స్టైలిష్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ రెండు మోడళ్ల గురించి తెలుసుకోవాల్సిందే. .

ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే, ఇండియాలో టూవీలర్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దేశంలో జనాభా పెరుగుతున్నంత వేగంగా బైక్స్, స్కూటర్స్ వాడకం పెరుగుతుంది. దీంతో తయారీ కంపెనీలు అధునాతన డిజైన్లతో మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇండియాలో ఒక సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు 'Xoom 160 మ్యాక్సీ'. ఇది చూడటానికి స్టైలిష్ డిజైన్‌లో కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో మరో టూవీలర్ కంపెనీ అప్రిలియా కొత్తగా SXR 160 అనే స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది స్పొర్ట్స్ మోడల్ లుక్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్లు డిజైన్, ఫీచర్స్ పరంగా ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. కొత్తగా స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లు. వీటి గురించిన పూర్తి వివరాలను వివరంగా క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

హీరో మోటోకార్ప్ Xoom 160 మ్యాక్సీ (Hero Xoom 160 maxi) స్కూటర్‌‌లో 156 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అందించారు. ఇది 14.6 ps పవర్, 14 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర దాదాపు రూ.1,48,500 వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఇది 7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది.

Xoom 160 Maxi Aprilia Sxr 160

ఈ స్కూటర్ బరువు 142 కిలోల వరకు ఉంటుంది. హీరో నుంచి వచ్చిన ఈ స్కూటర్ కంపెనీ మొత్తం టూవీలర్ అమ్మకాలను పెంచడంలో బాగా ఉపయోగపడుతుందని అంచనాలు ఉన్నాయి. ఇది ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది. ప్రయాణంలో రైడర్లకు మరింత రక్షణ అందించడానికి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. క్ ప్యాటర్న్ టైర్‌లతో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా అందించారు.

దీనిలో ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. Hero Xoom 160 మ్యాక్సీ‌లో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్, SMS అలర్ట్స్, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఇగ్నిషన్, మ్యూజిక్ కంట్రోల్, సురక్షితమైన ప్రయాణం కోసం సింగిల్-ఛానల్ ABS వంటివి ఉన్నాయి. హ్యండిల్ బార్ కూడా చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. మిర్రర్ సెటప్ కూడా ఆకట్టుకుంటుంది.

Hero Xoom 160 Maxi Vs Aprilia Sxr 160 Scooters

అదే, ఏప్రిలియా SXR 160 (Aprilia SXR 160) స్కూటర్ ధర మార్కెట్లో రూ. 1,43,018 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది 160.03 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇంజిన్ 11.09 bhp పవర్, 12.13 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 7 లీటర్లుగా ఉంది.

ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, బ్యాక్ సింగిల్ షాక్ అబ్జార్వర్ సెటప్ ఉన్నాయి. ఇది కూడా అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంది. LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌, LED హెడ్‌లైట్‌, స్పోర్టీగా ఉండే LED DRL, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని కలిగా ఉంది. అయితే ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ ఫీచర్‌ను కలిగి లేదు.

రెగ్యులర్ కీ ఇగ్నిషన్‌ను దీనికి అందించారు. ఈ స్కూటర్ 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఏప్రిలియా SXR 160కి ముందు స్టోరేజీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే వినియోగదారులు తమ అవసరాల మేరకు ఈ రెండిట్లో నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. వీటి గురించిన మరింత సమాచారం కోసం డీలర్స్ సంప్రదించడం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2025, 9:30 [IST]
English summary
Hero xoom 160 maxi vs aprilia sxr 160 scooters engine and features comparison details
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+