ఈ కంపెనీ టూవీలర్లను మోజు పడి కొంటున్న భారతీయలు.. సేల్స్‌లో దూసుకుపోతున్న టాప్ బ్రాండ్

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) గురించి అందరికీ తెలిసిందే. భారత్‌లో మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్, స్కూటర్స్‌ను విడుదల చేస్తూ చాలా ఏళ్లుగా టూవీలర్స్ అమ్మకాల్లో దేశంలోనే ఇతర కంపెనీల కంటే కూడా ముందు స్థానంలో ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కంపెనీ కొత్త వినియోగదారులను సంపాదించుకోవడానికి అధునాతన డిజైన్లు, ఫీచర్లతో కూడిన వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. గత ఏడాది 2024లో కూడా హీరో కంపెనీ నుంచి సరికొత్త టూవీలర్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్‌లో హీరో దేశీయంగా మంచి అమ్మకాలను సాధించడంతో పాటు ఇతర దేశాలకు మెరుగైన ఎగుమతులను నివేదించింది. ఇది 49 శాతం వృద్ధి చెందింది.

ఇదిలా ఉంటే తాజాగా కంపెనీ డిసెంబర్ నెల వాహనాల అమ్మకాల డేటాను వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 3,24,906 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. కానీ ఇది గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో 3,93,952 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. అంటే ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 17.53 శాతం తగ్గిపోయాయి. అలాగే, 2024 నవంబర్‌లో మొత్తం విక్రయాలు 4,59,805 యూనిట్లుగా నమోదు అయ్యాయి.

Hero Motocorp Sales In 2024

ఇది నెలవారీ అమ్మకాల పరంగా చూసినట్లయితే దాదాపు 29.34 శాతం తగ్గిపోయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హీరో మోటోకార్ప్ ఎనిమిది కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణంగా ఈ కంపెనీ నుంచి వచ్చే టూవీలర్లను ఇండియా ప్రజల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇవి దాదాపు రూ.1 లక్ష లోపు ధరలో లభించడం, మైలేజ్ 60 కి.మీలకు పైగా ఇస్తుండటంతో చాలా మంది హీరో టూవీలర్స్‌ను ఇష్టపడుతుంటారు.

కంపెనీకి భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మంది కస్టమర్లు ఉన్నారు. లోకల్‌గా మోడళ్లను ఉత్పత్తి చేస్తూ, ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తూనే ప్రపంచ మార్కెట్లో కూడా వాటిని విక్రయిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తన ప్లాంట్లలలో తయారీని వేగవంతం చేస్తూ, కస్టమర్లకు వేగంగా వాహనాలను డెలివరీ చేస్తుంది. 2024లో అదిరిపోయే మోడళ్లను విడుదల చేసిన కంపెనీ కొత్త ఏడాది 2025లో కూడా మరిన్ని లాంచ్‌లు చేయడానికి సిద్ధంగా ఉంది.

Hero Motocorp Destini 2025

ముఖ్యంగా జనవరి 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న 2025 ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో తన కొత్త స్కూటర్ డెస్టినీ 125(Destini 125) ధరను వెల్లడించబోతుంది. దీంతో పాటు మరిన్ని కొత్త బైక్స్, స్కూటర్లను ఇదే కార్యక్రమంలో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. హీరో డెస్టినీ 125 స్కూటర్‌ని 2024లో లాంచ్ చేయాలని భావించారు. కానీ పలు కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది

కొత్త స్టైలిష్ లుక్‌తో వస్తున్న డెస్టినీ 125ని అనేక లేటెస్ట్ ఫీచర్లతో తీసుకొచ్చారు. ఇది CVT గేర్‌బాక్స్‌ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని 125cc ఇంజిన్‌ 7,000 rpm వద్ద 9 bhp పవర్, 5,500 rpm వద్ద 10.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అదిరిపోయే సదుపాయాలు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ సపోర్ట్ వంటి ఫీచర్స్‌ను ఇది కలిగి ఉంది.

డెస్టినీ 125 అల్లాయ్ వీల్స్ హీరో జూమ్ స్కూటర్ మాదిరిగా ఉంటాయి. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌ను అందించారు. అయితే బేస్ వేరియంట్‌లో మాత్రం ముందు డ్రమ్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. డెస్టినీ 125 స్కూటర్ మార్కెట్లో హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 లకు గట్టి పోటీ ఇస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, January 6, 2025, 10:30 [IST]
English summary
Hero motocorp sales 49 percentage growth in 2024 calender year
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+