ఆటో ఎక్స్‌పో 2025 : అదిరే హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆటో ఎక్స్‌పోలో అందాల ఆరబోతకు సిద్ధం!
ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే నడుస్తోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక టూ వీలర్ మార్కెట్‌లోనూ ఈవీల సందడి కొనసాగుతోంది. అనేక స్టార్టప్ సంస్థలతోపాటు దిగ్గజ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో పోటీ పెంచాయి. గతేడాది నవంబర్లో దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా.. తమ బ్రాండ్ నుంచి తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశంలో లాంఛ్ చేసింది. హోండా activa e, హోండా QC1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చింది. Swappable బ్యాటరీ సదుపాయంతో హోండా activa e మోడల్‌ని తీసుకురాగా.. ఫిక్స్‌డ్ బ్యాటరీతో హోండా QC1 ని తీసుకువచ్చింది. ఈ రెండు స్కూటర్లు బుకింగ్స్‌లో దూసుకుపోతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి కథనం
గ్లోబల్ హోండా CUV e, పెట్రోల్‌తో నడిచే యాక్టివా స్కూటర్ కలయికతో హోండా activa e స్కూటర్ డిజైన్ ఉంటుంది. బ్యాటరీలను మార్చుకునే విధంగా Swappable బ్యాటరీతో ఇది అందుబాటులో ఉంది.. మరోవైపు, హోండా QC1 ఇ- స్కూటర్‌ను తక్కువ ధరలో లభించేలా కొన్ని ఫీచర్లలో కోత విధించి తీసుకువచ్చారు.

6kW శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ హోండా యాక్టివా ఈ- స్కూటర్ ఉంటుంది. 110 సీసీ స్కూటర్ తరహాలో ఇది ఉంటుంది. డ్యూయల్ బ్యాటరీ సిస్టం ఇందులో వినియోగించారు. దీంతో బ్యాటరీలను సులభంగా మార్చుకోవచ్చు. ఈ సదుపాయంతో వినియోగదారులకు స్కూటర్ రేంజ్ పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఈ స్కూటర్ 80 kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 7 అంగుళాల TFT Instrument console ఉంటుంది.
హోండా సంస్థ నుంచి కాస్త తక్కువ ధరలో ఈవీ కావాలి అంటే మాత్రం హోండా QC1 మోడల్‌ను వినియోగదారులు ఎంచుకోవచ్చు. దీని లోయర్ వేరియంట్లలో LCD ఫీచర్లు ఉంటాయి. అయితే.. హోండా యాక్టివా ఈ కొత్త స్కూటర్ తరహాలో కాకుండా ఇందులో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

హోండా సంస్థ తమ Swappable బ్యాటరీ మోడల్స్ కోసం బెంగళూరులో 84 బ్యాటరీ ఎక్స్ చేంజ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే ఉండేవి. తర్వాత.. వీటిని ఇతర నగరాలకు కూడా విస్తరించింది హోండా సంస్థ. ఈ సంస్థకు చెందిన రెడ్ వింగ్ డీలర్ షిప్ నెట్‌వర్క్ తమ వాహనాల సేల్స్ పెంచుకుంటోంది.
హోండా యాక్టివా ఈ స్కూటర్.. మూడు రకాల రైడింగ్ మోడ్స్ అందిస్తుంది. రోడ్డు కండిషన్ బట్టి ఈ ఫీచర్లు సాయపడుతాయి. ఇది Ola S1 Sirion, TVS iQube, Bajaj Chetak, Ather Rizta వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ స్కూటర్లకు చెందిన ICE వెర్షన్స్ టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ స్కూటర్లకు సంబంధించి అఫీషియల్ ధరను వెల్లడించనుంది హోండా సంస్థ. ఈ స్కూటర్ల బుకింగ్స్ వివిధ ప్రాంతాల్లో రూ.1,000 తో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ల డెలివరీ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే వీటి ధర రూ. 90,000 నుంచి రూ.1,10,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: భారత టూవీలర్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టి, హోండా సంస్థ సస్టైనబిలిటీ దిశగా అడుగులు వేస్తోంది. రీప్లేసేబుల్ బ్యాటరీస్ వంటి అధునాతన ఫీచర్లతో, తమకు ఇప్పటికే ఉన్న డీలర్ షిప్ నెట్‌వర్క్‌తో హోండా సంస్థ ఈ సెగ్మెంట్లో అగ్రస్థానం చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఈ మార్కెట్‌కి పూర్తిగా హోండా సాధించే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications








