జోరుమీదున్న హీరో.. అమ్మకాలు చూస్తే షాక్ అవుతారు! ఇండియాలోనూ, విదేశాల్లోనూ దూసుకెళ్తుంది!

ప్రతినెల ముగియగానే వాహన తయారీ కంపెనీలు తమ అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంటాయి. ఈ క్రమంలో దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీదారు అయినటువంటి హీరో మోటోకార్ప్ (hero motocorp) మే 2025 అమ్మకాల నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం, కంపెనీ గత నెలలో సేల్స్ పరంగా మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కలిపి మొత్తం కంపెనీ 5,07,701 యూనిట్ల టూవీలర్స్ విక్రయాలను సాధించడం ద్వారా కంపెనీ తన మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఇది గత ఏప్రిల్ 2024లో నమోదైన 4,98,123 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 1.92 శాతం వృద్ధిని సూచిస్తుంది. అంటే, ఒక నెల వ్యవధిలోనే 9,578 యూనిట్ల వృద్ధి చోటు చేసుకున్నది. దీంతో కంపెనీ ఉన్నతాధికారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న రోజుల్లో కంపెనీ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్ల విభాగాలలో కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం వినియోగదారుల దృష్టిని ఆకర్షించాలని చూస్తోంది. సంప్రాదాయ పెట్రోల్ వాహనాలతో పాటు హీరో ఎలక్ట్రిక్ విభాగంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందేలో భాగంగా బజాజ్ ఆటో, TVS మోటార వంటి దిగ్గజాలతో పోటీ పడటానికి జులై 1న VIDA Z ఎలక్ట్రిక్ స్కూటర్ 2ను మార్కెట్లో విడుదల చేయనుంది.

Hero Motocorp Sales 1 92 Percent Growth

ఈ కొత్త లాంచ్‌తో హీరో, EV రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. మే 2025లో హీరో మోటోకార్ప్ సేల్స్‌లో మోటార్ సైకిల్ (బైక్ సెగ్మెంట్) అమ్మకాలు కీలకంగా నిలిచాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 4,71,186 యూనిట్ల కంటే 0.84 శాతం వృద్ధితో, మే 2025లో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4,75,164 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం విక్రయాల్లో వీటి వాటా అత్యధికంగా ఉంది.

హీరో కంపెనీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 93.59 శాతాన్ని ఈ విభాగం ఆక్రమించింది. ఇది హీరో మోటోకార్ప్ బ్రాండ్‌కు మోటార్ సైకిళ్లపై ఉన్న వినియోగదారుల మద్దతును స్పష్టంగా సూచిస్తుంది. ఇక స్కూటర్ల విభాగంలోనూ మంచి పురోగతి కనిపించింది. గత ఏడాది మే నెలలో 26,937 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి వాటి సంఖ్య 20.79 శాతం పెరిగి 32,537 యూనిట్లకు చేరింది. కంపెనీ అమ్మకాలలో స్కూటర్ల వాటా 6.41 శాతంగా నమోదైంది.

Hero Motocorp Sales

ఇది నెమ్మదిగా పెరుగుతున్న ట్రెండ్‌కు సంకేతంగా నిలిచింది, ముఖ్యంగా మహిళా వినియోగదారులు, సిటీ రైడింగ్‌కు మొగ్గు చూపే వారి నుంచి స్కూటర్ల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుంది. దేశీయంగా అమ్మకాలను చూసినట్లయితే మొత్తం 4,98,123 యూనిట్లలో 4,88,997 యూనిట్ల భారతదేశ వ్యాప్తంగా విక్రయించినవే. ఇది గతంతో పోలిస్తే 1.99 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా చూసినా, కంపెనీ ఎగుమతులు 0.17 శాతం పెరిగాయి.

ఇది మే 2024లో నమోదైన 18,673 యూనిట్ల కంటే 31 యూనిట్లు ఎక్కువ. బంగ్లాదేశ్, కొలంబియా వంటి కీలక మార్కెట్లలో హీరో ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఈ స్వల్ప వృద్ధి నమోదైంది. నెలవారీగా మొత్తం అమ్మకాలు చూసినట్లయితే హీరో మోటోకార్ప్ అమ్మకాలు మెరుగుపడ్డాయి. మొత్తం అమ్మకాలు 66.24 శాతం పెరిగి 5,07,701 యూనిట్లకు చేరుకున్నాయి, ఏప్రిల్ 2025లో 3,05,406 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Hero Motocorp May Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 4, 2025, 15:40 [IST]
English summary
Hero motocorp sales 1 92 percent growth recorded in may 2025 more details inside
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+