మీ బడ్జెట్‌కి బెస్ట్ స్కూటర్ వచ్చేస్తుంది! రూ.65 వేలకే డజన్ల కొద్ది ఫీచర్స్.. సింగిల్ ఛార్జ్‌తో 100+ కి.మీలు!
హీరో మోటోకార్ప్ (Hero Motocorp) నుంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఒక కొత్త మోడల్ విడా వీఎక్స్2 (Vida Vx2) ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోడల్ ఎట్టకేలకు జులై 1న మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న VX స్టైల్‌ను కొనసాగిస్తూ, కానీ ధర పరంగా మరింత అందుబాటులో ఉండేలా తీసుకురావడం గమనార్హం. ఈ విడా VX2 మోడల్‌ను కంపెనీ మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది పూర్తిగా అందుబాటులో ఉండే ధర పరిధిలోనే ఉంటుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 65,000 నుండి రూ. 70,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరకు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే,తక్కువ ధరలో పెద్దఎత్తున భారతీయ ప్రజల రోజువారి ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఇది రాబోతుంది.
ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఇది బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం కింద లభించబోతోంది. అంటే, వినియోగదారులు స్కూటర్‌ను కొనుగోలు చేసిన తరువాత బ్యాటరీని పూర్తిగా కొనాల్సిన అవసరం లేకుండా, నెలవారీ చార్జ్‌లకుగాను బ్యాటరీని అద్దెకు పొందవచ్చు. ఇది కొనుగోలుదారులపై ఆర్థిక భారం తగ్గించడంలో కీలకంగా మారనుంది. ఇది పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనూ ఇది మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.

ఖాళీ అయిన బ్యాటరీని వినియోగదారులు హీరో ఛార్జింగ్ స్టేషన్ వద్ద నిర్ణీత ప్రదేశంలో వదిలి, అక్కడే ముందుగానే పూర్తిగా ఛార్జ్ చేసిన మరో బ్యాటరీ ప్యాక్‌ను తీసుకెళ్లవచ్చు. దీనికి సంబంధించిన నెలవారీ ఫీజును వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన ఒకవైపు కొనుగోలు ధర తగ్గుతుంది, మరోవైపు ఛార్జింగ్ గురించి టెన్షన్ లేకుండా స్కూటర్‌ను నిరంతరం ఉపయోగించవచ్చు. డిజైన్ పరంగా చూస్తే, విడా VX2 ఎంతో స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపిస్తోంది.
ఇప్పటికే కొన్ని షోరూమ్‌లలో ఈ స్కూటర్ ప్రత్యక్షంగా కనిపించింది, దాని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిని గమనిస్తే, ఈ స్కూటర్‌లో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నట్టు స్పష్టమవుతుంది. స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ LED టెయిల్ ల్యాంప్స్, అధునాతన LED టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త అందాన్ని తెచ్చే విధంగా ఆకర్షణీయంగా ఉన్నాయి.

దీని పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో శక్తివంతమైన టెక్నాలజీ, వినియోగదారులకు అవసరమైన పని సామర్థ్యం రెండూ సమన్వయంగా ఉండబోతున్నాయని ఇప్పుడు అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ స్కూటర్ పవర్‌ఫుల్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి రాబోతుంది.
వివరాల ప్రకారం, విడా VX2 రెండు మార్చుకోగలిగే బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది.
ఒకటి 2.2 కిలోవాట్-గంటలు (kWh) సామర్థ్యంతో, మరొకటి 3.4 kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. వినియోగదారుల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వీటిని వేరే బ్యాటరీగా ఇంట్లో, లేదా బ్యాటరీ స్టేషన్‌లో ఛార్జ్ చేయవచ్చు, లేదా ఒకదాన్ని వాడుతుండగా మరొకదాన్ని ఛార్జ్ చేయడం వల్ల నిరంతర ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ అందించగలదని అంచనా వేస్తున్నారు.

అంటే, ఇది నగర ప్రయాణాలకైనా, రోజువారీ పనులకైనా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టమవుతోంది. మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దిన ఈ స్కూటర్ టెక్నాలజీ, డిజైన్, భద్రత అన్ని అంశాల్లోనూ ఆకర్షణీయంగా రూపొందించబడింది. డజన్ల కొద్దీ ఆధునిక ఫీచర్లతో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, దారి తప్పకుండా ప్రయాణించేందుకు టర్న్-బై-టర్న్ నావిగేషన్, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్-షాక్ అబ్జార్బర్‌లో ఉంటాయని సమాచారం.


Click it and Unblock the Notifications








