మార్కెట్లో నిన్ను పడగొట్టే స్కూటర్ ఇంకా పుట్టలేదు మామా! ఒక్కనెలలో 2.37 లక్షల మంది ఎగబడ్డారు

గత రెండు దశాబ్దాలుగా భారతీయుల హృదయాలను గెలుచుకుంటూ వస్తున్న స్కూటర్ ఒకటుంటే అది హోండా యాక్టివానే (Honda Activa). ఒక కుటుంబానికి సరిపోయే సౌకర్యం, యువతకు కావాల్సిన స్టైల్, వృద్ధులకు ఉపయోగపడే సులభత, ఇవన్నీ కలిపి యాక్టివాను హౌస్‌హోల్డ్ నేమ్గా మార్చేశాయి. ప్రస్తుతం ఇది ఆరవ తరంలో ఉన్నప్పటికీ, దాని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. దానికి నిదర్శనమే జూలై 2025లో నమోదైన అద్భుతమైన సేల్స్ ఫిగర్లు. ఆ నెలలో మాత్రమే యాక్టివా మొత్తం 2,37,413 యూనిట్లు విక్రయించబడింది. ఈ సంఖ్య గత సంవత్సరం అదే నెలలో అమ్ముడైన 1,95,604 యూనిట్లతో పోలిస్తే దాదాపు 21.37 శాతం పెరుగుదల సాధించింది. అంతేకాదు, గత నెలలో యాక్టివా భారతదేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా నిలిచింది.

ఇది కేవలం ఒక స్కూటర్ కాదు, లక్షలాది మంది విశ్వసించే మోడల్. యాక్టివా విజయంలో దాని ప్రత్యేకతలు ప్రధాన కారణం. హోండా ఎప్పటిలాగే అద్భుతమైన నిర్మాణ నాణ్యతను కొనసాగిస్తోంది. రోడ్డుపై నడిపేటప్పుడు అది ఇస్తున్న క్వాలిటీ ఇతర స్కూటర్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. అదనంగా, ఇందులోని శక్తివంతమైన ఇంజిన్ ప్రతి రైడ్‌ను స్మూత్‌గా, కాన్ఫిడెంట్‌గా అనిపించేలా చేస్తుంది. నగర ట్రాఫిక్‌లోనైనా, దూర ప్రయాణాల్లోనైనా యాక్టివా తన పనితీరుతో ఎప్పుడూ నిరాశపరచదు.

Honda Activa Scooter July 2025 Sales Recorded 21 37 Percent Growth

హోండా యాక్టివా ప్రస్తుతం 110 సీసీ మరియు 125 సీసీ విభాగాలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా 110 సీసీ వేరియంట్ ఎప్పటిలాగే మధ్యతరగతి కుటుంబాల అవసరాలకు సరిపోయే పర్ఫెక్ట్ స్కూటర్‌గా నిలుస్తోంది. కొత్తగా వచ్చిన 2025 యాక్టివా 110 ధర రూ.80,950 (ఎక్స్-షోరూమ్). దీన్ని శక్తివంతం చేసేది 109.51 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్. ఈ ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతకట్టబడింది.

దీని గరిష్ట శక్తి 8,000 rpm వద్ద 7.8 bhp, గరిష్ట టార్క్ 5,500 rpm వద్ద 9.05 Nm. ఇప్పుడు యాక్టివాకు ఐడిల్ స్టార్ట్, స్టాప్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఈ ఫీచర్ ట్రాఫిక్ లైట్స్ వద్ద లేదా ఎక్కువసేపు స్కూటర్ ఆగినప్పుడు ఇంధనాన్ని ఆదా చేస్తుంది. అంతేకాకుండా, ఇంజిన్‌ను తాజాగా OBD-2B ప్రమాణానికి అప్‌గ్రేడ్ చేశారు. దీని వల్ల పర్యావరణానికి హానికర ఉద్గారాలు తగ్గుతాయి.

Honda Activa Scooter July 2025 Sales Recorded 21 37 Percent Growth

ఫీచర్ల పరంగా 2025 మోడల్‌లో హోండా మరిన్ని అప్‌డేట్స్ అందించింది. కొత్తగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 4.2-అంగుళాల TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీను కూడా అందిస్తోంది. రైడర్‌కి రియల్‌టైమ్ డేటా, నోటిఫికేషన్లు, కాల్ అలర్ట్స్ లాంటి ఫీచర్లు ఇస్తూ ఇది మరింత ఆధునిక అనుభవాన్ని అందిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే, యాక్టివా తన సింపుల్ కానీ స్టైలిష్ లుక్‌ను కొనసాగిస్తోంది.

అయితే కొత్తగా ఒక ముఖ్యమైన మార్పు చేసింది, ఇంతవరకు H-స్మార్ట్ ట్రిమ్లో మాత్రమే లభించిన అల్లాయ్ వీల్ ఆప్షన్ ఇప్పుడు DLX వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది. ఎక్కువ శక్తి, మరింత ప్రీమియం అనుభూతి కోరుకునే వినియోగదారులకు యాక్టివా 125 ఉంది. దీని ధర రూ.94,922 నుంచి రూ.97,146 వరకు ఉంటుంది. ఈ వేరియంట్‌ను శక్తివంతం చేసేది ఒక 124 సీసీ, 4-స్ట్రోక్ SI ఇంజిన్.

Honda Activa Scooter July 2025 Sales Recorded 21 37 Percent Growth

ఇది కేవలం నిత్యజీవిత రైడ్‌లకే కాదు, దూర ప్రయాణాలకూ సరిపోయేంత బలాన్ని అందిస్తుంది. ఇంజిన్ గరిష్టంగా 6250 rpm వద్ద 8.3 bhp పవర్‌ను, అలాగే 5000 rpm వద్ద 10.4 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన పిక్-అప్ మరింత స్మూత్‌గా ఉండి, ట్రాఫిక్‌లోనూ, ఓపెన్ రోడ్డులోనూ రైడర్‌కి కాన్ఫిడెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఇది రోడ్డు పరిస్థితులను బట్టి దాదాపు 50 కి.మీల పైనే మైలేజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 30, 2025, 14:40 [IST]
English summary
Honda activa scooter july 2025 sales recorded 21 37 percent growth
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+