ఇంత తక్కువ ధరలో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్? అయితే జనాలు ఎగబడతారు!

హీరో స్ప్లెండర్ (Hero Splendor) పేరు వింటేనే మనసుకు వచ్చే నమ్మకం, సౌకర్యం, సరసమైన ధర అనే మూడు మాటలు. భారతదేశంలోని ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ఈ బైక్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు; లక్షలాది కుటుంబాల జీవన భాగస్వామి. దశబ్దకాల క్రితం మార్కెట్లోకి అడుగు పెట్టిన హీరో స్ప్లెండర్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాదరణలో ఏ మాత్రం తగ్గలేదు. పట్టణాల్లో ఇది ఆఫీస్ ఉద్యోగుల దినచర్యలో భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ బైక్ ఫుడ్ డెలివరీ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు వంటి అనేక వర్గాల ప్రజల జీవితాల్లో ముఖ్యమైన సాధనంగా మారింది.

ట్రాఫిక్‌లోనూ, చిన్న రోడ్లలోనూ ఈ బైక్ సులభంగా నడపగలగడం, తక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండటం దీని ప్రధాన బలాలు. అదే సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో స్ప్లెండర్ రైతుల స్నేహితుడిగా పేరు తెచ్చుకుంది. మట్టి రోడ్లు, పొలాలు, దారిలోని గుంతలు, ఏ అవాంతరం వచ్చినా ఈ బైక్ దూసుకుపోతుంది. పొలాల నుండి ఇంటికి పంటలు, సరకులు, రోజువారీ అవసరాల వస్తువులు రవాణా చేయడంలో ఇది రైతులకు నిజమైన తోడుగా ఉంటుంది.

Hero Splendor Ev Wll Be Launched Soon In India

అంతేకాదు, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ పని చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా మేలు చేస్తోంది. దశాబ్దాలుగా నంబర్ వన్ సేల్స్‌ను కొనసాగిస్తున్న హీరో స్ప్లెండర్ ఇప్పుడు కొత్తగా అడుగుపెడుతోంది. ఇంతవరకు పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా నడిచే బైక్ ఇప్పుడు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో రాబోతోందని సమాచారం. తక్కువ నిర్వహణ ఖర్చుతో, ఇంకా ఆధునిక డిజైన్‌తో కొత్త స్ప్లెండర్ EV అడుగు పెట్టబోతుందని సమాచారం.

హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై అధికారిక ప్రకటన కంపెనీ నుంచి ఇంకా వెలువడకపోయినప్పటికీ, ఈ బైక్ గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. దీనిని 2027 నాటికి దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సరసమైన ధరతోనే ఈ బైక్ అందుబాటులో ఉండబోతోందని భావిస్తున్నారు. అంచనా ప్రకారం ధర సుమారు రూ.99,000(ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు, ఇది మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు చాలా అందుబాటులో ఉండే స్థాయిలోనే ఉంది.

Hero Splendor Ev Wll Be Launched Soon In India

పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బైక్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో రానుందని సమాచారం. ఇది 4 కిలోవాట్(kWh), 6 కిలోవాట్(kWh) సామర్థ్యం గల రెండు వేరియంట్‌ల బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉండవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఈ బైక్ 120 నుండి 180 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత నగర ప్రయాణం గానీ, గ్రామీణ ప్రాంతాల్లో దైనందిన ప్రయాణం గానీ సులభంగా చేయవచ్చు.

దీనికి తోడు, హీరో స్ప్లెండర్ EVలో అనేక ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉండనున్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, GPS ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు డ్రైవర్‌కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. అదనంగా, క్లౌడ్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి సౌకర్యాలు కూడా అందులో ఉండవచ్చని సమాచారం. దీనికి మంచి LED హెడ్‌ల్యాంప్, LED DRL, అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పటికీ మోటార్‌సైకిల్ ప్రేమికుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ బైక్ సింపుల్ డిజైన్, విశ్వసనీయ పనితీరు, అద్భుతమైన మైలేజీ కారణంగా భారతీయ రహదారులపై అత్యధికంగా కనిపించే మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటి మార్కెట్ ధరల ప్రకారం, హీరో స్ప్లెండర్ ప్లస్ ధర రూ. 73,946 నుండి రూ. 74,970 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, October 5, 2025, 16:01 [IST]
English summary
Hero splendor ev wll be launched soon in india here expected price and range details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+