దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ.. ఓలా-ఏథర్ కంపెనీలకు బిగ్ షాక్
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశీయంగా పేదలు, మధ్యతరగతి వినియోగదారుల కోసం అందుబాటు ధరలో ఉండే విధంగా టూవీలర్స్‌ను లాంచ్ చేస్తుంది. సాధారణంగా ఈ కంపెనీ నుంచి వచ్చే వాహనాలు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. పెట్రోల్ టూవీలర్స్‌ను మాత్రమే కాకుండా ఈవీలను కూడా చాలా మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తయారీదారులు వినియోగదారుల కోసం అధునాతన సదుపాయాలతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించింది. విడా బ్రాండ్ పేరుతో ఇ స్కూటర్లను లాంచ్ చేస్తుంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా జరిగిన భారత మొబిలిటి గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో కూడా తన మోడళ్లను ప్రదర్శించింది.
వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో సేల్ చేయడానికి 'విడా' అనే కొత్త బ్రాండ్‌ను సృష్టించింది. ఇదే పేరుతో మోడళ్లను పరిచయం చేస్తుంది. కంపెనీ తాజాగా జరిగిన ఆటో ఎక్స్‌పోలో వీడా జెడ్ ( Hero Vida Z) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందరికి పరిచయం చేసింది. విడా బ్రాండ్ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ V1.

ఇప్పుడు Vida Z రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2024 చివరలో ఇటలీలో జరిగిన EICMA ఎగ్జిబిషన్‌లో కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు ఇండియాలో జరిగిన ఈవెంట్‌లో కూడా సందర్శకులను కనువిందు చేసింది. దీని ధర తక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. పనితీరు కూడా మెరుగ్గా ఉండటానికి శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌రు అందించారు. బాడీ ప్యానెల్ కూడా లైటె వెయిట్‌తో రూపొందించారు.
Hero Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌లో తొలగించగల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 4.4 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆటో ఎక్స్‌లో ప్రదర్శించిన ఈ మోడల్‌ను చూసినట్లయితే ముందు హ్యాండిల్ బార్‌లో టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్ ఉంది. సీటు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్, చిన్న వస్తువులను పెట్టుకోడానికి హ్యాండిల్ బార్ కింద ప్రత్యేకంగా స్థలం ఉంటుంది.

ప్రధానంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని తొలగించగలిగే విధంగా ఉండటం వలన ఛార్జింగ్ పెట్టడం చాలా సులభం అవుతుంది. హీరో సర్వీస్ సెంటర్ల వద్దకు వెళ్లి ఛార్జ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చి ఫుల్ బ్యాటరీనికి తీసుకోవడానికి అవకాశం ఉంది. Vida Z టార్క్ కెసాపిటీ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే రకమైన డిజైన్‌ను కలిగి ఉంది.
హీరో విడా నుండి వచ్చే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కూడా ఒకే విధంగా ఉంటున్నాయి. Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‌నే కాకుండా, యూరోపియన్ మార్కెట్‌లో కూడా అమ్మకానికి అందుబాటులోకి రాబోతుందని తెలుస్తుంది. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








