రోజుకు 10,000 మంది కొనే హీరో బైక్ ఇదే.. ఏ షోరూంలో చూసిన జనం కుప్పలు కుప్పలు
ప్రపంచంలోనే టూ వీలర్లు (బైకులు, స్కూటర్లు) ఎక్కువగా అమ్ముడయ్యే దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో ప్రతి నెలా లక్షల్లో టూ-వీలర్లు అమ్ముడవుతున్నాయి. గత మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. గత మే నెలలో ఎక్కువ మంది కొన్న మొదటి 10 టూ-వీలర్లు అన్నీ కలిపి దాదాపు 12లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. కచ్చితంగా చెప్పాలంటే టాప్-10లో ఉన్న టూ-వీలర్ల మొత్తం అమ్మకాల సంఖ్య 11,84,386.
ఈ జాబితాలో ఉన్న టాప్-10 టూ-వీలర్లు, గత 2024 మే నెలలో మొత్తం 11 లక్షల 41 వేల 891 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, గత సంవత్సరం మే నెలతో పోలిస్తే, ఈ సంవత్సరం మే నెలలో ఈ 10 టూ-వీలర్ మోడల్స్ 42,495 యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అంటే, అమ్మకాలు పెరిగాయన్న మాట!

ఈ టాప్-10 లిస్టులో చివరి 10వ స్థానంలో ఉన్న బైక్ టీవీఎస్ రైడర్ 125. 125సీసీ ఇంజిన్‌తో స్పోర్టీ లుక్ ఉండే బైక్‌ను కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. గత 2024 మే నెలలో 37, 401 రైడర్ బైకులు అమ్ముడవగా, గత మే నెలలో కాస్త తక్కువగా 35 వేల 401 రైడర్ బైకులు అమ్ముడయ్యాయి.
దీని కంటే కొన్ని వేల యూనిట్లు ఎక్కువగా అమ్ముడైన టీవీఎస్ మోటార్‌కు చెందిన మరో పాపులర్ బైక్ టీవీఎస్ ఎక్స్‌ఎల్, 37,264 యూనిట్ల అమ్మకాలతో 9వ స్థానంలో ఉంది. 10వ, 9వ స్థానాల్లోనే కాదు, 8వ,6వ స్థానాల్లో కూడా టీవీఎస్ మోటార్‌కు చెందిన టూ-వీలర్లే ఉన్నాయి.

మొత్తంగా చూస్తే, టాప్-10 టూ-వీలర్లలో నాలుగు మోడల్స్ టీవీఎస్ కంపెనీకి చెందినవే. అయితే, ఈ నాలుగు టీవీఎస్ టూ-వీలర్ మోడల్స్ చివరి 5 స్థానాల్లోనే ఉన్నాయి. 8వ స్థానంలో టీవీఎస్ అపాచి 49,099 బైకులతో ఉండగా, 6వ స్థానంలో టీవీఎస్ జూపిటర్ 97,606 స్కూటర్ల అమ్మకాలతో ఉంది.
ఈ రెండింటి అమ్మకాలు 2024 మే నెలతో పోలిస్తే అపాచికి 29%, జూపిటర్‌కు 28% పెరిగాయట. ఈ రెండింటి మధ్యలో, సుజుకి యాక్సెస్ 7వ స్థానంలో ఉంది. గత మే నెలలో 75,778 యాక్సెస్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2024 మే నెలలో కేవలం 64, 812 యాక్సెస్ స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్న హీరో హెచ్.ఎఫ్. డీలక్స్ బైక్, గత నెలలో లక్షకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. కచ్చితంగా చెప్పాలంటే, గత నెలలో 1,07,768 హెచ్.ఎఫ్. డీలక్స్ బైకులు అమ్ముడయ్యాయి. 2024 మే నెలలో 87,143 హెచ్.ఎఫ్. డీలక్స్ బైకులు మాత్రమే అమ్ముడయ్యాయి.
4వ స్థానంలో బజాజ్ పల్సర్ 1,22,151 బైకుల అమ్మకాలతో ఉంది. 2024 మే నెలలో 1, 28,480 పల్సర్ బైకులు అమ్ముడయ్యాయి. ఈ లిస్టులో 3వ, 2వ స్థానాల్లో హోండా షైన్, హోండా యాక్టివా వరుసగా 1,58, 271..1,90,713 యూనిట్ల అమ్మకాలతో ఉన్నాయి. ఈ లిస్టులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని, భారతీయులు ఎక్కువగా కొనే టూ వీలర్‌గా ఎప్పటిలాగే హీరో స్ప్లెండర్ నిలిచింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: గత మే నెలలో హీరో మోటోకార్ప్ దాదాపు 3,10,335 స్ప్లెండర్ బైకులను అమ్మింది. 2వ స్థానంలో ఉన్న యాక్టివాకు, స్ప్లెండర్‌కు మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్ప్లెండర్ బైకుల అమ్మకాలు పెరుగుతూనే ఉండడం. ఇది నిజంగా హీరో స్ప్లెండర్‌కు తిరుగులేదని చూపిస్తుంది.


Click it and Unblock the Notifications








