Vida vx2 Vs iQube: ఈ రెండు EV స్కూటర్లలో పర్ఫెక్ట్ మోడల్ ఏదో తెలుసా? రెండింటి మధ్య కంపారిజన్!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. ఈ పోటీలో ముఖ్యంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి , టీవీఎస్ iQube, హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన తాజా ఎంట్రీ, Vida Vx2. ఈ రెండు స్కూటర్లూ నగర ప్రయాణాల్లో సౌకర్యాన్ని అందించడంలో దృష్టి పెట్టగా, ఇవి ఎక్కువగా యువత, డైలీ ఉద్యోగాలకు వెళ్లేవారికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి ఒకే సిగ్మెంట్‌లో ఉన్నా, స్టైలింగ్, టెక్నాలజీ, స్పెసిఫికేషన్స్, ప్రాక్టికాలిటీ వంటి అంశాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. Vida Vx2 హీరో నుండి వచ్చిన రెండో విద్యుత్ స్కూటర్.
ఇది బోల్డ్ డిజైన్, కట్‌షార్ప్ లైన్స్, కాస్త యూత్‌ఫుల్ అటిట్యూడ్‌తో ఫ్యూచరిస్టిక్ లుక్స్‌ను చూపిస్తుంది. అదే TVS iQube విషయానికి వస్తే, ఇది మార్కెట్లో తన స్థానాన్ని ఇప్పటికే సంపాదించుకున్న మోడల్. డిజైన్ పరంగా ఇది Vida కంటే కొంచెం క్లాసిక్, సాఫ్ట్ అప్‌రోచ్‌తో ఉంటుంది. ఈ రెండు స్కూటర్ల మధ్య ఉన్న తేడాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Vida Vx2: హీరో విడా వీఎక్స్2 రూ.59,490 మాత్రమే ప్రారంభ ధర వద్ద లభిస్తుండగా, ఇది బాస్(Battery as a Service (BaaS)) పద్ధతిలో బ్యాటరీని విడిగా పొందే విధంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనిని బ్యాటరీతో కొనాలంటే దాదాపు రూ.99,490 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా రెండు వేరియంట్లలో లభిస్తుంది. గో వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో 92 కిలోమీటర్ల IDC రేంజ్‌ను ఇస్తుంది.
అదే ప్లస్ వేరియంట్, 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 142 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీన్ని బ్యాటరీతో కొనాలంటే రూ.1.10 లక్షల వరకు చెల్లించాలి. అదే బ్యాటరీని అద్దె ప్రాతిపదికన బాస్ ద్వారా కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర రూ.64,990 చెల్లించాలి. VX2 మోడళ్లకు ఒక్క కిలోమీటరు ప్రయాణం చేయడానికి రన్నింగ్ ఖర్చు కేవలం రూ.0.96 మాత్రమే అవుతుంది.

ఈ స్కూటర్‌లో రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉండటం ఒక పెద్ద ప్లస్. ఈ సిస్టమ్, ఉపయోగించే వ్యక్తికి ఛార్జింగ్ విషయంలో అనేక సౌలభ్యాలను ఇస్తుంది. అవసరమైనప్పుడు ఒక్కొక్క బ్యాటరీని విడదీసి ఇంట్లో, ఆఫీస్‌లో, లేదా ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు, ఇది అపార్ట్‌మెంట్ వాసులకు లేదా గ్యారేజ్ లేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో అనేక కనెక్టివిటీ ఫీచర్లు, స్ప్లిట్ సీటింగ్ డిజైన్ వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి.
TVS iQube: టీవీఎస్ నుంచి విడుదలైన వాహనాల్లో ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. తాజాగా 2025 ఎడిషన్ మోడల్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. ఈ స్కూటర్‌లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. రూ.1.05 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు. ఇది 2.2 kWh, 3.5 kWh, 5.3 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కూడా కొనుగోలుకు లభిస్తుంది.

కొత్త 3.1 kWh వెర్షన్ పూర్తి ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. టాప్ స్పీడ్ 82 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుంది. అంటే ఛార్జింగ్ కోసం పూర్తిగా స్కూటర్‌ను ప్లగ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికాలిటీ పరంగా కూడా TVS బాగా పని చేసింది. రైడ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్, టీవీఎస్ అందించే సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా ఇది బాగా పాపులర్ అయింది.
ఇక, చివరగా పర్ఫామెన్స్ విషయంలో Vida Vx2, TVS iQube వినియోగదారులకు బెస్ట్‌గా నిలుస్తున్నాయి. ida Vx2 ఎంచుకునే వారు కొత్తదనం, ఫ్యూచర్ ఫ్లెక్సిబిలిటీ కోరుకునే వారు. TVS iQube ఎంచుకునే వారు స్థిరమైన అనుభవం, విశ్వసనీయ బ్రాండ్ విలువ కోరుకునే వారు. ఈ రెండు స్కూటర్ల మధ్య ఎంపిక చేసే విషయంలో, మీ అవసరాలు, ప్రయాణ విధానం, ఇంకా కంఫర్ట్ కీలక పాత్ర పోషిస్తాయి.


Click it and Unblock the Notifications








