రూ.72 వేలకే పండుగ సంబరాన్ని రెట్టింపు చేసే స్కూటర్ లాంచ్.. ఫ్యామిలీకి సరైన ఛాయిస్!
ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్, స్కూటర్ తయారీ సంస్థగా పేరుగాంచిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp), భారత వినియోగదారుల కోసం మరోసారి కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. సంస్థ తాజాగా పరిచయం చేసిన కొత్త స్కూటర్ హీరో డెస్టినీ 110 (Hero Destini 110). ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా కుటుంబాల రోజువారీ అవసరాలను తీర్చడానికి, మొదటిసారి స్కూటర్ కొనుగోలు చేసే వారికి సరిపోయేలా డిజైన్ చేశారు. డిజైన్ నుండి ఫీచర్ల వరకు ప్రతి అంశంలోనూ డెస్టినీ 110 ఒక మల్టీ పర్పస్ స్కూటర్‌గా కనిపిస్తుంది. ఇంటి పనుల కోసం రోజూ మార్కెట్‌కి వెళ్లే వాళ్లు, ఆఫీస్‌లకు వెళ్ళే ఉద్యోగులు, క్యాంపస్‌కి వెళ్లే కాలేజీ విద్యార్థులు.. అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హీరో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దింది.
ఒక వైపు భద్రతా ప్రమాణాలు, మరోవైపు సౌకర్యం, అదే సమయంలో స్టైలిష్ లుక్.. అన్నీ కలిపి ఒకే వేదికపై ఈ కొత్త మోడల్ నిలుస్తుంది. హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో ఇప్పటికే ఈ కొత్త డెస్టినీ 110 అందుబాటులో ఉంది. దీని ధర కూడా వినియోగదారులకు సులభంగా అందేలా నిర్ణయించబడింది. VX వేరియంట్(కాస్ట్ డ్రమ్) ధరను రూ.72,000గా, అలాగే ZX వేరియంట్ (కాస్ట్ డిస్క్) ధరను రూ.79,000గా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించారు.

దశలవారీగా అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. స్కూటర్ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా పెరుగుతున్న ఈ సమయంలో హీరో డెస్టినీ 110 ప్రవేశం కంపెనీకి మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇప్పటికే స్ప్లెండర్, మాస్ట్రో, ప్లెజర్ వంటి మోడళ్లతో భారీ విజయాన్ని సాధించిన హీరో మోటోకార్ప్, ఇప్పుడు డెస్టినీ 110 ద్వారా స్టైల్, ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనే మూడు ప్రధాన అంశాలను వినియోగదారులకు ఒకే దానిలో అందిస్తోంది.
హీరో మోటోకార్ప్ తన కొత్త డెస్టినీ 110 స్కూటర్‌ను నిజంగా ప్రాక్టికల్, పవర్‌ఫుల్ ప్యాకేజ్‌గా రూపొందించింది. ఇందులో అమర్చిన శక్తివంతమైన 110 సీసీ ఇంజిన్ మృదువైన రైడ్ అనుభవాన్ని, సమర్థవంతమైన పనితీరును, నమ్మదగిన డ్రైవింగ్ ఫీలింగ్‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు సులభతరం కావడమే కాకుండా, దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపగలిగేలా డిజైన్ చేశారు.

హీరో ప్రత్యేకంగా అందిస్తున్న i3s టెక్నాలజీతో పాటు, వన్-వే క్లచ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. వీటి కలయిక వల్ల ఇంధన వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా, డెస్టినీ 110 56.2 kmpl మైలేజీని అందిస్తుంది. పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న ఈ కాలంలో, ఇది ఒక పెద్ద అదనపు ప్రయోజనంగా చెప్పుకోవాలి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని, హీరో ఈ స్కూటర్‌లో 785 mm పొడవైన సీటును అందిస్తోంది.
ఇది తన సెగ్మెంట్‌లోనే అతి పొడవైన సీటు కావడం విశేషం. దీని మీద ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్ ఉండటం వలన వెనుక కూర్చున్న వారికి కూడా సౌకర్యవంతమైన రైడ్ లభిస్తుంది. అంతేకాదు, ముందున్న విశాలమైన లెగ్‌రూమ్ డ్రైవర్‌కు తేలికగా కూర్చునే అవకాశం ఇస్తుంది. డెస్టినీ 110లో ఉపయోగించిన దృఢమైన మెటల్ బాడీ స్కూటర్‌కి మన్నికను తెస్తుంది. రోజువారీ ట్రాఫిక్ రైడ్స్, వారాంతపు చిన్న ట్రిప్స్ లేదా సులభంగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా, ఈ స్కూటర్‌ను మూడు పెద్ద మెటల్ బాడీ ప్యానెల్స్‌తో నిర్మించడం వల్ల లుక్ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్ కూడా మరింత పెరిగింది. హీరో డెస్టినీ 110లో ఇచ్చిన అధునాతన అనలాగ్-డిజిటల్ స్పీడోమీటర్ స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయబడింది. ఇది రైడర్‌కి వేగం, ఫ్యూయల్ సమాచారాన్ని ఒకే చూపులో తెలుసుకునేలా చేస్తుంది. అలాగే, 190mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉండటం వల్ల ప్రతి రైడ్‌లోనూ మంచి బ్రేకింగ్ పనితీరు లభిస్తుంది.


Click it and Unblock the Notifications








