పేద-మిడిల్‌క్లాస్ కలల బండి ఇక చరిత్రలోకి.. మంచి మైలేజ్, బడ్జెట్ ధర.. అయినా ఎందుకు నిలిపివేశారు?
ఇండియాలో హోండా బైక్స్ అంటే ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన చాలా టూవీలర్స్ తక్కువ ధరలో పేద, మిడిల్ క్లాస్ వినియోగదారులు కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరలో విడుదల అవడం మాత్రమే కాకుండా, మంచి మైలేజ్ కూడా అందిస్తాయి. వీటిలో గతంలో నుంచి బడ్జెట్ సెగ్మెంట్‌ను శాసించిన హోండా CD 110 డ్రీమ్ బైకు కూడా ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, పదకొండు సంవత్సరాలుగా భారతదేశంలోని మధ్యతరగతి వినియోగదారుల గుండెల్లో స్థానం సంపాదించిన ఈ ఎంట్రీ లెవల్ బైక్‌ను కంపెనీ అధికారికంగా నిలిపివేసింది. గతంలో దీనిపై ఎన్నో ఊహగాణాలు రాగా వాటన్నింటికి తాజాగా ముగింపు పలుకుతు హోండా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
2014లో మొదటిసారిగా భారత మార్కెట్లో ప్రవేశించిన CD 110 డ్రీమ్, మంచి మైలేజ్ అందించడంలో వేరే దానికి సాటీ లేనిది. 110cc క్లాస్‌లో మంచి మైలేజీ, విశ్వసనీయత, హోండా బ్రాండ్ ట్రస్ట్‌ను కలిపి తీసుకురావడం ద్వారా, ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రజాధారణ పొందింది. మొదటిసారి బైక్ కొనుగోలు చేసే వారికి ఇది చాలా వరకు ఫస్ట్ ఆప్షన్‌గా ఉంది. దీని మెయింటనెన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో పోటీ పెరిగింది. ఇతర కంపెనీల నుంచి దీని ధరలోనే ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్స్‌తో పలు బైకులు విడుదల కావడంతో గతంలో ఎంతో డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలిచినప్పటికి ఇటీవలి కాలంలో పోటీని తట్టుకోలేక తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, తక్కువ అమ్మకాల ప్రభావంతో, కంపెనీ ఈ మోడల్‌ను నిలిపివేయడమే సరైనదని భావించింది. చిన్న ప్రయాణాలకు నమ్మకంగా నిలిచిన ఈ బైక్ చరిత్రగా మిగిలిపోతుంది.
ఒక తరానికి ప్రతీకగా నిలిచిన హోండా CD 110 డ్రీమ్ ఆకర్షణీయమైన ధర, మంచి మైలేజీ, నమ్మకమైన పనితీరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మందికి తమ మొదటి బైకు అనుభూతిని కలిగించింది. కానీ, కాలం మారింది. ట్రెండ్లు, టెక్నాలజీ, వినియోగదారుల అభిరుచులు బలమైన మార్పులను చవిచూశాయి. వాటి ప్రభావంతోనే CD 110 డ్రీమ్ విక్రయాలు తగ్గుతూ వచ్చాయి. 2024 అక్టోబర్ నుంచి CD 110 డ్రీమ్ విక్రయాలు క్రమంగా పడిపోయాయి.

2025 మార్చిలో అయితే కేవలం 33 యూనిట్ల విక్రయాలు మాత్రమే నమోదు కావడం చూస్తే, బైక్ మార్కెట్ నుంచి మెల్లగా తప్పుకోవడం ఒక్కమాటలో 'కాలం ముగిసింది' అనే సంకేతంగా చెప్పవచ్చు. 2014లో లాంచ్ అయినప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ. 41,100 మాత్రమే ఉండేది (ఎక్స్-షోరూమ్). అదే బైక్ 2025లో నిలిపివేయడానికి ముందు దాదాపు రూ. 76,401 వరకు చేరింది. ధర పెరిగినా, వినియోగదారుల ఆదరణ తగ్గిపోయింది.
ఈ బైక్‌లో 109.51cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7,500 rpm వద్ద 8.6 bhp పవర్, 5,500 rpm వద్ద 9.3 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. హోండా ప్రకారం, ఇది లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజీ అందించగలదు. బైక్‌లో టూ-వే ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి లేటెస్ట్ ఆప్షన్లు ఉన్నప్పటికి కూడా, ఇవి మార్కెట్‌కు సరికొత్తగా అనిపించకపోవచ్చు.
ఇది సిల్వర్ కలర్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, డైమండ్ ఆకారపు ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, రెండు చక్రాల్లో డ్రమ్ బ్రేక్స్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్య విషయం ఏమిటంటే, తక్కువ ధరలో షైన్ 100 బైక్‌ను విడుదల చేసిన తర్వాత CD 110 డ్రీమ్ బైక్‌కు డిమాండ్ తగ్గింది.


Click it and Unblock the Notifications