70 కి.మీ మైలేజ్ బైక్‌ 62 వేలకే.. ఈ బైక్ కోసం కస్టమర్లు షోరూమ్‌కు క్యూ కట్టారు

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు ఎక్కువగా సరిపోయే బైకులు ఎప్పుడూ మంచి డిమాండ్‌లో ఉంటాయి. తక్కువ ధరలో, అధిక మైలేజీతో, తక్కువ నిర్వహణ ఖర్చుతో లభించే ఈ బైకులు సాధారణ ప్రజలకు ఎంతో అనుకూలంగా మారాయి. అందులో హీరో మోటోకార్ప్ (Hero Motocorp) కంపెనీకి చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. హీరో HF డీలక్స్ గురించి చెప్పుకోవాలంటే, ఇది సాధారణ ప్రయాణికులకు, ఆఫీసుకు వెళ్లేవారికి, లేదా రోజూ పట్టణంలో రైడ్ చేసే వారికి ఒక అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. దాని తేలికైన బాడీ, మైలేజీ, ధర.. ఈ బైక్‌ను మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలబెట్టాయి.

సెప్టెంబర్ 2025 నెలలో ఈ బైక్ తన అమ్మకాలతో మరొకసారి తన డిమాండ్‌ను నిరూపించుకుంది. ఆ నెలలో 1,18,043 యూనిట్ల హీరో HF డీలక్స్ బైకులు అమ్ముడయ్యాయి. గత ఏడాది అదే నెలలో, అంటే సెప్టెంబర్ 2024లో, అమ్మకాలు 1,13,827 యూనిట్ల వద్ద నిలిచాయి. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అమ్మకాల సంఖ్య 4,216 యూనిట్లు పెరిగింది, ఇది దాదాపు 3.70 శాతం వృద్ధిని సూచిస్తోంది.

Hero Motocorp Hf Deluxe Bike September 2025 Sales Report Details

ఈ వృద్ధి ఒక చిన్న సంఖ్యలా కనిపించినా, ఇది హీరో కంపెనీకి చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. ఎందుకంటే HF డీలక్స్ వంటి బైకులు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో ఎక్కువగా కొనుగోలు చేయబడతాయి. అక్కడి వినియోగదారులు బైక్‌లో లగ్జరీ కన్నా మైలేజీ, నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చును ప్రాధాన్యంగా చూస్తారు. ఈ మూడు అంశాల్లోనూ HF డీలక్స్ ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తోంది.

ఇంతేకాదు, సెప్టెంబర్ 2025లో భారత మార్కెట్లో టాప్ 10 మోటార్‌సైకిళ్ల జాబితాలో కూడా HF డీలక్స్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ లాంటి బలమైన ప్రత్యర్థుల మధ్య కూడా ఇది 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఇది ఈ బైక్ ప్రజాదరణకు, నమ్మకానికి పెద్ద సాక్ష్యం. మొత్తం చూస్తే, హీరో HF డీలక్స్ బైక్ భారత బైక్ మార్కెట్లో ఒక క్లాసిక్ విజయాన్ని సాధిస్తుంది.

Hero Motocorp Hf Deluxe Bike September 2025 Sales Report Details

పనితీరు పరంగా హీరో HF డీలక్స్ తన కేటగిరీలో ఉన్న బైకులలో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ బైక్‌లో 97.2cc సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద గరిష్టంగా 5.9 కిలోవాట్ల శక్తిని, 6,000 rpm వద్ద 8.05 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని ఫ్యూయల్ ఎఫిషియెన్, రైడింగ్ స్మూత్‌నెస్ రెండూ మరింత మెరుగ్గా ఉంటాయి.

ఇంజిన్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది, ఇది నగర ట్రాఫిక్‌లో, తక్కువ వేగాల్లో కూడా సులభంగా గేర్ మార్చుకోవచ్చు. దీని తేలికైన బరువు, ఇంజిన్ ట్యూనింగ్ వలన రైడర్‌కు మంచి కంఫర్ట్, కంట్రోల్ లభిస్తాయి. ధర పరంగా కూడా HF డీలక్స్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. ప్రస్తుతం భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.62,462 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.68,485 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఈ ధర రేంజ్‌లో పనితీరు, మంచి మైలేజీ, నాణ్యత కలిగిన బైక్ లభించడం అనేది నిజంగా వినియోగదారులకు లాభదాయకం. హీరో HF డీలక్స్ డిజైన్, రైడింగ్ కంఫర్ట్ పరంగా కూడా చాలా బాగా తీర్చిదిద్దబడింది. ఈ బైక్‌లో ముందు, వెనుక రెండింటిలోనూ ట్యూబ్‌లెస్ టైర్లు అందించబడ్డాయి. ఇది లీటరు పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీల వరకు వస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 27, 2025, 9:13 [IST]
English summary
Hero motocorp hf deluxe bike september 2025 sales report details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+