మిడిల్‌క్లాస్ కోసం మరో బైక్.. కేవలం రూ.89,999కే.. మీకు కావాల్సిన ఫీచర్లన్నీ ఉన్నాయ్!

దేశంలోని అతిపెద్ద టూవీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఇటీవల తన అత్యంత ప్రజాదరణ పొందిన 125సిసి మోటార్‌సైకిల్ గ్లామర్‌కు కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. దీని వల్ల 125సిసి బైక్ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గ్లామర్ X 125 పేరుతో విడుదలైన ఈ కొత్త మోడల్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.89,999 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.99,999గా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ ధరల శ్రేణిలో అందించే ఫీచర్లు, టెక్నాలజీలు దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. హీరో గ్లామర్ చరిత్రను చూస్తే, ఇది మొదటిసారి 2005లో భారత మార్కెట్లో ప్రవేశించింది. అప్పటి నుంచి నిరంతరం అప్‌డేట్స్‌తో, మెరుగైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వినియోగదారుల మన్ననలు పొందింది.

కొత్తగా విడుదలైన ఈ గ్లామర్ X 125లో డిజైన్ పూర్తిగా రీఫ్రెష్ చేయబడింది. అగ్రెసివ్ లుక్ కలిగిన ఫ్రంట్ కౌల్, స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్స్, షార్ప్ గ్రాఫిక్స్ ఈ బైక్‌కు లేటెస్ట్ స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. రోడ్డుపై ఈ బైక్ కనిపిస్తే, దాని ప్రీమియం ఫినిష్, ఆకర్షణీయమైన స్టైలింగ్ దృష్టిని తిప్పుకోలేనిది. టెక్నాలజీ పరంగా కూడా హీరో ఈ మోడల్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

Hero New Glamour X 125 Engine Price Design And All Top Things

పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, SMS అలర్ట్స్ వంటి ఫీచర్లు అందించారు. ఇవి ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా లభ్యమవుతున్న ఫీచర్లు కావడం ప్రత్యేకం. అదనంగా, కొత్త BS6 OBD2 నార్మ్స్‌కు అనుగుణంగా రూపొందించిన 125సిసి ఇంజిన్ మరింత ఫ్యూయల్ ఎఫిషియంట్‌గా, రిఫైన్‌డ్‌గా పనిచేస్తుంది. శక్తివంతమైన ఈ ఇంజిన్ సిటీ రైడింగ్‌కి తగిన పిక్-అప్, హైవే రైడింగ్‌కి స్థిరమైన పనితీరును అందిస్తుంది.

కొత్త హీరో గ్లామర్ X 125 ఇంజిన్ పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందుకుంది. ఇది 8,250 ఆర్‌పిఎం వద్ద 11.4 బీహెచ్‌పి శక్తిని, 6,000 ఆర్‌పిఎం వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్థాయి పనితీరు స్పోర్టీ బైక్‌లకు దగ్గరగా ఉండటం గమనార్హం. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ను జత చేశారు, దీని వల్ల సిటీ ట్రాఫిక్‌లో సాఫ్ట్ గేర్ షిఫ్ట్స్, హైవేలపై స్థిరమైన పనితీరు లభిస్తాయి.

Hero New Glamour X 125 Engine Price Design And All Top Things

సాధారణ కమ్యూటర్ బైక్‌లలో కనిపించని కొన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు, రైడ్-బై-వైర్ థ్రాటిల్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ మరింత కచ్చితంగా, స్మూత్‌గా ఉంటుంది. అంతేకాకుండా, మూడు రైడింగ్ మోడ్‌లు ఎకో (Eco), రోడ్ (Road), పవర్ (Power) ఈ బైక్‌లో అందుబాటులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణాన్ని బట్టి రైడింగ్‌ మోడ్‌ను ఎంచుకోవచ్చు.

హీరో గ్లామర్ ఎక్స్ 125‌లో మొదటిసారిగా క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ సాధారణంగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, కేటీఎం 390 డ్యూక్ వంటి ప్రీమియం బైక్‌లలో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, స్పీడ్‌ను సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి బైక్‌కు స్పెషల్ బటన్ కూడా అందించగం విశేషం.

Hero New Glamour X 125 Engine Price Design And All Top Things

గ్లామర్ X 125 ప్రత్యేకతల్లో ఒకటి దాని పోటీ ధర. అందించే ఫీచర్లు, సౌకర్యాలు, పనితీరు స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ధర సెగ్మెంట్‌లో ఉన్న ఇతర బైక్‌లతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. దీనివల్ల, ప్రాక్టికల్ బైక్ కావాలి, కానీ టెక్నాలజీ, స్టైల్ కూడా ఉండాలి అనే వినియోగదారుల అంచనాలను గ్లామర్ సమర్థవంతంగా నెరవేర్చగలుగుతోంది. ఇప్పుడు కొత్త వేరియంట్ డిజైన్, సరికొత్త ఫీచర్లు, మెరుగైన ఇంజిన్‌తో ఆకట్టుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 25, 2025, 7:20 [IST]
English summary
Hero new glamour x 125 engine price design and all top things details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+