గజినీ మహమ్మద్‌లా ట్రై చేస్తున్న హోండా.. కానీ హీరోను దాటలేకపోతుంది..టాప్ 6 టూ వీలర్ కంపెనీల రిపోర్ట్!
ప్రపంచంలోనే అత్యధిక టూ-వీలర్ల అమ్మకాలు జరిగే దేశాల్లో మన భారత్ కూడా ఒకటి. ప్రతి నెల లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఇక్కడ అమ్ముడవుతాయి. మన మార్కెట్‌లో టూ-వీలర్లు విక్రయించే కంపెనీలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు డిమాండ్ పెరిగిన తర్వాత కొత్త స్టార్టప్‌లు చాలా వచ్చాయి. అయితే, మనం ఇప్పుడు భారతదేశంలో టూ-వీలర్ అమ్మకాల్లో ముందున్న టాప్ 6 కంపెనీల గురించి చూద్దాం.
ఈ 6 కంపెనీల నుంచి మాత్రమే గత జూన్ నెలలో మొత్తం 14,95,168 టూ వీలర్లు అమ్ముడయ్యాయి. మిగిలిన టూ-వీలర్ కంపెనీల గత నెల అమ్మకాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 20 లక్షలు దాటుతుంది.

అయితే, గత 2024 జూన్ నెలలో ఇదే 6 కంపెనీల నుంచి 15,44,157 టూ వీలర్లు అమ్ముడయ్యాయి.. అంటే ఈ సంవత్సరం జూన్ కంటే దాదాపు 48,989 యూనిట్లు ఎక్కువ. అలాగే, 2025 మే నెలలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా 15,90,552 యూనిట్లుగా ఉంది.
ఎప్పటిలాగే గత 2025 జూన్ నెలలో కూడా అత్యధిక ద్విచక్ర వాహనాలను విక్రయించిన కంపెనీగా హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో నిలిచింది. సాధారణంగా హీరోకు, హోండాకు అమ్మకాల్లో గట్టి పోటీ ఉంటుంది. కానీ, గత నెల అమ్మకాల్లో హోండాను భారీ తేడాతో హీరో అధిగమించింది.

జూన్ నెలలో హీరో నుంచి అమ్ముడైన టూ-వీలర్ల సంఖ్య 5,25,136. రెండో స్థానంలో ఉన్న హోండా కేవలం 3,88,812 టూ-వీలర్లను మాత్రమే విక్రయించింది. అయితే, 2024 జూన్ నెలలో హోండా దీనికంటే సుమారు 96 వేల టూ-వీలర్లు ఎక్కువగా, 4,82,597 టూ-వీలర్లను విక్రయించింది. అదే సమయంలో హీరో 2024 జూన్‌లో దీనికంటే కేవలం 9 వేల టూ-వీలర్లు ఎక్కువగా 4,91,416 టూ వీలర్లను అమ్మింది.
వీటి తర్వాత, మూడో స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 2,81,12 టూ వీలర్ల అమ్మకాలతో ఉంది. అయితే, గత మే నెలలో టీవీఎస్ మోటార్ అమ్మకాల సంఖ్య 3 లక్షలు దాటింది. 2024 జూన్‌లో టీవీఎస్ 2,55,734 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

ఈ వరుసలో నాలుగో స్థానంలో బజాజ్ ఆటో ఉంది. బజాజ్ నుంచి గత జూన్ నెలలో అమ్ముడైన టూ-వీలర్ల సంఖ్య 1,49,317. అయితే, గత మే నెలలో బజాజ్ టూ-వీలర్ల అమ్మకాల సంఖ్య 2 లక్షలకు దగ్గరగా ఉంది.
వీటి తర్వాత ఐదో స్థానంలో ఆశ్చర్యకరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 76,957 బైక్‌ల అమ్మకాలతో ఉంది. సాధారణంగా ఈ ఐదో స్థానాన్ని ఆక్రమించే సుజుకి మోటార్‌సైకిల్ 73,934 టూ వీలర్ల అమ్మకాలతో ఆరో స్థానానికి పడిపోయింది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఈ నివేదికలో భారతదేశంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల సంఖ్యను మాత్రమే ప్రస్తావించాం. బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు ప్రతి నెలా వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను భారతదేశంలో ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాయి. వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే టీవీఎస్, బజాజ్ కంపెనీలు కూడా హీరో, హోండా కంపెనీలకు సమానంగా వస్తాయి.


Click it and Unblock the Notifications








