మరో కొత్త మోడల్‌తో మార్కెట్లోకి వచ్చేసిన హోండా.. మిడిల్ క్లాసు వారికి పండగే!

ప్రముఖ టూ- వీలర్ తయారీ సంస్థ హోండా తన జోరు చూపెడుతోంది. ఎన్నో ఏళ్లుగా తమ వాహనాలతో భారతీయులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సంస్థ.. మరో కొత్త మోడల్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ పాపులర్ మోడల్ అయిన "హోండా లివో" బైకుకు అప్‌డేటెడ్ మోడల్‌ను లాంఛ్ చేసింది. రూ.83.080(ఎక్స్- షోరూమ్) ప్రారంభ ధరగా ఉన్న ఈ బైకును అధునాతన ఫీచర్లను జోడించి తీసుకువచ్చారు. ఈ హోండా లివో బైకు‌కు సంబంధించి పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్లు తదితర అంశాలు ఈ కథనంలో చూద్దాం.

హోండా లివో 2025 మోడల్ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్సార్బర్స్, అలాయ్ వీల్స్‌తో ఈ బైకు ఉంటుంది. దీంట్లోని ఇంజిన్ కాంపోనెంట్స్ పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉంటాయి. దీని కొత్త గ్రాఫిక్ డిజైన్ కారణంగా ఇది మరింత స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది.

Honda Livo updated Version

ఈ హోండా లివో బైకు.. Pearl Igneous Black with Blue Stripes, Pearl Igneous Black with Orange Stripes and Pearl Siren Blue అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బైకు మస్క్యులర్ ట్యాంక్‌తో, అట్రాక్టివ్ ట్యాంక్ కవర్‌తో, స్మాల్ బికినీ ఫెయిరింగ్‌తో ఉంటుంది.

ఈ బైకు ఫీచర్ల విషయానికి వస్తే ఇది పూర్తిగా డిజిటల్ ఎల్‌సీడీ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. దీంట్లో రియల్- టైమ్ మైలేజీ, యావరేజ్ మైలేజీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్ వంటివి ఉంటాయి. దీంట్లోని ఇంజిన్ OBD2Bతో వస్తుంది. దీంట్లో 109.51 సీసీ సింగిల్- సిలిండర్, ఫ్యూయల్- ఇన్‌జెక్టెడ్ ఎయిర్- కూల్‌డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.4 bhp పవర్, 9.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Honda Livo updated Version

ఈ బైకు ధర విషయానికి వస్తే.. దీంట్లోని డ్రమ్ వేరియంట్ రూ.83,080(ఎక్స్- షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. డిస్క్ వేరియంట్ రూ.85,878 వద్ద మొదలవుతుంది. ఈ బైకులో ఫ్యూయల్ ట్యాంక్ పైన, హెడ్‌లైట్స్,సైడ్ బాడీ ప్యానెల్స్‌పైన అట్రాక్టివ్ గ్రాఫిక్స్ కనిపిస్తాయి.

జనరల్ డిజైన్ & ఫీచర్లు: ఈ హోండా లివో మోడల్.. లాంగ్ సింగిల్- పీస్ సీట్‌తో వస్తుంది. ఇది స్టాండర్డ్ పిలియన్ గ్రాబ్ రెయిల్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. దీంట్లో సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఈ బైకులో ఉండే మరో ప్రధాన ఫీచర్‌గా చెప్పవచ్చు. 110సీసీ సెగ్మెంట్ లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించే ఉద్దేశంతో ఈ కొత్త మోడల్‌ను లాంఛ్ చేసినట్లు హోండా సంస్థ పేర్కొంది.

ఈ బైకు స్ప్లెండర్, హీరో ప్యాషన్ బైకులతో పాటు టీవీఎస్ సంస్థ అప్డేటెడ్ వెర్షన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. "మా వినియోగదారులకు హోండా లివో.. ఒక విశ్వసనీయమైన ఛాయిస్. ఈ 2025 కొత్త మోడల్‌తో.. మార్కెట్లో మా స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అన్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2025, 16:47 [IST]
English summary
Honda livo updated version launched in india with enhanced features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+