రూ.70 వేలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. పెట్రోల్‌కి గుడ్‌బై చెప్పే సమయం.. మరికొద్ది రోజుల్లో హీరో డబుల్ లాంచ్‌లు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అలాగే మెరుగైన పెర్ఫామెన్స్ అందించే బ్యాటరీలతో కూడిన ఈవీలు విడుదల అవుతుండటంతో చాలా మంది కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఎక్కువగా ఎలక్ట్రిక్ మోడళ్ల వైపు చూస్తున్నారు. ఓలా, ఏథర్, సింపుల్ వన్ వంటి స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ఈ విభాగంలో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో, బజాజ్, హోండా, TVS వంటి ఆటోమోటివ్ దిగ్గజాలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ పోటీలోకి దిగాయి. ఈ క్రమంలో ఇప్పుడు హీరో మోటోకార్ప్ (Hero Motorcorp) కూడా తన తదుపరి అడుగును వేయబోతోంది.

ఇప్పటికే డిసెంబర్ 2024లో Vida V2 మోడల్ సిరీస్‌ను పరిచయం చేసిన హీరో, ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో రాబోతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం, హీరో తన అప్‌డేట్ చేసిన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025 జులై 1న భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇది Vida సిరీస్‌లో మరో ముఖ్యమైన ముందడుగుగా మారనుంది. ఈ కొత్త స్కూటర్లలో మెరుగైన బ్యాటరీ టెక్నాలజీని అందించనున్నారని తెలుస్తుంది.

Hero Motocorp Electric Scooters On July1st

దీంతో ఇప్పుడు ఉన్న వాటి కంటే మరింత ఎక్కువ రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల్లో టెక్నాలజీ కీలకం అయింది, దీన్ని గ్రహించిన హీరో, వినియోగదారుల లేటెస్ట్ అవసరాలు అనుగుణంగా ఈ స్కూటర్లను తీర్చిదిద్దేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజా పోటీ నేపథ్యంలో, ఈ కొత్త Vida మోడల్ హీరోకు మార్కెట్లో మరింత బలమైన స్థానాన్ని అందించవచ్చనే అభిప్రాయం పరిశ్రమవర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఒక నెల క్రితం, హీరో జులైలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, జులై 1న జరగనున్న Vida లాంచ్‌కు సంబంధించిన డేటా బయటకు వచ్చింది. అయితే, ఈ లాంచ్‌లో ఏ స్కూటర్లు వెలుగులోకి రానున్నాయన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇది రెండు వేర్వేరు మోడళ్లా? లేక ఒకే మోడల్‌కు చెందిన వేరియంట్లా? అన్నది తెలియాల్సి ఉంది. రెండు స్కూటర్లను విడుదల చేయవచ్చని మాత్రం తెలుస్తుంది.

Hero Motocorp Will Launch Two New Affordable Electric Scooters

అయితే దీని గురించి కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా కొత్త డిజైన్ థీమ్‌ను కలిగి ఉంటుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2024లో జరిగిన EICMA ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన Vida Z మోడల్‌తో పోలికలు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల మధ్య గల ధరల తేడాను తగ్గించి అందుబాటు ధరలో ఈవీలను అందించడానికి హీరో ప్రయత్నిస్తుంది.

ఈ నేపథ్యంలో హీరో కొత్త ACPD(అఫర్డబుల్ కాస్ట్ ప్లాట్‌ఫామ్ ఫర్ డెవలప్‌మెంట్) ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తోంది. మార్కెట్లో పెట్రోల్ స్కూటర్లకు సమానంగా ఉన్న ధరలే అమ్మకాలను ప్రభావితం చేస్తున్నాయి. . ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాల ధరను అందుబాటులోకి తీసుకురావడమే హీరో ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా తయారయ్యే కొత్త Vida స్కూటర్లను సుమారు రూ.70,000 ధరకు, లేదా అంతకంటే తక్కువ ధరకు మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

Hero Motocorp Electric Scooters

ఇది పెట్రోల్ స్కూటర్లతో పోటీ పడే స్థాయిలో ఉంటుందని భావించవచ్చు. కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో ఇప్పటికే తమ అడుగులు బలంగా ముద్రిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను, హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా 48,673 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం విక్రయాలతో పోలిస్తే ఏకంగా 175 శాతం వృద్ధిని సూచిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2025, 15:20 [IST]
English summary
Hero motocorp will launch two new affordable electric scooters on july 1st details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+