ఇండియాలో దీన్ని మించిన స్కూటర్‌ను చూపించలేరు! ఒక్కసారి కొంటే 15 ఏళ్లు నో టెన్షన్.. దీని రేంజ్ వేరే లెవల్

భారతదేశంలో ప్రజలను బెస్ట్ స్కూటర్ ఏది? అని అడిగితే, చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా సాధించిన విశ్వాసం, స్థిరమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా సంవత్సరాలుగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగర ప్రయాణాలకే కాకుండా రోజువారీ అవసరాలకు కూడా అనువుగా ఉండే యాక్టివా, అన్ని వయసులవారి నుంచి ఒకే స్థాయిలో ఆదరణ పొందుతోంది. ఈ ప్రజాదరణ నవంబర్ నెల అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం, నవంబర్‌లో హోండా యాక్టివా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతూ నంబర్ 1 స్థానంలో కొనసాగింది.

నవంబర్‌ నెలలో మొత్తం 2,62,689 యూనిట్లు వినియోగదారులకు విజయవంతంగా డెలివరీ చేయబడ్డాయి. ఇది భారత టూ-వీలర్ మార్కెట్లో యాక్టివాకు ఉన్న బలమైన డిమాండ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల పెరుగుదల మరింత విశేషంగా ఉంది. నవంబర్ 2024లో హోండా యాక్టివా అమ్మకాలు 2,06,844 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్యలను పోల్చి చూస్తే, ప్రస్తుత నవంబర్‌లో 27 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

Honda Activa Scooter November 2025 Sales 27 Percent Growth Compared To Previous

ఒక ఏడాది వ్యవధిలో ఇంత పెద్ద స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం యాక్టివా బ్రాండ్ బలాన్ని రుజువు చేస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. నమ్మదగిన ఇంజిన్, మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్, అలాగే హోండా విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ ఇవన్నీ కలిసి యాక్టివాను వినియోగదారుల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు, కొత్త తరం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను అప్‌డేట్ చేయడం కూడా యాక్టివా అమ్మకాలకు మరింత బలం చేకూర్చింది.

సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వం GST రేట్లను సవరించడంతో, ఈ స్కూటర్ ధరలో కూడా స్పష్టమైన తగ్గుదల కనిపించింది. ధర కొంత మేర తగ్గడం వల్ల కొనుగోలుదారులపై ఆర్థిక భారం తగ్గి, మరింత మంది వినియోగదారులు ఈ స్కూటర్ వైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మొదటిసారి స్కూటర్ కొనుగోలు చేసే వారు, అలాగే కుటుంబ అవసరాల కోసం నమ్మదగిన వాహనం కోరుకునే వారు ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారు.

Honda Activa Scooter November 2025 Sales 27 Percent Growth Compared To Previous

ఈ స్కూటర్‌ను సరైన నిర్వహణతో 10 నుంచి 15 సంవత్సరాల వరకు సులభంగా ఉపయోగించవచ్చు. కొత్త హోండా యాక్టివా 125 ఎక్స్-షోరూమ్ ధరలు రూ.92,562 నుంచి రూ.96,307 వరకు ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, 123.92 సీసీ పెట్రోల్ ఇంజన్ను అందించారు. ఈ ఇంజన్ 8.4 బిహెచ్‌పి హార్స్‌పవర్తో పాటు 10.5 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది.

ఈ పవర్ అవుట్‌పుట్ నగర ప్రయాణాలకు అవసరమైన స్మూత్ పర్ఫార్మెన్స్‌తో పాటు ట్రాఫిక్‌లో సులభమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మైలేజ్ విషయంలో కూడా యాక్టివా 125 వినియోగదారులను నిరాశపరచదు. హోండా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ స్కూటర్ లీటరుకు సుమారు 47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఇది ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్‌గా మారింది.

Honda Activa Scooter November 2025 Sales 27 Percent Growth Compared To Previous

హోండా యాక్టివా 110 ఎక్స్-షోరూమ్ ధర రూ.75,182 నుంచి రూ.88,507 వరకు ఉండటం వల్ల, ఇది బడ్జెట్‌లో మంచి ఎంపికగా నిలుస్తోంది. 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ను అందించారు. ఈ ఇంజిన్ నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించబడింది. ఈ స్కూటర్ గంటకు 59 కిలోమీటర్ల వరకు రేంజ్ను అందిస్తుంది. అలాగే, దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది, ఇది రోజువారీ వినియోగానికి సరిపడే పనితీరును ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 26, 2025, 13:02 [IST]
English summary
Honda activa scooter november 2025 sales 27 percent growth compared to previous
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+