దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే పేద, మధ్యతరగతి వారి బండికి షాకిచ్చిన కస్టమర్లు.. అమ్మకాల్లో ఊహించని మార్పు!

దేశంలోని రోడ్లపై ఎక్కడ చూసినా కనిపించే బైక్ అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది "హీరో స్ప్లెండర్ (Hero Splendor)". సింపుల్ డిజైన్, అనుకూలమైన ధర, మైలేజీలో మహారాజు, ఇవన్నీ కలిసి స్ప్లెండర్‌ను పేద, మధ్యతరగతి ప్రజలకు నమ్మరమైన మోడల్‌గా మార్చాయి. చిన్న నగరం అయినా, గ్రామమైనా, పట్టణమైనా, ప్రతి కుటుంబంలో కనీసం ఒక స్ప్లెండర్ కనిపిస్తుంది. అంతటి పాపులారిటీ ఉన్న ఈ మోడల్ ఈ ఏప్రిల్‌లో మాత్రం కొంచెం వెనుకబడింది. 2025 ఏప్రిల్‌లో హీరో మోటోకార్ప్ మొత్తం 1,97,893 యూనిట్ల స్ప్లెండర్ బైకులను విక్రయించింది. అయితే, 2024లో ఇదే నెలలో అమ్మకాల సంఖ్య 3,20,959 యూనిట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాదిలోనే అమ్మకాలు దాదాపు 38.3 శాతం మేరకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇది చిన్న విషయం కాదు. ఎప్పటికప్పుడు టాప్ సెల్లింగ్ బైక్‌గా కొనసాగుతున్న స్ప్లెండర్‌కు ఇదొక హెచ్చరిక లాంటిదే. ధరల పెరుగుదల, కొత్త మోడల్స్‌తో మార్కెట్‌లో పోటీ, మారుతున్న వినియోగదారుల అభిరుచులు కలిసి తగ్గుదలకు కారణాలు కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అయినా కూడా తక్కువ ధర, ఎక్కువ మైలేజీతో ఇంకా చాలా మంది వినియోగదారుల మనసులో స్థానం సంపాదించింది. ప్రస్తుతం అమ్మకాలు తగ్గడానికి కంపెనీ నుంచి ఎలాంటి స్పష్టమైన కారణం వెలువడలేదు.

Hero Splendor Bike 197893 Sales

ఈ మధ్యకాలంలో వినియోగదారుల ఆర్థిక స్థితి మారిపోతుండటంతో, ఇప్పుడు వారు మరింత స్టైలిష్, ప్రీమియం మోడళ్లవైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఇది కూడా స్ప్లెండర్ అమ్మకాలపై ప్రభావం చూపింది. అంతేకాదు, ఏప్రిల్ నెలలో పెద్దగా పండుగలు లేకపోవడం కూడా అమ్మకాల తక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ తగ్గుదల కొంత కాలం వరకు మాత్రమే ఉండవచ్చు, రాబోయే పండగల సీజన్‌లో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

మార్కెట్లో పోటీ పెరిగినప్పటికీ, స్ప్లెండర్‌కి ఉండే స్థానం వేరేలా ఉంటుంది. ఒక తరాలుగా కొనసాగుతున్న పేరు. కొన్ని నెలలు అమ్మకాలు తగ్గినా, దాని మీద వినియోగదారుల నమ్మకం మాత్రం అసలూ తగ్గదు. ఇది ఒక మన దేశానికి చిహ్నంగా నిలిచిన మోటార్ సైకిల్. మధ్యతరగతి ప్రజలకు ఇది మొదటి ఎంపిక మోడల్. ప్రస్తుతం దేశీయంగా స్ప్లెండర్ రెండు ప్రధాన వేరియంట్లలో స్ప్లెండర్ ప్లస్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ లలో లభిస్తుంది.

Hero Splendor Bike

స్ప్లెండర్ ప్లస్ డిజైన్ సింపుల్ అయినా, పనితీరులో బలమైన మోడల్. అందుకే దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది బాగా ఇష్టమైన బైకుగా చాలా ఏళ్లుగా ఆదరణ పొందుతుంది. ధర పరంగా చూస్తే దీని ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ. 79,000 నుండి రూ. 85,000 వరకు ఉన్నాయి. ఇది 97.2 సిసి OBD2B పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కిలోమీటర్ల మైలేజ్ అందించగలదు.

రోజువారీ ప్రయాణాల్లో ఇది ఎంతో మందికి ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల నగరాల్లో ట్రాఫిక్ మధ్యలో అయినా, హైవే రైడింగ్‌లో అయినా, ఈ బైక్ స్మూత్‌గా స్పందిస్తుంది. కొత్త స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది డిస్క్, డ్రమ్ బ్రేక్‌ల్లో వినియోగదారుడికి అదనపు నమ్మకాన్ని అందిస్తుంది.

Hero Splendor Bike Sales

సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్(Super Splendor Xtec) గురించి చూసినట్లయితే ఇది 124.7 సిసి పెట్రోల్ ఇంజిన్ సాయంతో మరింత శక్తివంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేయబడి ఉంది. హైదరాబాద్‌లో ఇది రూ. 86,200 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మైలేజీ విషయానికి వస్తే, ఇది 69 kmpl వరకు అందించగలదని కంపెనీ పేర్కొంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2025, 11:00 [IST]
English summary
Hero splendor bike 197893 sales recorded in april 2025 more details check
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+