ఆటో ఎక్స్‌పోలో విచిత్రంగా ఉన్న సూట్-కేస్‌‌.. అందరు వింతగా చూస్తున్నారు.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు

ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా మన దేశ ప్రతిష్టను పెంచేలా జరుగుతున్న అతిపెద్ద వాహన ఎగ్జిబిషన్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌‌లో దేశీయ, అంతర్జాతీయ తయారీదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్నింటిని ఇప్పుడే మార్కెట్లోకి విడుదల చేస్తుండగా, మరికొన్నింటిని భవిష్యత్తు మోడళ్లుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ వాహనాల ప్రదర్శనలో కొన్ని చిత్ర విచిత్రమైన రూపంతో కనువిందు చేస్తున్నాయి. దేశీయ దిగ్గజ కంపెనీ హోండా (Honda) తన ఉత్పత్తులను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తుండగా, వీటిలో ఒక కొత్త మోడల్ ఆటో ప్రియుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇది ఒక సూట్-కేస్‌ మాదిరిగా ఉంది. అసలు ఇది ఎంటంటే, ఒక 'మోటోకాంపాక్టో ఇ-స్కూటర్‌(Motocompacto)'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి మాత్రం బట్టలను తీసుకెళ్ళే సూట్-కేస్‌ లాగా కనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో చాలా మంది దీని గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

దీనిని మొదటగా చూసిన ప్రతి ఒక్కరూ సూట్‌కేసు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అయితే అది ఎలక్ట్రిక్ స్కూటర్ అని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి ముందు, వెనుక వైపు వీల్స్ ఉన్నాయి. ముందు హ్యాండిల్ బార్ సైకిల్‌కు ఉన్నట్లుగా ఉంటుంది. దీనికి హెడ్‌లైట్ కూడా అటాచ్ చేయబడి ఉంది. ఈ సూట్ కేస్ స్కూటర్‌ను నిలపడానికి స్టాండ్ కూడా ఉంటుంది. హోండా మోటోకాంపాక్టో ఇ-స్కూటర్‌ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

Honda At Auto Expo 2025

ఇది వినూత్నమైన ఫోల్డబుల్ డిజైన్‌తో ఉంది. దీన్ని ఎక్కడికంటే అక్కడికి చాలా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఫోల్డబుల్ హ్యాండిల్ బార్, సీటు కంఫర్ట్‌గా అనిపిస్తాయి. తక్కువ దూర ప్రయాణాలకు మాత్రమే ఇది అనువుగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి మెరుగైన బ్యాటరీని అందించారు. సింగిల్ ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 24 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది.

హ్యాండిల్ బార్ బయటకు కనిపించకుండా మడతపెట్టే సదుపాయం ఉండటం వలన దీనిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం చాలా ఈజీ. దీని టాప్ స్పీడ్ గంటకు 19 కి.మీలుగా ఉంది. హోండా మోటోకాంపాక్టో భారత మార్కెట్లో సరికొత్త మోడల్ అని చెప్పవచ్చు. దీనిలో అందించిన బ్యాటరీని 110V సాకెట్ ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3.5 గంటల సమయం పడుతుంది. దీనిపై ఒక్కరు మాత్రమే ప్రయాణించవచ్చు. సింగిల్ సీట్‌లో లభిస్తుంది.

Honda Motocompacto At Auto Expo 2025

సాధారణ సైకిళ్లుకు అందించినట్లుగా హోండా మోటోకాంపాక్టో కూడా ఒకే సీటుతో అందుబాటులో ఉంటుంది. ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. ముందు చీకట్లో ప్రకాశవంతమైన వెలుతురు ఇచ్చే మెరుగైన హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ స్పీడోమీటర్ వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి. కాలు పెట్టుకోడానికి ఫుట్‌రెస్ట్, కాంపాక్ట్ స్టోరేజ్ఆప్షన్లు కూడా దీనిలో ఉంటాయి. సురక్షితమైన ప్రయాణం కోసం బ్యాక్ సైడ్ రెడ్ లైట్ ఉంది.

మోటోకాంపాక్టో మడతపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో హోండా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అతి త్వరలోనే భారత మార్కెట్లో వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీని ధర, ఇతర వివరాలు కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటిస్తుంది.

Honda Motocompacto

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Monday, January 20, 2025, 14:47 [IST]
English summary
Honda electric scooter motocompacto showcased at bharat mobility global expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+