ఇక స్పీడ్ టెన్షన్ ఉండదు.. హీరో మోటార్‌సైకిల్‌లో ఈ బటన్ గమనించారా.. ఎందుకు ఉంటుందో తెలుసా ?

ఆటో రంగంలో దిగ్గజ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన నెక్ట్స్ జనరేషన్ హీరో గ్లామర్ 125ను రహస్యంగా పరీక్షిస్తోంది. సాధారణంగా తక్కువ ధర కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు తక్కువగా ఉంటాయి. కానీ, హీరో ఇప్పుడు కొత్త దారిలో వెళ్తోంది. ఆశ్చర్యకరంగా, కంపెనీ తన ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందించబోతోంది.

ఈ ఫీచర్ ఇప్పటివరకు కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన మావెరిక్ 440లో కూడా లేదు. కాబట్టి, తక్కువ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ కస్టమర్లను ఆకర్షించడం ఖాయం. క్రూజ్ కంట్రోల్ సాధారణంగా ఖరీదైన మోడళ్లలోనే ఉంటుంది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌లో క్రూజ్ కంట్రోల్ కోసం ఒక స్పెషల్ బటన్‌ను కూడా ఇచ్చింది. క్రూజ్ కంట్రోల్ సాధారణంగా మావెరిక్ 440, ఎక్స్‌పల్స్ 210, లేదా రాబోయే ఎక్స్‌పల్స్ 440(అనధికారిక పేరు) వంటి పెద్ద బైకులకు సరిపోతుంది.

Glamour 125

కానీ, హీరో దీనిని ఒక బడ్జెట్ కమ్యూటర్ బైక్‌పై పరీక్షిస్తోంది. 2026 గ్లామర్ 125 అని భావిస్తున్న ఈ టెస్ట్ బైక్ పూర్తిగా కవర్‌తో కనిపించింది. వింతగా, ఇది సాధారణ టెస్ట్ కవర్ కాకుండా బ్రౌన్ కలర్ డక్ట్ టేప్‌లా ఉంది.

ఈ టెస్ట్ బైక్‌లో క్రూజ్ కంట్రోల్ ఉండటం బట్టి, హీరో తన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇప్పటికే ఉన్న సిస్టమ్‌ను దీనిలో కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేనప్పటికీ టెస్ట్ యూనిట్ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ప్రస్తుత గ్లామర్ 125 ని పోలి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్గాలు, ఇది నిజంగా నెక్ట్స్ జనరేషన్ గ్లామరే అని ధృవీకరించాయి.

Glamour 125

సీక్రెటగా గుర్తించిన ఈ మోటార్‌సైకిల్‌లో బడ్జెట్ కమ్యూటర్ బైక్‌కు ఉండాల్సిన అన్ని సాధారణ ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు, బేసిక్ ట్రిపుల్-ట్రీ సెటప్, కన్వెన్షనల్ RSU, టెలిస్కోపిక్ ఫోర్క్స్, కమ్యూటర్-స్టైల్ ఫుట్‌పెగ్స్, కంప్లీటుగా కవర్ చేయబడిన చైన్ కవర్, సింగిల్-పీస్ సీట్, ఫంక్షనల్ రియర్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. ఇది రోజువారీ ఉపయోగం కోసం రూపొందించబడింది. ప్రస్తుత గ్లామర్ 125 కంటే ఇందులో చాలా అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

ఇవి కాకుండా LED టర్న్ ఇండికేటర్స్. కంప్లీట్ డిజిటల్ కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేటెడ్ స్విచ్‌గేర్, క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్‌లో అదే 124.7cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది, ఇది 10.7 bhp పవర్, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

Glamour 125

క్రూజ్ కంట్రోల్‌ను ప్రీమియం మోడళ్లకు మాత్రమే పరిమితం చేయకుండా, 125cc కమ్యూటర్ బైక్‌పై పరీక్షించాలని హీరో తీసుకున్న నిర్ణయం, కంపెనీ తన ఉత్పత్తులలో సాంకేతికతను ఉపయోగించడంలో మార్పును సూచిస్తుంది.

ఈ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించబడితే, క్రూజ్ కంట్రోల్ హీరో ప్రీమియం బైక్‌లు అయిన ఎక్స్‌పల్స్ 210, మావెరిక్ 440, ఎక్స్‌ట్రీమ్ 250R, రాబోయే జూమ్ 160 స్కూటర్లో కూడా అందుబాటులోకి వస్తుందని అంచనా. 2026 హీరో గ్లామర్ 125 విడుదలైన తర్వాత, ఇది టీవీఎస్ రైడర్ 125, రాబోయే హోండా CB125 హార్నెట్లతో నేరుగా పోటీ పడుతుంది.

డ్రైవ్ స్పార్క్ అభిప్రాయం : క్రూజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్ తక్కువ ధర కమ్యూటర్ బైక్‌లలో రావడం ఒక సానుకూల పరిణామం. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. హీరో తీసుకున్న ఈ నిర్ణయం ఇతర కంపెనీలకు కూడా స్ఫూర్తినిచ్చి, బడ్జెట్ బైకులలోనూ మంచి ఫీచర్లు రావడానికి దారితీస్తుందని ఆశిస్తున్నాం.

More from DriveSpark

Article Published On: Friday, July 25, 2025, 13:50 [IST]
English summary
Hero motorcycle to feature amazing button no more speed tension new glamour 125 with cruise control
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+