70 కి.మీ మైలేజ్ బైక్ నెలకు రూ.2,400తో.. పేదవాడి బండి నెలవారీ EMI వివరాలు మీ కోసం

భారతీయ మధ్యతరగతి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బైక్ అంటే హీరో స్ప్లెండర్ ప్లస్‌ (Hero Splendor Plus)కే చెందుతుంది. పనితీరు, మైలేజ్ పరంగా అత్యుత్తమ ఫలితాలు ఇవ్వడం వంటివి దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. నగరాలు, పట్టణాలు, గ్రామీణ రోడ్లపై సౌకర్యవంతమైన రైడింగ్ కోసం రూపొందించిన ఈ బైక్, రోజువారీ ప్రయాణాల కోసం అద్భుతమైన భాగస్వామి. దీని క్లాసిక్ లుక్ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తుంది, అదే సమయంలో మోడరన్ టచ్ కూడా ఇస్తుంది. హీరో కంపెనీ దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కేటగిరీలో అందుబాటులో ఉంచింది. దీని ధర రూ. 73,946 నుంచి రూ. 76,437 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర, నెలవారీ EMI ఎంపికను ఇక్కడ మేము క్లుప్తంగా వివరించాము.

ముందుగా స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ గురించి మాట్లాడితే, దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 95,800. ఈ బైక్‌ను మీరు రూ. 20,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. మిగిలిన రూ. 75,800 వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్‌పై 9 శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల కాలానికి EMI సుమారు నెలకు రూ. 2,400 ఉంటుంది. అంటే, సులభమైన చెల్లింపుల ద్వారా బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.

Hero Splendor Plus Onroad Price And Monthly Emi Details Here

స్ప్లెండర్ ప్లస్ i3S టెక్నాలజీతో కూడిన వెర్షన్దీ ప్రత్యేకత ఏమిటంటే, సిగ్నల్, ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది, ఫ్యూయల్ వృథా కాకుండా మైలేజ్ పెరుగుతుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 94,000. ఈ మోడల్‌ను కూడా రూ. 20,000 డౌన్ పేమెంట్‌తో తీసుకోవచ్చు, ఇందులో రూ. 74,000 లోన్ లభిస్తుంది. EMI నెలకు రూ. 2,300గా ఉండగా, వడ్డీ రేటు 9 శాతం వద్ద మూడు సంవత్సరాలకు చెల్లించవచ్చు.

స్ప్లెండర్ ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ సౌకర్యవంతమైన టెక్నాలజీతో కూడిన మోడల్. దీని ఆన్-రోడ్ ధర రూ. 93,000. దీన్ని రూ. 20,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, రూ. 73,000 వరకు లోన్ పొందవచ్చు. 9 శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాలకు నెలవారీ EMI సుమారు రూ. 2,300 ఉంటుంది. ఈ వెర్షన్ స్మార్ట్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సాంకేతిక ఫీచర్లను కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

Hero Splendor Plus Onroad Price And Monthly Emi Details Here

మరొక వెర్షన్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్. ఇది మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు డిజైన్ పరంగా కూడా మోడరన్ ఫీలింగ్ ఇస్తుంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 96,000 వరకు ఉంటుంది. దీనికీ రూ. 20,000 డౌన్ పేమెంట్ సరిపోతుంది, మిగిలిన రూ. 76,000 వరకు లోన్ తీసుకోవచ్చు. EMI నెలకు రూ. 2,400 వరకు ఉంటుంది, వడ్డీ రేటు 9 శాతం, కాలం మూడు సంవత్సరాలు.

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇతర వివరాలను చూసినట్లయితే, బైక్‌లో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.02 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, అలాగే 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అంటే నగర రహదారులపై గానీ, చిన్న ప్రయాణాల్లో గానీ ఈ బైక్ సులభంగా నడిపించవచ్చు, ఇంజిన్ స్మూత్‌గా, తక్కువ వైబ్రేషన్‌తో పనిచేస్తుంది.

Hero Splendor Plus Onroad Price And Monthly Emi Details Here

ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది వినియోగదారులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఫీచర్ల పరంగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు, ఫోన్ కనెక్ట్ చేసుకోవడం, కాల్ అలర్ట్స్ చూడడం వంటి సౌకర్యాలు ఇప్పుడు రోజువారీ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 7, 2025, 14:30 [IST]
English summary
Hero splendor plus onroad price and monthly emi details here
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+