Hero Splendor Ev: హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్.. తక్కువ ధరలో ఎక్కువ దూరం!

దిగ్గజ టూవీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) ఇండియాలో బైక్స్, స్కూటర్ల విక్రయాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ధరలో వాహనాలను విడుదల చేస్తూ దేశంలో అందరి చేత గొప్ప టూవీలర్ తయారీదారుగా ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ (splendor) బైక్ అమ్మకాల్లో భారత్‌లో నం.1 స్థానంలో ఉంటుంది. మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ మోడల్ ఇది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో కనిపిస్తుంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలో లభించడంతో పాటు, మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. మార్కెట్లో ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినప్పటికి కూడా దీనికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు స్ప్లెండర్ బైక్‌ను కంపెనీ అధునికరిస్తూ తిరిగి లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ బైక్‌ను హీరో ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకురాబోతుంది.

ప్రస్తుతం, ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తూనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్లతో పాటు వీటి అమ్మకాలు కూడా బాగానే నమోదవుతున్నాయి. దీంతో హీరో కంపెనీ తన ప్రసిద్ధ మోడల్‌ స్ప్లెండర్ (splendor)‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకువస్తుంది. ఇప్పటికే ఈవీ టూవీలర్స్ అందించడంపై కీలకంగా దృష్టి పెట్టిన హీరో, వీటిలో ఈ మెడల్‌ను కూడా ఈవీగా తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

Hero Motocorp Splendor Electric Bike

సమాచారం ప్రకారం, రాజస్థాన్‌లోని జైపూర్‌లోని 'హీరో టెక్నాలజీ సెంటర్'లో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది పూర్తయిన తర్వాత దేశీయ మార్కెట్లో ఘనంగా లాంచ్ చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అన్నీ కూడా అనుకున్నట్లు జరిగితే స్ప్లెండర్ ఈవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత పెట్రోల్ మోడల్ లాగానే ఇది కూడా బాగా సక్సెస్ అవుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది.

హీరో మోటోకార్ప్‌ కస్టమర్ డిమాండ్‌ ప్రకారం, ప్రతి ఏడాది దాదాపు 2,00,000 యూనిట్ల స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను తన ప్లాంట్‌లలో తయారు చేయడానికి నిశ్చయించుకుంది. ఈ ఈవీ బైక్ పెర్ఫామెన్స్, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది 4 కిలోవాట్ (kWh), 6 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుందని తెలుస్తుంది. ధర అందుబాటులో ఉండే విధంగా రూ.లక్ష ధరతో లభించవచ్చు.

Splendor Electric Bike Will Launch Soon Details

బ్యాటరీ ప్యాక్‌లకు అనుగుణంగా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చనున్నారు. సింగిల్ ఛార్జ్‌తో ఇది ఏకంగా 120 నుంచి 180 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హీరో స్ప్లెండర్ EVని మాత్రమే కాకుండా డర్ట్ అనే మరో మోడల్‌ను కూడా తీసుకురావాలని చూస్తుంది. ఈ బైక్‌కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. దీనిని అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశీయంగా అమ్మకానికి ఉన్నటువంటి సాధారణ హీరో స్ప్లెండర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కిమీల వరకు వస్తుంది. దీని ఇంజిన్ కెపాసిటీ 97.2 సీసీగా ఉంది. ఇది భారత్‌లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2025, 15:34 [IST]
English summary
Hero motocorp splendor electric bike will launch soon expected price battery range details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+