అదిరిపోయే హీరో స్కూటర్.. డిమాండ్ పెరగకముందే వెంటనే షోరూమ్‌కు పరిగెత్తండి!
హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన టూవీలర్ విభాగంలో నంబర్ వన్ తయారీదారుగా భారత మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకుంది. బైక్ విభాగంలో ఇప్పటికే తిరుగులేని పేరు సంపాదించుకున్న ఈ సంస్థ, ఇప్పుడు స్కూటర్ విభాగంపైనా దృష్టి సారించింది. ఈ క్రమంలో జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో, హీరో జూమ్ 160 (Hero Xoom 160) అనే స్టైలిష్, పవర్‌ఫుల్ స్కూటర్‌ను సంస్థ ప్రదర్శించింది. డైనమిక్ డిజైన్, స్పోర్టీ బిల్డ్, ప్రీమియం లక్షణాలతో, ఈ స్కూటర్ అప్పటినుంచి యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ అడ్వెంచర్-స్టైల్ స్కూటర్ ఈ ఏడాది ప్రారంభంలోనే లాంచ్ అయింది. లాంచ్ అయినప్పటికి కూడా దాని బుకింగ్స్‌ను అప్పుడు ప్రారంభించలేదు. అయితే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్తే. తాజాగా కంపెనీ దీని బుకింగ్స్‌ను ప్రారంభించింది.
ఎక్స్-షోరూమ్ ధర రూ.1.49 లక్షలుగా నిర్ణయించిన ఈ మోడల్, మొదట్లో లాంచ్ అయిన వెంటనే డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రావాల్సి ఉండేది. అయితే, కొన్ని ఆపరేషనల్ పరిమితుల వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు పుల్ స్టాప్ పడింది. షోరూమ్‌లలో స్కూటర్ స్టాక్ చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ఆగస్టు చివరి నాటికి అధికారిక డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశముంది.

అడ్వెంచర్ ఫీల్, మస్కులర్ బాడీ లైన్, స్పోర్టీ డిజైన్‌తో ఈ స్కూటర్ మార్కెట్లో ఒక డిఫరెంట్ సిగ్నేచర్ ఇచ్చేలా కనిపిస్తోంది. నగరంలో డైలీ రైడింగ్‌తో పాటు లాంగ్ రైడ్‌లను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. హీరో జూమ్ 160 స్కూటర్‌కి ఉన్న ఆకర్షణ కేవలం దాని లుక్స్ మాత్రమే కాదు, ఇందులో ఉన్న శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ కూడా ప్రధాన హైలైట్.
ఇందులో 156 సిసి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది గరిష్టంగా 14PS హార్స్‌పవర్, 13.7Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ పవర్‌తో పాటు మైలేజీ కూడా ఈ స్కూటర్‌కు ప్లస్ పాయింట్. కంపెనీ అంచనాల ప్రకారం, ఇది సుమారు 40 కి.మీ లీటర్‌కు మైలేజ్ ఇస్తుంది. అంటే డైలీ ప్రయాణాల కోసం ఈ స్కూటర్ ఒక వినూత్నమైన, ఆర్థికంగా మేలు చేసే ఎంపిక అవుతుంది.

ఫీచర్ల పరంగా చూస్తే, ఇది మామూలు స్కూటర్ కాదు. ఇందులో LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, i3S స్మార్ట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, సైలెంట్ స్టార్టర్, కీలెస్ ఇగ్నిషన్‌తో కూడిన స్మార్ట్ కీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రిమోట్ సీట్ ఓపెనింగ్ స్విచ్, USB ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లు ఉన్నాయి. నగర జీవితానికి మోడ్రన్ టచ్‌తో కూడిన పర్ఫెక్ట్ రైడ్ ఇది అందిస్తుంది.
హీరో జూమ్ 160 డిజైన్ పరిమాణాల పరంగా కూడా యూజర్లను ఆకర్షించేలా ఉంది. దీని డైమెన్షన్లు, రోజువారీ వాడకంలో ప్రాక్టికల్ గా ఉండేలా రూపొందించబడ్డాయి. ఇది 1983 మిమీ పొడవు, 772 మిమీ వెడల్పు, 1214 మిమీ ఎత్తుతో వస్తోంది. అంటే, రైడర్‌కు సౌకర్యంగా ఉండే విధంగా సమతుల్యత కలిగిన డిజైన్ ఇది. 155 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో రోడ్లపై గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వంటి వాటిని ఈజీగా దాటేయచ్చు.

ఇదే సమయంలో, 1348 మిమీ వీల్‌బేస్ ఈ స్కూటర్‌కు మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది, ముఖ్యంగా హైవే డ్రైవ్‌ల్లో. బరువు విషయానికి వస్తే, ఇది 142 కిలోలు మాత్రమే. రోజువారీ వాడకానికి తేలికగా మేనేజ్ చేయదగిన బరువుగా చెప్పవచ్చు. అలాగే, 7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉండడం వల్ల, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే చాలామందికి వారం పాటు ఆఫీస్ వర్క్, షాపింగ్ వంటి అవసరాలు పూర్తి అవుతాయి.


Click it and Unblock the Notifications








