Hero at Auto Expo హీరో సంస్థ చూపు తిప్పుకోనివ్వట్లే... నాలుగు కొత్త మోడల్స్‌తో కట్టిపడేసిందిగా!

న్యూ దిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కొనసాగుతోంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ టూ వీలర్ తయారీ సంస్థ హీరో.. ఈ ఎక్స్‌పోలో నాలుగు కొత్త టూ- వీలర్స్‌ను తీసుకువచ్చింది. Xoom 125, Xoom 160 స్కూటర్లతో పాటు Xtream 250R, XPulse 210 బైకులను లాంఛ్ చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Xoom 125 ధర(ఎక్స్- షో రూమ్) రూ. 86,400 వద్ద ప్రారంభం అవుతుండగా.. Xoom 160 స్కూటర్ ధర రూ.1.48 లక్షల వద్ద మొదలవుతోంది. హీరో సంస్థ Xoom 125 మోడల్‌ను VZ, ZX వేరియంట్లలో తీసుకువచ్చింది. Metallic Turb blue, a matte strom grey, an inferno red and a matte neon lime అనే కలర్ ఆప్షన్లలో ఇది ఉంది.

Auto Expo 2025 Hero Motocorp New two wheelers

హీరో జూమ్ 125 స్కూటర్.. 125 సీసీ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 7,250 rpm వద్ద 9.7 bhp ఉత్పత్తి చేస్తుంది. 6,000 rpm వద్ద 10.4 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7.6 సెకన్లలోనే సున్నా నుంచి 60 kmph స్పీడ్ అందుకుంటుంది. LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, LED పొజిషన్ లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

LED ఫీచర్లతో కూడిన సెగ్మెంట్‌లో ఈ తరహా ఫీచర్లు ఉండడం ఇదే తొలిసారి. ఈ స్కూటర్ 14 అంగుళాల అలాయ్ వీల్స్, పెద్ద టైర్లతో ఉంటుంది. పొడవైన వీల్‌బేస్, ఫ్రంట్ డిస్క్‌బ్రేక్ వంటి ఫీచర్లు ఉంటాయి. టర్న్- బై-టర్న్ నేవిగేషన్‌తో కూడిన బ్లా టూత్ ఎనేబుల్డ్ డిజిటల్ స్పీడోమీటర్, ఇల్యూమినేటెడ్ స్టార్ట్ బటన్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, ఫోన్ ఛార్జర్ వంటివి ఈ స్కూటర్ కిట్‌లో భాగంగా ఉంటాయి.

Hero Xoom 160 at Auto Expo 2025

ఇక జూమ్ 160 విషయానికి వస్తే ఇది 156 సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 8,000 rpm వద్ద 14.6 bhp ఉత్పత్తి చేస్తుంది. 6,500 rpm వద్ద 14 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సైలెంట్ స్టార్ట్, మంచి ఎఫీషియన్సీ కోసం 4-వాల్వ్ టెక్నాలజీతో ఈ స్కూటర్ ఉంటుంది.

14 అంగుళాల లార్జ్ వీల్స్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్‌తో ఈ స్కూటర్ ఉంటుంది. సౌకర్యవంతమైన సీటింగ్ అనుభూతి కోసం కుషన్‌డ్ సీట్ ఉంటుంది. రిమోట్ యాక్సెస్‌తో ఉండే స్మార్ట్ కీ, డ్యూయల్ ఛాంబర్ LED హెడ్ ల్యాంప్స్, ABS తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టర్న్- బై- టర్న్ నేవిగేషన్ అందించే బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది.

Hero Extreme 250R Auto Expo 2025

హీరో ఎక్స్‌ట్రీమ్ 250R బైకు రూ.1.80 లక్షల ఎక్స్- షో రూమ్ ధరలో తీసుకువచ్చింది హీరో సంస్థ. EICMA 2025లో తొలిసారి ఈ బైకును పరిచయం చేయగా.. ఆటో ఎక్స్‌పోలో తాజాగా దీన్ని ఆవిష్కరించింది. ఈ బైకులో లో- స్లంగ్ హెడ్ ల్యాంప్, ఆకర్షణీయంగా అమర్చిన ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ఎక్స్‌టెన్షన్లు, ఉబ్బెత్తుగా ఉండే టెయిల్ సెక్షన్‌తో ఇది ఉంటుంది. బ్లాక్, రెడ్ కలర్లలో దీన్ని ప్రదర్శించింది.

250 సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇందులో DOHC, 6- స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధాంచిన 4- వాల్వ్ మోటార్ ఉంటుంది. ఇది 30bhp, 25 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3.25 సెకన్లలోనే ఈ బైకు 60kmph వేగాన్ని అందుకోవడం గమనార్హం. 43మి.మీ అప్ సైడ్- డౌన్ ఫోర్క్, వెనుకవైపు ప్రిలోడ్- అడ్జస్టబుల్ మోనోషాక్‌తో ఉంటుంది. 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో ఇది ఉంటుంది.

Hero Xpulse 210 Auto Expo 2025

ఇది బజాజ్ పల్సర్ ఎన్250, సుజుకీ జిక్సర్ 250 కి పోటీగా ఉండనుంది. హీరో Xpulse 210 బైకు.. 210 సీసీ ఇంజిన్‌తో ఉంటుంది. ఆఫ్- రోడ్ అడ్వెంచర్లకు అనుకూలంగా ఉంటుంది. లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్.. 24.5 bhp, 20.4 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6- స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి, స్లిప్పర్, అసిస్ట్ క్లచ్‌తో ఉంటుంది.

Xpulse బైకు ముందు వైపు 210 మి.మీ, వెనుకవైపు 210 మి.మీ.ల సస్పెన్షన్ ట్రావెల్‌తో ఉంటుంది. ఇది 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది. ఇందులో నేవిగేషన్ కోసం 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. వీటి రాకతో మార్కెట్‌లో హీరో మోటోకార్ప్‌ గ్రిప్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2025, 17:51 [IST]
English summary
Hero motocorp launches new 4 products in auto expo 2025 check models and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+