ఇవి ఎందుకంత ఫేమస్? హీరో విడా స్కూటర్లకు గత నెలలో భారీ డిమాండ్.. 11 వేలు అమ్మేసింది!
హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన విప్లవాత్మక విడా బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ టూవీల్ రంగంలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటోంది. ఈ బ్రాండ్ కింద విడుదలైన Vida V2, VX2 మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి. ఈ స్కూటర్లు శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, ఇంటెలిజెంట్ ఫీచర్లతో అందుబాటులో ఉండటం వల్ల యువత నుండి వృద్ధుల వరకు అందరిని బాగా ఆకర్షించాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జూలై 2025లో ఈ హీరో విడా స్కూటర్లు భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. జూన్‌తో పోలిస్తే అమ్మకాలలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇది హిరో విడా స్కూటర్లపై ఉన్న పాజిటివ్ మౌత్‌టాక్‌ను, కస్టమర్ల సంతృప్తిని స్పష్టంగా సూచిస్తోంది.
హీరో మోటోకార్ప్ తన విడా బ్రాండ్‌తో జూలై 2025లో సక్సెస్‌ను అందుకుంది. ఒక్క నెలలోనే కంపెనీ 11,226 యూనిట్ల విడా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సంఖ్యలో 10,489 యూనిట్లు వాహన్ పోర్టల్‌లో అధికారికంగా నమోదు కావడం గమనార్హం. ఇది కంపెనీ విక్రయాల ప్రామాణికతకు, నమ్మకానికి నిదర్శనం. దీంతో హీరో విడా బ్రాండ్ ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో 10.2 శాతం వాటాను పొందగలిగింది.

అంటే, ప్రతి 10 ఇ-స్కూటర్లలో ఒకటి విడాదే అన్న మాట! ఇది హిరో మోటోకార్ప్ వంటి సంప్రదాయ టూవీలర్ తయారీదారు ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంత వేగంగా ఎదుగుతుందో తెలిపే సంకేతం. వినియోగదారులకు సరిపోయే ధరలు, ఆకర్షణీయమైన డిజైన్, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే ఫీచర్లు, దృఢమైన డీలర్ నెట్‌వర్క్. అంతేకాకుండా, బ్యాటరీ రేంజ్, చార్జింగ్ సౌలభ్యం వంటి అంశాల్లో కూడా Vida స్కూటర్లు గొప్ప గుర్తింపు పొందాయి.
ఈ స్కూటర్ల వేరియంట్ల విభిన్నత వల్ల వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు. అలాగే, లాంగ్ రేంజ్, రీప్లేసబుల్ బ్యాటరీల వంటి ఫీచర్లు, శక్తివంతమైన బ్రేకింగ్, స్మార్ట్ డిజిటల్ కన్సోల్ వంటి లేటెస్ట్ అంశాలు ఈ స్కూటర్లకు ఆదరణ పెరిగేలా చేశాయి. దేశీయంగా తయారైన ఈ స్కూటర్లు భారత మార్కెట్ అవసరాలను పోటీదారులను ఎదుర్కొంటూ తన స్థానం మరింత బలపరచుకుంటోంది.

హీరో విడా V2 పేరుతో మూడు వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విడా V2 లైట్ అనే వేరియంట్ ధర రూ.74,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది, ఇది బడ్జెట్ కొనుగోలుదారుల కోసం మంచి ఆప్షన్. దీంట్లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంచారు. ఇది 94 కి.మీ. రేంజ్ అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 69 కి.మీ వేగం సాధించగలదు. V2 ప్లస్ ధర రూ.92,800 (ఎక్స్-షోరూమ్).
దీనిలో 3.44 kWh బ్యాటరీని అమర్చారు. ఫుల్ చార్జ్‌లో 143 కి.మీ. రేంజ్ అందించగలదు. గంటకు 85 కి.మీ.ల గరిష్ట వేగంను అందిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా ఇది రోజువారి వినియోగానికి సరిపోయే స్కూటర్‌గా నిలుస్తుంది. విడా V2 ప్రో మోడల్‌లో 3.94 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లభిస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 165 కి.మీ.లు నడపగలదు. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ.

హీరో విడా Vx2 విషయానికి వస్తే, ఇది బాస్ (BAS)లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. దీని ధర కేవలం రూ.44,990 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. అదే వేరియంట్‌ను స్టాండర్డ్ ప్లాన్ కింద కొనుగోలు చేస్తే, దాని ధర రూ.73,840 ఉంటుంది. ఇది 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పూర్తి ఛార్జ్ చేసినప్పుడు ఇది 92 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. సాధారణ నగర ప్రయాణాలకు ఇది చక్కగా సరిపోతుంది.


Click it and Unblock the Notifications








