ఇండియాలో ఈ బైక్ ఉండని వీధి ఉండదు.. షోరూంలకు క్యూ కడుతున్నారు.. ఫిబ్రవరిలో ఎన్ని అమ్ముడుపోయాయంటే ?
ప్రస్తుతం హోండా మోటార్ సైకిల్స్ మార్కెట్లో దుమ్ములేపుతున్నాయి. ఆ కంపెనీ స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా (Honda Activa) టాప్‌లో కొనసాగుతుంది. దీని తర్వాత హోండా షైన్ (Honda Shine) హీరో మోటోకార్ప్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం మనదేశ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాలలో ఈ హోండా యాక్టివా ఒకటి. మన దేశంలో ఏ వీధిలో చూసినా ఈ బైక్ కనిపిస్తుంది.
ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బైక్‌ల కంటే స్కూటర్లను ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పట్టణవాసుల మొదటి ఎంపిక స్కూటర్లుగా మారుతున్నాయి. కారణంగా ఏంటంటే రద్దీగా ఉండే రోడ్ల మీద ప్రయాణించడానికి గేర్లు లేని స్కూటర్లు చాలా బెస్ట్. ఈ సందర్భంలో ఫిబ్రవరి 2025లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్లకు సంబంధించిన వివరాలను అందుబాటులోకి వచ్చాయి.

ఫిబ్రవరి 2025 లో మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా హోండా యాక్టివా టాప్ ప్లేసులో నిలిచింది. గత నెలలో మొత్తం 1,74,090 యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంటే, ఫిబ్రవరి 2024లో అమ్ముడైన యాక్టివా స్కూటర్ల సంఖ్య 2 లక్షలు దాటింది.
ఈ విషయంలో హెండా యాక్టివా స్కూటర్ల అమ్మకాలు 26,125 యూనిట్లు తగ్గాయి. అయితే, జనవరి 2025లో కేవలం 1,66,739 యాక్టివా స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ విషయంలో జనవరి కంటే ఫిబ్రవరిలో 7,270 ఎక్కువ యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉన్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్స్ తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లకు పేరు పొందిన ఓలాకు పోటీగా అనేక కంపెనీలు తమ ఈవీలను విడుదల చేస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ స్కూటర్లలో మన దేశంలో టాప్ లో ఉన్న హెండా యాక్టివా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తూ ఇతర కంపెనీలకు పోటీ ఇస్తుంది.
గత నెలలో యాక్టివా తర్వాత టీవీఎస్ జూపిటర్ రెండో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్. దానికి సంబంధించి 1,03,576 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, ఫిబ్రవరి 2024లో కేవలం 73,860 జూపిటర్ స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మూడవ స్థానంలో ఉన్న సుజుకి యాక్సెస్ స్కూటర్ 59,039 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2024లో 56,473 యాక్సెస్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. 4, 5వ స్థానాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube, బజాజ్ చేతక్ ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మోడల్ వారీగా అమ్మకాలు వరుసగా 23,581, 21,240గా నమోదయ్యాయి.
అంటే, ఫిబ్రవరి 2024లో వరుసగా 15,792, 13,620 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 6వ స్థానంలో టీవీఎస్ మోటార్స్ స్టైలిష్ పెట్రోల్ స్కూటర్ Ntorq, 20,992 యూనిట్ల అమ్మకాలతో ఉంది. అలాగే ఫిబ్రవరి 2024లో టీవీఎస్ ఎంటార్క్ 24,911ల స్కూటర్లను విక్రయించింది.
అమ్మకాలలో టీవీఎస్ ఎంటార్క్ స్కూటర్‌తో పోటీ పడుతున్న హోండా డియో ఈ ర్యాంకింగ్‌లో 7వ స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2024లో 29,649 డుయో స్కూటర్లు అమ్ముడైతే, ఫిబ్రవరి నెలలో కేవలం 16,028 డుయో స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








