సరికొత్తగా మార్కెట్లోకి రాబోతున్న హీరో స్ప్లెండర్ బైక్.. ఈ సారి డిస్క్ బ్రేక్స్ కూడా.. ధర చాలా తక్కువ

ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రముఖ కంపెనీ హీరో టాప్ ప్లేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ తయారు చేసే హీరో స్ప్లెండర్ మోటర్ సైకిళ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. వాటిని మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కవగా కొనుగోలు చేస్తారు. అయితే హీరో స్ప్లెండర్ నుంచి త్వరలో కొత్త మోడల్ రాబోతుంది. రాబోయే 2025 స్ప్లెండర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఈ బైక్ లలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్ లో హీరో స్ప్లెండర్ ఒకటి. దీని కొత్త మోడల్ త్వరలోనే రాబోతుంది. 2025 స్ప్లెండర్ ఫోటోలు అధికారిక లాంచ్ కు ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొత్త ఎడిషన్‌లో ముఖ్యంగా బ్రేకింగ్ పనితీరు మెరుగు పరిచేందుకు ముందు డిస్క్ బ్రేక్‌ను జోడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ బైక్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో రాబోతుంది. ఇది 240ఎంఎం పరిమాణంలో ఉంటుందని అంచనా.

Hero Splendor 2025

ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.77,176(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. డిస్క్ బ్రేక్స్ తో కూడిన కొత్త స్ప్లెండర్ ధర దాదాపు రూ.80వేలు ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు రిలీజైన బైకుల్లో అత్యంత ఎక్కువ ఫీచర్లు కలిగిన స్ప్లెండర్ బైక్ ఇదే. ఇది ప్రస్తుతం టీవీఎస్ రేడియన్, బజాజ్ ప్లాటినా 100వంటి మోడల్స్‎తో పోటీ పడుతుంది.

కొత్త మోడల్ ఇప్పుడు క్యాండీ రెడ్ కలర్‌తో వస్తుంది. ఇది 2000ల నాటి ప్రారంభ మోడల్‎ను గుర్తుకు తెస్తుంది. దీని అభిమానులకు గత జ్ఞాపకాలను అందిస్తోంది. మ్యాట్ యాషెస్ గ్రే కలర్ లో లభిస్తుంది. ఇది ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. ఈ అప్ డేట్స్ బైక్ లుక్ ఎట్రాక్టిక్ గా చేస్తున్నాయి. ఇంజిన్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది వరకు ఉండే 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తూనే ఉంది.

Hero Splendor Disc Brakes

ఈ ఇంజిన్ 8.02PS పవర్, 8.05Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తాజా OBD2Bనిబంధనలకు అనుగుణంగా ఉంటుందని చెబుతున్నారు.స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియన్ మోడళ్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. దీని ధర రూ. 59,880 నుంచి ప్రారంభమవుతుంది. ధర విషయంలో బజాజ్ ప్లాటినా 100తో పోటీ పడుతుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ తో సస్పెన్షన్ సెటప్ మారదు. వెనుక షాక్ అబ్జార్బర్లు మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తాయి.

ఈ బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇంట్రడ్యూస్ తో డ్రమ్ బ్రేక్ సెటప్ కంటే మెరుగైన బ్రేకింగ్ పవర్ అందిస్తుంది. ఈ డెవలప్మెంట్ ఆధునిక సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకువస్తుంది. ఇది అన్ని రకాల రోడ్ల మీద సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంది. స్ప్లెండర్ బైక్ చాలా ఏళ్లుగా మార్కెట్లో ఉంది. కాలానుగుణంగా ఈ బైక్ లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు డిస్క్ బ్రేకులను తెస్తుంది హీరో కంపెనీ.

Splendor Disc Brakes

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2025, 16:50 [IST]
English summary
Hero splendor 2025 with disc brakes new model to launch at an affordable price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+