హోండా యాక్టివా ఈ 'ట్రెండ్ సెట్టర్'.. కానీ ఈ 3 స్కూటర్లలో ఒక్కొక్కటి ఒక 'మాస్ హీరో'!

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India - HMSI) విడుదల చేసిన హోండా యాక్టివా ఈ (Honda Activa e) ఒక ఐకానిక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు పొందింది.

ఇది రెండు వేరియంట్లలో - స్టాండర్డ్ (రూ. 1.17 లక్షలు), రోడ్‌సింక్ (రూ. 1.52 లక్షలు, ఎక్స్-షోరూమ్) - వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ (kWh) సామర్థ్యం కలిగిన రెండు స్వాపబుల్ (మార్చుకోగల) బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉండి, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Honda Activa e Alternatives

అంతేకాకుండా, ఆధునిక TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు పలు ఇతర ఉపయోగకరమైన ఫీచర్లను కూడా ఈ స్కూటర్ సొంతం చేసుకుంది. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్లో హోండా యాక్టివా ఈకి కొన్ని బలమైన ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రత్యామ్నాయాలు కేవలం ధరలోనే కాకుండా, రేంజ్, ఫీచర్ల విషయంలో కూడా ఆకర్షణీయమైన ఆఫ్షన్లుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా, బడ్జెట్ ధరలో మంచి రేంజ్, ఫీచర్లను కోరుకునే వినియోగదారుల కోసం ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆఫ్షన్లుగా చెప్పవచ్చు. ఇప్పుడు, ఆ మూడు ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర, ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం.

Honda Activa e Price

1. బజాజ్ చేతక్ 3501(Bajaj Chetak 3501): బజాజ్ చేతక్ ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. ఇప్పుడు, అదే పేరుతో ఎలక్ట్రిక్ లుక్‎లో బజాజ్ చేతక్ 3501 మార్కెట్లో లభిస్తోంది. దీని ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 3.5 కిలోవాట్(kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 153కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

అంతేకాకుండా, దీని గరిష్ట వేగం గంటకు 73 కిమీ వరకు ఉంటుంది. బజాజ్ చేతక్ 3501 పిస్తా గ్రీన్, హాజెల్‌నట్, ఇండిగో మెటాలిక్, బ్రూక్లిన్ బ్లాక్, మ్యాట్ స్కార్లెట్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్‌లో TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లతో పాటు, సేఫ్టీ కోసం ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ వ్యవస్థను అందించారు.

Bajaj Chetak

2. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube): టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని 2.2 కిలోవాట్ (kWh) బ్యాటరీ కలిగిన మోడల్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా గంటకు 75 కిమీ వేగంతో ప్రయాణించగలదు.

కొత్త టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh మోడల్ వాల్‌నట్ బ్రౌన్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. కేవలం 110 కేజీల బరువుతో తేలికగా ఉంటుంది. ఇందులో 5-అంగుళాల TFT స్క్రీన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెహికల్ క్రాష్, టౌ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, ఎక్కువ సామాను పెట్టుకోవడానికి వీలుగా 30 లీటర్ల సీట్ కింద విశాలమైన స్టోరేజ్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది.

TVS Icube

3. ఏథర్ రిజ్తా (Ather Rizta): ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో తనదైన ముద్ర వేసింది. వారి కొత్త ఉత్పత్తి అయిన ఏథర్ రిజ్తా రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 1.12 లక్షల నుండి రూ. 1.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 2.9 కిలోవాట్ (kWh) మరియు 3.7 కిలోవాట్ (kWh) సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది.

చిన్న బ్యాటరీతో ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్లు, పెద్ద బ్యాటరీతో అయితే 160 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కిమీ వేగంతో వెళ్లగలదు. ఇది సియాచిన్ వైట్ మోనో, డెక్కన్ గ్రే మోనో, పాంగోంగ్ బ్లూ డ్యూయొ, కార్డమోమ్ గ్రీన్ డ్యూయొ వంటి వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

Ather

ఇందులో 7-అంగుళాల LCD స్క్రీన్‌తో పాటు అనేక ఇతర అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ లను కలిగి ఉంది. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు హోండా యాక్టివా ఈకి బలమైన పోటీదారుగా నిలుస్తూ, వినియోగదారులకు మరిన్ని ఆకర్షణీయమైన ఎంపికలను అందిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 5, 2025, 7:10 [IST]
English summary
Honda activa e alternatives top 3 electric scooters with impressive range budget friendly prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+