అమ్మవారి జాతరకు వచ్చినట్లు షోరూంలకు పోటెత్తిన జనాలు.. అమ్మకాల్లో దుమ్ములేపిన హోండా

జపాన్ దేశానికి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా 2-వీలర్స్ (Honda 2-Wheelers) ఇండియన్ మార్కెట్‌లో తమ హవాను కొనసాగిస్తోంది. గత సెప్టెంబర్ నెలలో కంపెనీ దేశంలో, విదేశాలకు కలిపి మొత్తం 5,68,164 టూ వీలర్లను అమ్మింది. ఈ అమ్మకాలు 2024 సెప్టెంబర్ నెలలో నమోదైన 5,38,852 యూనిట్ల కంటే 5.44% ఎక్కువ కావడం విశేషం. నెలవారీ అమ్మకాల విషయంలో చూసినా ఆగస్టు 2025తో పోలిస్తే సెప్టెంబర్‌లో 6.23% వృద్ధిని సాధించింది.

హోండా మొత్తం అమ్మకాల్లో దేశీయ మార్కెట్లో అమ్మింది 5,05,693 యూనిట్లు. మిగిలిన 62,471 టూ వీలర్లు భారతదేశంలో ఉత్పత్తి అయి.. గత నెలలో విదేశాలకు ఎగుమతి అయ్యాయి. అంటే, హోండా మొత్తం అమ్మకాల్లో 11% విదేశాలకు ఎగుమతి చేసినవే. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, దేశీయ అమ్మకాలు 2.85% పెరిగాయి. ఎగుమతులు ఏకంగా 32.43% పెరిగాయి. ఎగుమతులలో ఇంత భారీ పెరుగుదల సాధించడం హోండాకు పెద్ద ప్లస్ పాయింట్.

Honda 2-Wheelers Sales Surge 5 44 Growth in September Exports Soar by 32 43

2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్ 2025) హోండా మొత్తం 16,18,403 టూ వీలర్లను విక్రయించింది. ఇది గతేడాది ఇదే క్వార్టర్‌లో అమ్మిన దానికంటే 3.69% ఎక్కువ. ఈ మూడు నెలల్లో దేశీయ అమ్మకాలు 14,53,045 యూనిట్లు, ఇది గత ఏడాది కంటే 2.15% ఎక్కువ. అలాగే, ఈ మూడు నెలల్లో ఎగుమతులు కూడా 19.54% పెరిగి 1,65,358 యూనిట్లుగా నమోదయ్యాయి.

గత ఆరు నెలల కాలంలో హోండా మొత్తం 29,91,024 టూ వీలర్లను అమ్మింది. అయితే, ఇది గతేడాది ఇదే ఆరు నెలల కాలంలో అమ్మిన 31,13,596 యూనిట్ల కంటే 3.94% తక్కువ. దీనికి ముఖ్య కారణం.. ఈ ఆరు నెలల కాలంలో దేశీయ అమ్మకాలు 5.54% తగ్గడమే. అయినప్పటికీ, ఆరు నెలల్లో ఎగుమతులు 12.51% పెరిగి 3,11,517 యూనిట్లుగా నమోదయ్యాయి.

Honda 2-Wheelers Sales Surge 5 44 Growth in September Exports Soar by 32 43

హోండా 2-వీలర్స్ ఇండియాకు యాక్టివా స్కూటర్ ఒక పెద్ద బలం. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. మైలేజీ ఎక్కువగా ఇవ్వడం, సులభంగా నడపగలిగే వాహనాలను పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుండటంతో, స్కూటర్ల అమ్మకాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. అందుకే కంపెనీ తరచూ యాక్టివాకు అప్ డేట్ వెర్షన్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది.

హోండా స్థిరమైన దేశీయ అమ్మకాలు, బలమైన ఎగుమతి పనితీరు, భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో కంపెనీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో స్కూటర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

Honda 2-Wheelers Sales Surge 5 44 Growth in September Exports Soar by 32 43

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: హోండా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు రెండింటి అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. బెస్ట్ మైలేజీ, ఈజీ డ్రైవ్ చేయగల వాహనాలను పట్టణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో స్కూటర్ల అమ్మకాలు మరింత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. హోండా సెప్టెంబర్ గణాంకాలు, అన్ని ఉత్పత్తి వాహనాలలో వినియోగదారుల స్థిరమైన ఆసక్తిని ప్రతిబింబిస్తాయి. మెట్రో, టై టైర్ సిటీల్లో స్కూటర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కూడా ఇవి వెల్లడిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 6, 2025, 10:19 [IST]
English summary
Honda 2 wheelers sales surge 5 44 growth in september exports soar by 32 43
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+