హిస్టరీలోనే ఫస్ట్ టైం..ఏ బైకులో లేని ఫీచర్‌తో రాబోతున్న హీరో బైక్..ఇక యూత్ అంతా దీని వెంట పడాల్సిందే
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), ఇప్పుడు కేవలం సాధారణ బైకులకు మాత్రమే పరిమితం కాకుండా, యువతను ఆకర్షించే ప్రీమియం మార్కెట్‌పై దృష్టి పెట్టింది. 160cc సెగ్మెంట్‌లో అపాచీ, పల్సర్ వంటి బైకులకు నిద్ర పట్టకుండా చేయడానికి హీరో.. తన బెస్ట్ స్పోర్ట్స్ నేకెడ్ బైక్ అయిన ఎక్స్‌ట్రీమ్ 160R కు ఏకంగా ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్లను జోడించింది.
క్రూయిజ్ కంట్రోల్, రైడ్-బై-వైర్ వంటి టెక్నాలజీతో వచ్చిన కొత్త ఎక్స్‌ట్రీమ్ 160R 4V మోడల్ ధరను కేవలం రూ.1.34 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రకటించి, బైక్ మార్కెట్‌లో పెద్ద భూకంపాన్ని సృష్టించింది. ఈ అసాధారణ బైక్ ప్రత్యేకతలు ఈ వార్తలో తెలుసుకుందాం.

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V రెండు వేరియంట్లలో లభించనుంది. దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1,29,500 కాగా, ఫీచర్లన్నీ ఉన్న కాంబ్యాట్ ఎడిషన్ ధర రూ.1,34,000 (ఎక్స్-షోరూమ్). ఈ ధరకే ఈ బైక్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లోని అతిపెద్ద ప్రత్యేకత దాని రైడ్-బై-వైర్ థ్రోటల్ సిస్టమ్. అంటే ఇందులో యాక్సిలరేటర్ కేబుల్ ఉండదు.. సెన్సార్ల ద్వారా బైక్ స్పీడ్ కంట్రోల్ చేస్తారు.
దీనికి తోడు లాంగ్ జర్నీలకు సౌకర్యాన్ని ఇచ్చే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. రెయిన్, రోడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌ను కాంబ్యాట్ ఎడిషన్‌లో ఇచ్చారు. వీటిని హ్యాండిల్‌బార్స్‌లోని స్విచ్‌ల ద్వారా మార్చుకోవచ్చు.
ఈ కొత్త బైక్‌కు ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా దాని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. 163.2 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజిన్ దీనిలో ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ 16.66 bhp పవర్‌ను, 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇది సెగ్మెంట్‌లోనే అత్యంత తేలికైన, ఎక్కువ పవర్ ఇచ్చే మోడల్‌గా నిలుస్తుంది. డిజైన్ పరంగా పెద్ద ఎక్స్‌ట్రీమ్ 250R స్ఫూర్తితో రూపొందించిన కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్, 4.2 అంగుళాల ఎల్‌సీడీ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందువైపు KYB USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్ యూనిట్ ఇచ్చారు. బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సపోర్ట్‌తో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
సాధారణంగా దైనందిన అవసరాలకు క్రూయిజ్ కంట్రోల్ పెద్దగా ఉపయోగపడకపోయినా, ఈ ఫీచర్ ఉండటం బైక్‌కు మంచి ప్రీమియం ఇమేజ్‌ను ఇస్తుంది. ఇంత అడ్వాన్సుడ్ ఫీచర్లను అందించడం ద్వారా హీరో, 160cc నేకెడ్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో టీవీఎస్, బజాజ్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది మార్కెట్లోకి వస్తే తుఫాన్ సృష్టించడం ఖాయం.
కాంబ్యాట్ ఎడిషన్‌లో బ్రోన్జ్/బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్/నియాన్ గ్రీన్, రెడ్ యాక్సెంట్‌తో కూడిన బ్లాక్, మ్యాట్ గ్రే షేడ్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని అప్‌డేట్‌లు హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V ని యువతకు మరింత స్పోర్టీగా, టెక్నాలజీతో కూడిన బైక్‌గా మార్చాయి.


Click it and Unblock the Notifications








