కొత్త ఏడాదిలో గుడ్‌న్యూస్.. అందరు వెయిట్ చేస్తున్న Activa e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ స్టార్ట్
దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) ఇండియాలో బడ్జెట్ ధరలో బైకులను, స్కూటర్లను విడుదల చేస్తూ టూవీలర్ సెగ్మెంట్‌లో ఇతర కంపెనీల కంటే ముందు స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే వాహనాలను మధ్యతరగతి వారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరలో లభించడంతో పాటు, మైలేజ్ కూడా ఎక్కువగానే ఇస్తాయి. పేదవారు, మధ్య తరగతి ప్రజలు తమ రోజువారి అవసరాలకు ఉపయోగపడే వాహనాలను కొనుగోలు చేయాలనుకునే మొదట హోండా కంపెనీ మోడళ్లపై ఆసక్తి చూపిస్తారు. హోండా మోటార్‌సైకిల్ నుంచి విడుదల అయిన వాహనాలు దేశంలో ఢిల్లీ నుంచి గల్లి వరకు కనిపిస్తాయి. ముఖ్యంగా కంపెనీకి చెందిన యాక్టివా మోడల్ దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్‌గా ఉంది. ఈ విభాగంలో యాక్టివా అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్. ఇండియాలో ఇది దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు యాక్టివా స్కూటర్ అప్‌డేట్ అవుతూనే ఉంది. ఇటీవల లేటెస్ట్ యాక్టివాను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్లలో ఈ మోడల్‌ను తీసుకువస్తుంది. గత నెలలో దీన్ని ఇండియా మార్కెట్లో ఘనంగా ఆవిష్కరించింది. హోండా కొత్త ఈవీ స్కూటర్ పేరు యాక్టివా ఇ (Activa e). దీంతో పాటు క్యూసి1 (QC1) అనే మరో మోడల్‌ను కూడా విడుదల చేసింది.

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. టూవీలర్లను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు ఎక్కువగా ఈవీ వేరియంట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హోండా కంపెనీ ఈవీ సెగ్మెంట్‌పై కీలకంగా దృష్టి సారించింది. అందుకే నవంబర్‌లో యాక్టివా ఇ, క్యూసి1 అనే కొత్త ఎలక్టిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా ఈ రెండు ఈవీ మోడళ్లకు సంబంధించిన బుకింగ్‌లు ప్రారంభమైనట్లు సమాచారం.
యాక్టివా ఇ, క్యూసి1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి. దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లపై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్టివా పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. నగరాల నుంచి మొదలుకుని పట్టణాలు, గ్రామాల్లో యాక్టివా స్కూటర్ కనిపిస్తుంది.

స్కూటర్ల విభాగంలో యాక్టివా ఎక్కువ సేల్ అవుతున్న మోడల్. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడంతో చాలా మంది వినియోగదారుల దృష్టి దీనిపై పడింది. Activa e స్కూటర్ ముంబై, బెంగళూరు, ఢిల్లీలో బుకింగ్‌కు అందుబాటులో ఉంది, అదే QC1 మోడల్ హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఢిల్లీ, చండీగఢ్, ముంబై నగరాల్లో కంపెనీ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌కు ఉంది. కస్టమర్లు ఆయా నగారల్లోని డీలర్‌షిప్‌లలో సంప్రదించవచ్చు. బుకింగ్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.30 లక్షలు(ఎక్స్ షోరూమ్). మొదట మూడు నగరాల్లో బుకింగ్స్‌ను ప్రారంభించిన తరువాత అతి త్వరలో మిగిలిన ఏరియాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 1.5 కిలోవాట్ (kWh) రెండు స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌తో 102 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీలు. ఇది 7.3 సెకన్లలో 0- 60 కి.మీల వరకు వేగాన్ని చేరుకుంటుంది.

అలాగే, క్యూసి1 మోడల్ ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇది 1.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన బ్యాటరీని పూర్తి ఛార్జింగ్ చేసినట్లయితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కి.మీలుగా ఉంది.


Click it and Unblock the Notifications








