కాలేజ్ విద్యార్థులకు బాగా ఇష్టమైన స్కూటర్.. గత నెలలో ఎంత మంది కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో హోండా (Honda) పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది యాక్టివా. అయితే, అదే కంపెనీ మరో వైపు యువతలో సూపర్ హిట్ అయిన మోడల్ హోండా డియో (Honda Dio)తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. యాక్టివా కుటుంబాలకు సరిపోయే స్మూత్ స్కూటర్‌గా నిలిచినప్పటికీ, డియో మాత్రం తన స్పోర్టీ డిజైన్, స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే కలర్ ఆప్షన్లతో యువతను తన వైపుకు తిప్పుకుంది. ఒకప్పుడు కళాశాల విద్యార్థుల నుంచి యువ ఉద్యోగులు వరకు అందరి గ్యారేజ్‌లో డియో స్కూటర్ తప్పనిసరిగా కనిపించేది. అబ్బాయిలకు బైక్‌లకు ప్రత్యామ్నాయంగా, అమ్మాయిలకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా ఈ స్కూటర్ నిలిచింది. అయితే కాలం మారింది, మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, అధునాతన టెక్నాలజీ మోడళ్లు రావడంతో పోటీ పెరిగింది.
అయినప్పటికీ హోండా తన డియో మోడల్‌ను మరింత ఆధునిక రూపంలో కొనసాగిస్తూ, యువతకు తగిన లుక్‌తో మార్కెట్లో ఉంచింది. ఇక అమ్మకాల విషయానికి వస్తే, సెప్టెంబర్ 2025లో డియో అమ్మకాలు కొంత తగ్గాయి. గత నెలలో డియో 23,829 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 35,370 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల. సుమారు 32.63 శాతం నష్టాన్ని డియో ఈసారి చవిచూసింది.

ఈ గణాంకాలు చూస్తే, హోండా డియోకు ఉన్న పాత క్రేజ్ ఇప్పుడు తగ్గిపోయిందనిపిస్తుంది. కానీ, హోండా కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా వదిలేయాలనుకోవడం లేదు. స్టైల్, టెక్నాలజీని కలిపిన కొత్త వెర్షన్‌లు తీసుకువచ్చి మళ్లీ మార్కెట్‌లో తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. యువతకు ఇష్టమైన స్పోర్టీ స్కూటర్‌గా మళ్లీ డియో రీ-ఎంట్రీ ఇవ్వడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మరింత కొత్తగా రాబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హోండా తన డియో స్కూటర్‌కు 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌ను అందించింది. కొత్త అప్‌డేట్‌తో డియో మరింత ఆకర్షణీయంగా, ఆధునికంగా రూపుదిద్దుకుంది. ప్రారంభంలో కేవలం 110cc ఇంజిన్‌తో మాత్రమే లభ్యమైన ఈ మోడల్, ఇప్పుడు మరింత శక్తివంతమైన 125cc వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది హోండా అభిమానులకు, ముఖ్యంగా యువతకు, మరింత శక్తి, వేగం, ఫీచర్లను అందిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో హోండా డియో రెండు ఇంజిన్ ఎంపికల్లో లభిస్తోంది. 110cc వెర్షన్ ధర రూ.72,837 నుంచి రూ.83,676 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, మరింత పవర్‌ఫుల్ 125cc మోడల్ ధర రూ.90,342 నుంచి రూ.95,292 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అంటే, వినియోగదారుల బడ్జెట్, అవసరాన్ని బట్టి రెండు వేరియంట్లలో ఎంచుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో విడుదలైన కొత్త డియో 125 మోడల్ తన రూపకల్పనలోనే పెద్ద మార్పును తెచ్చుకుంది.
ముందు భాగంలో మరింత షార్ప్ లైన్లు, ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్, స్పోర్టీ సైడ్ ప్యానెల్స్, కొత్త కలర్ ఆప్షన్లు ఇవన్నీ కలిపి దీన్ని పూర్తిగా యూత్‌ఫుల్ లుక్‌తో తీర్చిదిద్దాయి. హోండా ఈ మోడల్‌లో కేవలం డిజైన్ మాత్రమే కాదు, సాంకేతిక పరంగా కూడా పలు అప్‌డేట్‌లను చేసింది. రైడింగ్ కంఫర్ట్, ఇంజిన్ రిఫైన్మెంట్, మైలేజ్ సామర్థ్యం ఇవన్నీ గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇది నగర ప్రయాణాలకు ఇది చాలా అనువుగా ఉంటుంది.

హోండా 123.92cc, సింగిల్ సిలిండర్, PGM-Fi (Programmed Fuel Injection) ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8.19 bhp గరిష్ట శక్తిని, 10.5 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్కూటర్‌ను మరింత వేగంగా, సాఫ్ట్‌గా, తేలికగా నడిపేలా చేస్తుంది. ఇది 110cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7.75 bhp శక్తిని, 9.03 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








