మరో కొత్త బైక్‌తో మార్కెట్‌లోకి హీరో... దీని మైలేజ్, ఇతర ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!

భారతీయ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కొత్త బైక్‌లను విడుదల చేస్తోంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే హీరో కంపెనీ కొద్ది రోజుల క్రితం సరికొత్త అడ్వెంచర్-స్టైల్ స్కూటర్ హీరో జూమ్ 160ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఈ స్కూటర్‌ను 2025 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ స్కూటర్ గురించి మార్కెట్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ స్కూటర్ డెలివరీల గురించి హీరో కంపెనీ ఒక శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 2025 నుంచి జూమ్ 160 స్కూటర్ డెలివరీలను ప్రారంభిస్తామని హీరో మోటోకార్ప్ స్పష్టం చేసింది.

Hero Xoom 160 Bookings have begun with deliveries starting in September

హీరో జూమ్ 160 స్కూటర్ కేవలం ప్రీమియా షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించబడుతుంది. దీని ద్వారా వినియోగదారులకు ఒక ప్రీమియం బైకును కొనుగోలు చేసిన అనుభవం కలుగుతుంది. ఈ స్కూటర్ జెడ్‌ఎక్స్ అనే ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ లగ్జరీ బైకులకు ఏ మాత్రం తక్కువ కాదు.

ఈ వేరియంట్‌లో అన్ని రకాల హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి. మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,48,500 గా ఉంది. ఈ స్కూటర్ మ్యాట్ రెయిన్‌ఫారెస్ట్ గ్రీన్, కాన్యన్ రెడ్, సమ్మిట్ వైట్, మ్యాట్ వోల్కానిక్ గ్రే అనే నాలుగు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది.

Hero Xoom 160

హీరో జూమ్ 160 కంపెనీ మొట్టమొదటి లిక్విడ్-కూల్డ్ స్కూటర్. అలాగే, ఇది కీ-లెస్ గో ఫీచర్ కలిగిన మొదటి ఐసీఈ స్కూటర్. ఈ స్కూటర్ భారతదేశంలోనే మొదటి మెయిన్‌స్ట్రీమ్ అడ్వెంచర్ (ఏడీవీ) స్టైల్ స్కూటర్‌గా నిలుస్తుంది. ఇందులో ఎత్తైన విండ్‌స్క్రీన్, బ్లాక్-ప్యాటర్న్ టైర్లు, కావాలనుకుంటే టాప్ బాక్స్ పెట్టుకునే ఆప్షన్, స్టైలిష్ డిజైన్ ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్-ఛాంబర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్-షాక్స్,14 అంగుళాల అలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

పవర్ కోసం, ఇందులో కొత్త 156 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 14.6 బీహెచ్‌పీ పవర్, 14 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సీవీటీ గేర్‌బాక్స్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 155 ఎంఎమ్, బరువు 142 కేజీలు. మొత్తంమీద, జూమ్ 160 స్కూటర్‌లో కూడా అడ్వెంచర్‌ను కోరుకునే రైడర్ల కోసం దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 15:13 [IST]
English summary
Hero xoom 160 bookings have begun with deliveries starting in september
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+