ఈ స్కూటర్ కొంటే పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేదు! లీటర్‌కు 55 కి.మీ మైలేజ్! గత నెల సేల్స్ ఎన్నంటే

భారత టూవీలర్ మార్కెట్లో హోండా యాక్టివా (Honda Activa) అనే పేరు వినగానే అందరికీ ఒక నమ్మకం గుర్తుకు వస్తుంది. ప్రతి ఇంటి గ్యారేజీలో కనీసం ఒక యాక్టివా కనిపించేంతగా ఇది ప్రజాదరణ పొందింది. సౌకర్యం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం వంటివి దీన్ని దేశంలోని నంబర్ 1 స్కూటర్‌గా నిలబెట్టాయి. అయితే, గత కొంతకాలంగా ఈ అగ్రస్థానం కొంచెం కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2025 నెలలో హోండా యాక్టివా అమ్మకాలు కొంతమేర తగ్గాయి. ఆ నెలలో కంపెనీ మొత్తం 2,37,716 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేసింది. ఈ సంఖ్య పెద్దదిగా కనిపించినా, గత సంవత్సరంలోని అదే నెలతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల.

ఎందుకంటే సెప్టెంబర్ 2024లో 2,62,316 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, ఏడాదిలో దాదాపు 9.37% అమ్మకాల తగ్గుదల నమోదైంది. ఇక నెలవారీ గణాంకాలు చూస్తే కూడా తగ్గుదల కనిపిస్తోంది. ఆగస్టు 2025లో 2,44,271 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే సెప్టెంబర్ నెలతో పోలిస్తే దాదాపు 2.68% తగ్గుదల చోటు చేసుకుంది. ఈ సంఖ్యలు యాక్టివా అమ్మకాల వేగం కొంచెం మందగించిందని స్పష్టంగా చూపిస్తున్నాయి. హోండా యాక్టివా అమ్మకాలు పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Honda Activa Scooter September 2025 Sales 9 37 percent Down

మార్కెట్లో తీవ్రమైన పోటీ. ప్రస్తుతం టీవీఎస్ జూపిటర్, హీరో డెస్టిని, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో వంటి స్కూటర్లు యాక్టివా ధరకు సమానంగా లేదా కొంచెం తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ఇవి ఆధునిక ఫీచర్లతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుండటంతో కొత్త కొనుగోలుదారులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. ఇక ప్రభుత్వ GST సవరణలు కూడా కొంత ప్రభావం చూపాయి.

హోండా యాక్టివా ధరలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో, వినియోగదారులు స్పష్టమైన ధర వివరాల కోసం వేచి ఉండటం ప్రారంభించారు. ఫలితంగా కొనుగోళ్లు తాత్కాలికంగా తగ్గాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) ఆకర్షణ కూడా యాక్టివా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. Ola Electric, Ather, TVS iQube, Bajaj Chetak వంటి మోడళ్లు కొత్త తరం వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

Honda Activa Scooter September 2025 Sales 9 37 percent Down

ఫ్యూయల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ మోడళ్లు తక్కువ నడత ఖర్చు అందిస్తున్నాయి కాబట్టి, కొంతమంది వినియోగదారులు యాక్టివా కొనుగోలును వాయిదా వేస్తున్నారు. మొత్తం మీద, హోండా యాక్టివా ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ అయినప్పటికీ, ఇప్పుడు దీనికి ఎదురుగా సవాళ్లు పెరుగుతున్నాయి. పోటీ బ్రాండ్‌ల కొత్త ఫీచర్లు, టెక్నాలజీ మార్పుల దృష్ట్యా హోండా తన యాక్టివా మోడల్‌ను మరింత ఆధునికంగా మార్చడం తప్పనిసరి అయింది.

ఈ స్కూటర్ గురించిన ఇతర వివరాలు చూసినట్లయితే, ఇది రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. అవి యాక్టివా 125, యాక్టివా 110. వీటిని పేద, మధ్యతరగతి వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు. హోండా యాక్టివా 125 ధర రూ. 79,505 (ఎక్స్-షోరూమ్). దీనికి 123.92 సిసి పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 47 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనికి 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అందించారు.

Honda Activa Scooter September 2025 Sales 9 37 percent Down

హోండా యాక్టివా 110 గురించి చూసినట్లయితే, రూ.75,619 (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. దీనికి 109.51 సిసి పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది లీటరుకు 59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీంతో పాటు యాక్టివా ఇ అనే ఈవీ స్కూటర్ కూడా లభిస్తుంది. దీని ధర రూ. 1.17 లక్షల నుండి రూ. 1.52 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 24, 2025, 13:54 [IST]
English summary
Honda activa scooter september 2025 sales 9 37 percent down details
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+