కంపెనీ భావిస్తోంది.

ఈ నెలలో, హీరో మోటోకార్ప్ తన ఇండియాలోని వినియోగదారులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. కంపెనీ భారతదేశంలో 125cc మోటార్‌సైకిల్, గ్లామర్ X 125 ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది, డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్). ఇది ధర, ఫీచర్ల సమతుల్యత కారణంగా, 125cc సెగ్మెంట్‌లో వినియోగదారుల కోసం ఆకట్టుకునే ఎంపికగా నిలుస్తుందని అంచనా వేయవచ్చు.


Click it and Unblock the Notifications








