జనాలు గుడ్డిగా ఈ స్కూటర్‌ను కొంటున్నారు! దేశంలో అందరికీ నచ్చే ఒకే ఒక్క మోడల్.. అంత డిమాండ్ ఎందుకో?

భారతదేశంలో స్కూటర్ల రాజుగా వెలుగొందుతున్న మోడల్ అంటే అందరికి మొదట గుర్తుకు వచ్చేది హోండా యాక్టివానే(Honda Activa). ఇది దేశంలో ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్‌గా ఉంది. పేద, మధ్య తరగతి వినియోగదారులను ఆకర్షిస్తూ సరికొత్త డిజైన్, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకుంటుంది. మార్కెట్లో ఎన్నో మోడళ్లు ఉన్నప్పటికి కూడా యాక్టివాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. భారతీయుల హృదయాల్లో చెరిగిపోని ముద్రగా ఉండిపోయింది. 2001లో భారత్‌లో పరిచయమైన ఈ మోడల్ మంచి మైలేజ్, నమ్మకమైన పనితనంతో భారతీయ రోడ్లపై అధిపత్యం చలాయిస్తోంది. ఈ స్కూటర్‌ను యువత నుండి వృద్ధుల వరకు అందరు కూడా ఈజీగా నడపవచ్చు. అందుకే ఇది సేల్స్ విషయంలో ఇతర మోడళ్ల కంటే టాప్ ప్లేస్‌లో ఉంటుంది.

ప్రతినెలా కూడా హోండా యాక్టివా అందరిని ఆకర్షిస్తూ, మెరుగైన విక్రయాలను నమోదు చేస్తుండగా, గత నెలలో కూడా అదే విధంగా సేల్స్ సాధించింది. 2025 ఫిబ్రవరి నెలలో ఈ మోడల్ మొత్తం 1,74,009 యాక్టివా యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, అదే ఫిబ్రవరి 2024లో ఈ సంఖ్య 2,00,134గా ఉండటం గమనార్హం. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే గతనెలలో సేల్స్ 13.05 శాతం తగ్గిపోవడం గమనార్హం.

Honda Activa 110cc

భారత మార్కెట్లో యాక్టివా స్కూటర్ ఫిబ్రవరి 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. భారతీయ వినియోగదారులకు హోండా యాక్టివా నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కథనంలో దీని ఫీచర్స్‌ గురించి మరోసారి పూర్తిగా తెలుసుకుందాం. యాక్టివా స్కూటర్ భారతీయ మార్కెట్లో రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. యాక్టివా 110, యాక్టివా 125 రెండు మోడల్స్ కూడా కస్టమర్లకు అత్యంత నమ్మకమైనవిగా ఉన్నాయి.

ఇవి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్నాయి. హోండా యాక్టివా 110 స్కూటర్‌ 109.51 సీసీ ఇంజిన్‌‌ను కలిగి ఉంది. ఇది 7.99 ps పవర్, 9.05 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, యాక్టివా 125 స్కూటర్ 123.92cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో 8.4PS పవర్, 10.5Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు ఇప్పుడు తాజా OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.

Honda Activa 125cc Scooters Mileage

110 స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 162 మి.మీ కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులకు మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్,పెర్ల్ ప్రెషియస్ వైట్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ సైరెన్ బ్లూ అనే ఆరు కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్లు. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 50 కి.మీల పైనే ఇస్తుంది.

హోండా యాక్టివా 110 స్కూటర్ లాగే, 125 స్కూటర్ కూడా 162 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. దీని కలర్స్‌‌లో డీసెంట్ బ్లూ మెటాలిక్ కలర్‌లో కాకుండా మిగతా వాటిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనికి బదులుగా పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది కూడా 50 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

Activa 125cc

యాక్టివా 125 స్కూటర్ 2 వేరియంట్లలో లభిస్తుంది. DISC వేరియంట్ ధర రూ.1,00,223, SMART వేరియంట్ ధర రూ.1,04,229. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే స్వల్పంగా ఎక్కువడా ఉంటుంది. ఇక యాక్టివా 11 స్కూటర్ గురించి చూసినట్లయితే STD OBD2B వేరియంట్ ధర రూ.85,222, DLX OBD2B ధర రూ.94,741, SMART OBD2B వేరియంట్ ధర రూ.97,742గా ఉంది. ఇవి కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 30, 2025, 8:00 [IST]
English summary
Honda activa 110cc and 125cc scooters mileage design all top things details inside
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+