అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.40 వేల వరకు తగ్గింపు.. ఈ డీల్ మిస్ అయితే మళ్లీ రాదు!
ఇండియాలో టూవీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) సంప్రదాయ ఇంధన మోడళ్లతో పాటు, ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా విడుదల చేస్తుంది. విడా బ్రాండ్ క్రింద V2 అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తుంది. శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఈ మోడల్ గత డిసెంబర్‌లో విడుదల అయింది. ఇప్పటికే రైడర్ల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఇప్పుడు, ఈ స్కూటర్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు మరో సూపర్ అప్‌డేట్ అందింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై దాదాపు రూ.40,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ తగ్గింపులో బ్యాంక్ డిస్కౌంట్లు, EMI ఆఫర్లు, GSTతో సహా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా స్పెషల్ ఆఫర్ ఏంటంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో Vida V2 లైట్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, ఏకంగా రూ. 6,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. కస్టమర్లకు ఇది బంపర్ అవకాశం.

పైన పేర్కొన్న ఆఫర్స్ అన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ మోడల్ V2 లైట్, మరింత మైలేజ్, స్టాండర్డ్ ఫీచర్లతో కూడిన V2 ప్లస్, లగ్జరీ మోడల్ V2 ప్రో మోడళ్లలో ఇది కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్, ఆర్థికంగా అందుబాటులో ఉండే ధర, ఇవన్నీ కలిపి Vida V2 ని బెస్ట్ సెల్లింగ్ ఈవీ స్కూటర్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. హీరో విడా V2 లైట్ ఎంట్రీ-లెవల్ ధర రూ.96,000 (ఎక్స్-షోరూమ్). ఇది 2.2 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో పూర్తి ఛార్జింగ్‌తో 94 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 69 కి.మీలుగా ఉంది.

హీరో విడా V2 ప్లస్ మోడల్ మిడ్-లెవల్ వేరియంట్. ఇది 3.44 కిలోవాట్ల (kWh) బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. దీని ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బ్యాటరీ పూర్తి ఛార్జ్‌తో 143 కి.మీ.ల దూరం వరకు రేంజ్ అందిస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ 85 కి.మీలు. చివరగా టాప్-ఎండ్ మోడల్ విడా V2 ప్రో 3.94 కిలోవాట్ల (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్యాటరీ పూర్తి ఛార్జ్‌తో 165 కి.మీల రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 కి.మీలుగా ఉంది. హీరో Vida V2 స్కూటర్ స్పోర్టీ లుక్, స్మార్ట్ టెక్నాలజీ, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వచ్చింది. ఇది 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్ స్మార్ట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ వంటి అనేర ఫీచర్స్‌ను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








