బెస్ట్ స్కూటర్ కొనాలా? పెట్రోల్ లేకుండా సైలెంట్‌గా దూసుకెళ్లే యాక్టివా ఎలక్ట్రిక్ షోరూమ్‌‌లకు వచ్చేసింది!

ఇండియాలో టూవీలర్ తయారీదారుల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ హోండా (Honda) అమ్మకాలతో దూసుకుపోతుంది. దేశంలో పేద, మధ్య తరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో, ఎక్కువ రేంజ్ అందించే బైక్స్, స్కూటర్స్‌ను విక్రయించడంలో హోండాకు ఎదురేలేదు. ముఖ్యంగా స్కూటర్ అంటే దేశంలో అందరికి గుర్తుకు వచ్చే ఒకే ఒక మోడల్ అదే యాక్టివా (Activa). భారతదేశంలో దీనికి మామూలు డిమాండ్ ఉండదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఇది కనిపిస్తుంది. ఏళ్ల క్రితం విడుదలైన యాక్టివా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తగా అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి కొత్త ఫీచర్స్‌తో వస్తూనే ఉంది. అయితే ఇంతకాలం Ice ఇంజిన్‌లో లభించిన ఈ స్కూటర్ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హోండా ఇటీవల కొత్తగా యాక్టివా-ఇ (Activa e) ఈవీను తీసుకొచ్చింది.

ఈ మోడల్‌పై భారతీయ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్‌లలోకి రావడం మొదలైంది. కస్టమర్లు కొనుగోలు చేయడానికి వీలుగా అందుబాటులో ఉంచుతున్నారు. యాక్టివా-ఇ షోరూమ్‌లకు వెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్కూటర్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తే.

Honda Activa E Arrives At Dealerships

హోండా యాక్టివా ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ స్కూటర్. నగరాల నుంచి మొదలుకుని పట్టణాలు, గ్రామాల్లో ఇది కనిపిస్తుంది. కొత్తగా స్కూటర్ కొనాలని ఆలోచన చేసిన వారిలో 70 శాతం మందికి పైగా యాక్టివానే ఎంచుకుంటారు. భారత్‌లో యాక్టివా అంటే తెలియని వారు ఉండరు. అంత ప్రజాధారణ పొందిన స్కూటర్‌ను కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌‌లో తీసుకువచ్చింది. Ice వేరియంట్ మాదిరిగా ఎలక్ట్రిక్ సైతం మంచి ఆదరణ సంపాదించే అవకాశం ఉంది.

ఇకపై హోండా షోరూమ్‌లలో ICE ఇంజిన్‌తో కూడిన యాక్టివాతో పాటు ఎలక్ట్రిక్ యాక్టివా ఇ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులకు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది సాంప్రదాయ ఇంజిన్ వేరియంట్‌ను వాడుతున్న నేపథ్యంలో కొత్తగా ఎలక్ట్రిక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని ఫెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటే మాత్రం యాక్టివా ఇ దేశంలో సేల్స్ పరంగా రికార్డులు నమోదు అవకాశాలు కూడా ఉన్నాయి.

Honda Activa E Details

పెట్రోల్ యాక్టివాకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గే పరిస్థితులు లేవు. రెండు కూడా అమ్మకాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. యాక్టివా ఇ రాకతో Ice వేరియంట్‌పై ఎలాంటి ప్రభావం ఉండవని కంపెనీ పేర్కొంటుంది. హోండా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడంతో కంపెనీ దీనిపై పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకుంది.

యాక్టివా-ఇ స్కూటర్ రెండు వేరియెంట్స్‌లో కొనుగోలుకు లభిస్తుంది. స్టాండర్డ్ ధర రూ.1.17 లక్షలు, అదే రోడ్ సింక్ ధర రూ.1.52 లక్షలు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంది. యాక్టివా ఇ తొలగించగల రెండు బ్యటరీలతో లభిస్తుంది. 1.5 kWh కెపాసిటీ కలిగిన రెండు బ్యాటరీ ప్యాక్‌లతో ఉంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 102 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

Honda Activa E electric Scooter Reached Dealerships

దీని టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీలు. ఇది కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 60 km/h వేగాన్ని చేరుకుంటుందని హోండా పేర్కొంది. దీనిని ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీ. మహిళలు, పురుషులు సులభంగా రైడ్ చేయవచ్చు. ఇది ECO, స్టాండర్డ్, స్పోర్ట్ అనే రైడింగ్ మోడ్స్‌ను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 3, 2025, 16:27 [IST]
English summary
Honda activa e electric scooter arrives at dealerships in india here full details
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+