ఆ కంపెనీ షోరూమ్ సిబ్బందిని తినడానికి కూడా టైం ఇవ్వని కస్టమర్లు.. తక్కువ ధరకే అని ఎగబడుతున్నారు

దసరా, దీపావళి పండుగలతో దేశవ్యాప్తంగా ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. పండుగల సీజన్ అనగానే ప్రజల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఉత్సాహం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది పరిస్థితులు ఆటోమొబైల్ రంగానికి చాలా అనుకూలంగా మారాయి. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ (GST) తగ్గింపు టూవీలర్ మార్కెట్‌లో కొత్త ఊపును తెచ్చింది. ముఖ్యంగా 100 సిసి, 125 సిసి విభాగాల్లో ఈ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, జీఎస్టీ తగ్గింపుతో వాహనాల మొత్తం ధర తగ్గడం వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో మొదటిసారి బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త ఆసక్తి కారణంగా ద్విచక్ర వాహన మార్కెట్‌లో మళ్లీ రద్దీ పెరిగింది.

దేశంలో అగ్రగామి ద్విచక్ర వాహన తయారీదారైన హీరో మోటోకార్ప్ పండుగ సీజన్‌ను బంపర్ సేల్స్‌తో ప్రారంభించింది. కంపెనీ ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌లలో కస్టమర్ సందర్శనల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది షోరూమ్‌లను సందర్శిస్తున్న కస్టమర్ల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిందని హీరో వెల్లడించింది. ప్రస్తుతం హీరో స్ప్లెండర్, HF డీలక్స్, గ్లామర్ వంటివి మంచి ఆదరణ పొందాయి.

Hero Two Wheelers Festival Season Sales Growth After Gst Cut India 2025

స్కూటర్ సెగ్మెంట్‌లో డెస్టిని, మాస్ట్రో ఎడ్జ్ వంటి మోడళ్లకు అధిక డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇవి తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా సాధారణ ప్రజల ఆదరణ పొందుతున్నాయి. దసరా పండుగతో ప్రారంభమైన ఈ ఆటోమొబైల్ ఉత్సవం హీరో మోటోకార్ప్‌కు గోల్డెన్ సీజన్‌గా మారే అవకాశముంది. తగ్గిన GST, పెరిగిన వినియోగదారుల ఆసక్తి, బలమైన ఫెస్టివల్ సేల్స్ కలసి, భారత టూవీలర్ మార్కెట్ మళ్లీ వేగం అందుకుంటోంది.

హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ, ఈ దసరా సీజన్‌లో వాహన కొనుగోళ్లలో భారీ పెరుగుదల నమోదైందని వెల్లడించారు. ఈ పండుగ సీజన్‌లో ప్రధాన ఆకర్షణ వాహనాలపై వినియోగదారుల అసాధారణ ఆసక్తి. నవరాత్రి మొదటి రోజున మా షోరూమ్‌లకు వచ్చిన కస్టమర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే రెట్టింపైంది. ఇది మా ఉత్పత్తులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని తెలిపారు.

Hero Two Wheelers Festival Season Sales Growth After Gst Cut India 2025

వర్మ మాట్లాడుతూ, ఇటీవల అమల్లోకి వచ్చిన GST 2.0, కొత్త ధరల అంచనాల వల్ల కొంతకాలంగా నెమ్మదిగా సాగిన అమ్మకాలు ఇప్పుడు వేగంగా పుంజుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడంలో చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఈ పండుగ సీజన్‌లో బైక్, స్కూటర్ విభాగాల రెండింటిలోనూ డిమాండ్ పెరిగింది అని ఆయన వివరించారు.

హీరో తాజాగా 12 సెగ్మెంట్లలోని ప్రముఖ మోడళ్లతో ప్రత్యేక ఫెస్టివల్ రేంజ్‌‌ను ప్రారంభించింది. ఈ కొత్త లైన్‌అప్ వినియోగదారుల్లో మంచి స్పందనను పొందుతోంది. స్ప్లెండర్, గ్లామర్, పాషన్ Xtec, స్కూటర్ విభాగంలోని డెస్టిని, ప్లేజర్+, మాస్ట్రో ఎడ్జ్ వంటి మోడళ్లు ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. అశుతోష్ వర్మ చెప్పినట్లు, డిజిటల్ ఎంక్వైరీలు, షోరూమ్ సందర్శనలు కూడా దాదాపు 3 రెట్లు గణనీయంగా పెరిగాయి.

Hero Two Wheelers Festival Season Sales Growth After Gst Cut India 2025

మొత్తంగా చూస్తే, దసరా పండుగతో ప్రారంభమైన ఈ ఆటోమొబైల్ ఉత్సవం హీరో మోటోకార్ప్‌కు గోల్డెన్ సీజన్‌. దీపావళి కూడా ఇదే నెలలో ఉండటంతో హీరో షోరూమ్‌లకు కస్టమర్లు మరింత క్యూ కట్టడం ఖాయంగా ఉంది. ప్రధానంగా జీఎస్టీ తగ్గిన ప్రభాగం బడ్జెట్ టూవీలర్స్‌పై ఎక్కువగా కనిపిస్తుండటంతో జనాలు ఈ నెలలో భారీగా హీరో షోరూమ్‌లకు రానున్నారు. భారత టూవీలర్ మార్కెట్ మళ్లీ వేగం అందుకుంటోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2025, 16:30 [IST]
English summary
Hero two wheelers festival season sales growth after gst cut india 2025
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+