వెంటనే బుక్ చేసుకోండి.. అడ్వెంచర్, స్టైల్, పవర్ అన్నింటిని కలిగిన కొత్త బైక్ వచ్చేసింది
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) కంపెనీ ప్రపంచానికి మరో వినూత్న అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు '2025 ఎక్స్‌ఎల్750 ట్రాన్సాల్ప్(2025 XL750 Transalp)'. సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి కంఫర్ట్‌గా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్. భారతదేశంలో అధికారికంగా విడుదలైన ఈ బైక్, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఈ బైకును బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు జులై 2025 నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. 2025 ఎక్స్‌ఎల్750 ట్రాన్సాల్ప్ ధర వచ్చేసి రూ. 10,99,990, ఎక్స్-షోరూమ్ గురుగ్రామ్ (హర్యానా).
అన్ని రకాల భూములను అధిరోహించేందుకు సిద్ధంగా ఉండేలా దీన్ని అత్యాధునిక డిజైన్‌తో రూపొందించారు. ఇందులో ఉన్న డ్యూయల్ LED హై/లో యూనిఫైడ్ ప్రొజెక్టర్ లెన్స్‌లు, వేగవంతమైన రూపాన్ని కళ్లకు కట్టిస్తాయి. ఇక, ముందుభాగంలో ఏర్పాటు చేసిన ఏరోడైనమిక్ విజర్, దట్టమైన గాలిని తట్టుకునే విధంగా పని చేస్తూ, లాంగ్ రైడ్‌లలో అవసరమైన విండ్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. ఇది రెండు కలర్స్ రాస్ వైట్, గ్రాఫైట్ బ్లాక్‌లలో కొనుగోలుకు లభిస్తుంది.

హోండా XL750 ట్రాన్సాల్ప్ దాని శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌తో రైడింగ్ ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళుతోంది. ఈ అడ్వెంచర్ బైక్ 755cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 9,500 RPM వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, 7,250 RPM వద్ద 75 Nm టార్క్‌ను పీక్ అవుట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు.రైడింగ్‌లో గేర్ మార్చడం చాలా సులువు.
హోండా ఇందులో థ్రోటిల్-బై-వైర్ (TBW) వ్యవస్థను అందించింది. ఇది రైడింగ్ అనుభూతిని మరింత రిఫైన్డ్‌గా, స్పష్టంగా మార్చుతుంది. ఇంజిన్ పవర్, ఇంజిన్ బ్రేకింగ్, ABS వంటి అంశాలు రైడర్ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే అసిస్ట్-స్లిప్పర్ క్లచ్‌తో క్లచ్ ఆపరేషన్ మృదువుగా ఉండడంతో, గేర్ డౌన్ సమయంలో బైక్ స్థిరంగా ఉంటుంది. దీనిలో ఐదు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
దీనిలో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, గ్రావెల్ వంటి రెడీ-టు-రైడ్ ఎంపికలతో పాటు, యూజర్ మోడ్ కూడా ఉంది. ప్రతి రైడ్‌ను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేయడమే కాదు, అదే సమయంలో మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని ఇవ్వడమే ఈ మోడ్‌ల లక్ష్యం. ఇది స్మార్ట్ కనెక్టివిటీతో కూడా ముందుంటుంది. బైక్‌లోని 5.0 అంగుళాల ఫుల్-కలర్ TFT డిజిప్లే ద్వారా రైడింగ్ సమాచారం కళ్లముందే ఉంటుంది.
అంతేకాదు, ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కు కనెక్ట్ అవతుంది. దీంతో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్ అలర్ట్స్ వంటి వాటిని ఇప్పుడు హ్యాండిల్‌బార్ ఎడమవైపు ఉన్న 4-వే టోగుల్ స్విచ్ ద్వారా మీ కంట్రోల్‌లో ఉంటాయి. రైడింగ్‌కు సేఫ్టీ అనేది అంతకంటే కీలకమైనది. అందుకే XL750 ట్రాన్సాల్ప్‌లో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్‌ను హోండా ప్రవేశపెట్టింది.
అర్ధరాత్రి అడవి మార్గాల్లోనూ, ట్రాఫిక్ మధ్యలోనూ ఎక్కడైనా ఈ ఫీచర్ అవసరమైన హెచ్చరికల ద్వారా ఇతర వాహనదారులకు హెచ్చరికలు ఇస్తుంది. ఈ కొత్త హోండా XL750 ట్రాన్సాల్ప్ బైకులో హై-ఎండ్ సస్పెన్షన్ సిస్టమ్ అందించారు. బైక్ ముందు భాగంలో 21 అంగుళాల స్పోక్డ్ వీల్, వెనుక భాగంలో 18 అంగుళాల స్పోక్డ్ వీల్ ఉండటంతో, ఆఫ్-రోడ్ ట్రయిల్స్‌పై దీని కంట్రోలింగ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications








