తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్.. స్మార్ట్ ఫీచర్లతో హీరో నుంచి మరో సంచలనం.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!
హీరో మోటోకార్ప్ భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో తన స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే విడా సబ్-బ్రాండ్ ద్వారా టెక్నాలజీ, డిజైన్ పరంగా వినూత్నమైన మోడళ్లను విక్రయిస్తున్న హీరో, ఇప్పుడు మరింత మందికి అందుబాటులో ఉండే మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో ఈ బ్రాండ్ కింద మరో మోడల్ రాబోతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు విడా VX2గా ఉండనుందని ఊహలు మొదలవగా, తాజాగా హీరో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఒక అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో స్కూటర్ ఫ్రంట్, సైడ్ ప్రొఫైల్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు కనిపించాయి. దీని డిజైన్ ఇటీవల ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన విడా Z స్కూటర్‌ను గుర్తుకు తెస్తోంది.
స్కూటర్ ప్రత్యేకంగా పసుపు రంగులో కనబడగా, స్పోర్టీ స్టైలింగ్‌కు తోడు, సిటీ రైడర్లను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ కొత్త VX2 ఇప్పటికే మార్కెట్లో ఉన్న V2 మోడల్ కంటే ఒక స్థాయి కింది సెగ్మెంట్‌లోకి వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇది మరింత తక్కువ ధరలో, చిన్నతరహా బ్యాటరీ కెపాసిటీ, కంపాక్ట్ డిజైన్‌లతో వస్తుందని అంచనా. ఈ స్కూటర్‌ను హీరో జులై 1, 2025న అధికారికంగా విడుదల చేయనుంది.

ఇదే స్కూటర్‌ను కొన్ని రోజుల క్రితం ఒక డీలర్‌షిప్ వద్ద చూశారని సమాచారం వెలువడింది. ఈ లీక్‌లతో పాటు ఇప్పుడు టీజర్ చిత్రాలు కూడా బయటకొచ్చిన నేపథ్యంలో, స్కూటర్ పై ఆసక్తి మరింత పెరుగుతోంది. మార్కెట్‌లోకి ఇది అందుబాటులోకి వచ్చాక, బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓ కొత్త దిశను సూచించే అవకాశం ఉంది. హీరో విడా VX2 స్కూటర్‌పై ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
విడా VX2 స్కూటర్‌లోని హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్ యూనిట్‌లు విడా V2లో కనిపించేవి కావడంతో, డిజైన్ పరంగా దీని లాగే ఉంటుంది. అయితే, స్కూటర్‌లో ఉపయోగించిన TFT డిజిటల్ డిస్‌ప్లేను కొంచెం చిన్నదిగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ధర తగ్గింపు కోసం చేయబడిన మార్పుగా భావించవచ్చు. ఈ స్కూటర్‌లో ఫిజికల్ కీ స్లాట్ ఉంటుంది. ఇది విడా V2లో ఉన్న కీ-లెస్ స్టార్ట్ సిస్టమ్‌కు బదులుగా అందించారు.

ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ స్కూటర్ మల్టిపుల్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే విడా V2 మూడు వేరియంట్లలో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రోలలో అందుబాటులో ఉంది. అలాగే, మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలు కూడా అందించబడుతున్నాయి. VX2 కూడా ఇదే తరహా వేరియంట్లను అనుసరించే అవకాశం ఉంది.
ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విడా V2 మోడల్‌ను బేస్ చేసుకొని రూపుదిద్దుకున్నట్లు స్పష్టమవుతోంది. VX2 మోడల్ కోసం కంపెనీ మూడు రకాల బ్యాటరీ ప్యాక్‌లు 2.2 kWh, 3.4 kWh, 3.94 kWhలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ మూడు బ్యాటరీ వేరియంట్లు VX2 మోడల్‌లో అన్నింటిలోనూ లభిస్తాయా లేదా అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అలాగే, లీకైన స్పై ఫోటోల ప్రకారం, VX2 మోడల్‌లో ఉపయోగించిన అల్లాయ్ వీల్స్ డిజైన్ V2 స్కూటర్ మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విడా V2 లైనప్ ధర రూ. 74,000 నుంచి రూ. 1.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండగా, VX2 మోడల్ మరింత తక్కువ ధరలో వినియోగారులకు కొనుగోలు చేయడానికి అందుబాటలో ఉంది.


Click it and Unblock the Notifications








