రూ.1.12 లక్షలకే హోండా కొత్త స్పోర్టీ బైక్ వచ్చేసింది బ్రదర్.. ఫీచర్లు చూసి షాక్ అవ్వకమానరు!

ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ హోండా (Honda) తాజాగా తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ భారత మార్కెట్‌లోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం మోటార్‌సైకిల్‌ను ప్రివ్యూలుగా చూపించిన హోండా, ఇప్పుడు అధికారికంగా సీబీ125 హార్నెట్ (CB125 Hornet)ను విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, ఆకర్షణీయమైన స్టైల్, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ మోడల్ యువతను ప్రధానంగా ఆకట్టుకునేలా డిజైన్ అయింది. ఈ బైక్ ధరను కంపెనీ రూ.1.12 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. హోండా ఈ మోడల్‌ను రోజువారీ ప్రయాణాలు చేయే వారి కోసం మాత్రమే కాకుండా, యువకులు కూడా స్పోర్ట్స్ లుక్‌లో బైక్ తీసుకోవాలనుకునే యాంగిల్‌లో కూడా తీసుకొచ్చింది. లేటెస్ట్ డిజైన్‌తోపాటు హోండా బ్రాండ్ నమ్మకాన్ని కలిపితే, CB125 హార్నెట్ మార్కెట్‌లో మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హోండా CB125 హార్నెట్‌లో ఉన్న అసలు బలం దాని శక్తివంతమైన ఇంజిన్‌. దీనిలో 123.94 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్‌ను హోండా SP125, షైన్ 125 మోడళ్లలో కూడా చూస్తాం. కానీ హార్నెట్‌కి ప్రత్యేకంగా ట్యూన్ చేసి, మరింత శక్తివంతంగా మార్చారు. ఇది 11.1 bhp పవర్‌ను, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే మెరుగైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Cb125 Hornet Launched

పిక్‌అప్ కావాలి, మిడ్-రేంజ్‌ బూస్ట్ కావాలి అంటే హార్నెట్ మంచి పని చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు, దీని వల్ల హైవే మీదనైనా, ట్రాఫిక్ లోనైనా తేలికగా రైడ్ చేయొచ్చు. ఇలా చూస్తే, CB125 హార్నెట్ అనేది కేవలం స్టైలిష్‌గా కనిపించే బైక్ మాత్రమే కాదు, పనితీరులోనూ దుమ్ము రేపే విధంగా డిజైన్ చేయబడింది. యువత కోసం పవర్, లుక్, బ్రాండ్ కలిసొస్తే ఇదే బెస్ట్ పిక్ అనొచ్చు.

హోండా CB125 హార్నెట్ డిజైన్ విషయానికొస్తే, ఇది యూత్‌ను ఆకర్షించేలా బోల్డ్ అండ్ స్పోర్టీ లుక్‌తో నిలుస్తుంది. ముందుభాగంలో ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్, షార్ప్ DRLs, హై-మౌంటెడ్ LED టర్న్ ఇండికేటర్స్ వాడటం వల్ల ఈ బైక్‌కు చాలా అగ్రెసివ్ ఫ్రంట్ ఫేస్ వచ్చింది. రాత్రిళ్లు ప్రయాణాల్లో మంచి విజిబిలిటీతో పాటు రోడ్డుపైన ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. దీన్ని సైడ్ నుంచి చూసినట్లయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది.

Cb125 Hornet

సైడ్ ప్రొఫైల్ చూస్తే, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అతికొద్దిగా బయటకు వచ్చి కనిపించే షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, అలాగే స్టైలిష్ స్లీక్ మఫ్లర్ దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. దీని ఇగ్నిషన్ కీ ట్యాంక్ మీద పెట్టడం వినూత్న డిజైన్ టచ్ ఇవ్వడమే కాకుండా, యాక్సెస్ చేసేందుకు కూడా సులభంగా ఉంటుంది. పైగా స్ప్లిట్ సీట్ సెటప్ ఉన్నందున రైడర్‌కే కాకుండా వెనుక కూర్చున్న వారికి కూడా కంఫర్ట్ ఉంటుంది.

హోండా CB125 హార్నెట్ మోడల్‌కి ప్రధాన ఆకర్షణ అంటే అది కలిగిన 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే. ఇది గతంలో హోండా హార్నెట్ 2.0 మోడల్‌లో వాడినదే అయినా, ఈ సెగ్మెంట్‌లో ఇలాంటి అడ్వాన్స్‌డ్ క్లస్టర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ డిస్‌ప్లేలో అన్ని ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా, కలర్‌తో చూపబడుతుంది, అది బైక్‌కు ప్రీమియం టచ్ ఇస్తుంది. ఇంకా, బ్లూటూత్ కనెక్టివిటీ సౌలభ్యం కూడా ఉంది.

Honda Cb125 Hornet Bike

హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా మీరు బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయొచ్చు. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్స్, SMS నోటిఫికేషన్లు, హ్యాండిల్‌బార్ స్విచ్‌ల ద్వారా మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీనిలో USB టైప్-సి చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ కొత్త బైక్‌ను ఆగస్టు 1 నుంచి బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లకు డెలివరీలు ఆగస్టు 15 నుండి మొదలుపెడతారు.

More from DriveSpark

Article Published On: Friday, August 1, 2025, 14:23 [IST]
English summary
Honda cb125 hornet bike launched in india with at rs 1 12 lakh details
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+