సౌత్ ఇండియాలో ఈ కంపెనీ టూవీలర్స్‌‌‌ను ఎగబడి కొంటున్నారు.. అందరి ఫేవరెట్ మోడల్ ఇదే!

దేశంలో హోండా (Honda) కంపెనీకి చెందిన బైక్ లేదా స్కూటర్లను వాడని వారు ఉండటం చాలా తక్కువ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా హోండా టూవీలర్స్ కనిపిస్తాయి. ప్రజల రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉండే వాహనాలను విడుదల చేయడంలో ఇది దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుంది. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్లను ప్రజల కోసం లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా టూవీలర్ తయారీదారులు ఉన్నప్పటికీ కూడా హోండా నుంచి వచ్చే వాటికి చాలా నమ్మకమైన మోడళ్లుగా మంచి పేరుంది. సేల్స్ పరంగా హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీల కంటే కూడా ముందు వరుసలో ఉంది. తాజాగా కంపెనీ అమ్మకాల పరంగా కీలక మైలురాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు హోండా టూవీలర్స్‌ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ బైక్ లేదా స్కూటర్లు సౌత్‌లోని పలు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి విడుదల అయిన ప్రకటన ప్రకారం, ఈ కంపెనీకి చెందిన టూవీలర్స్ దక్షిణ భారతదేశంలో 20 మిలియన్లకు పైగా యూనిట్లు అమ్ముడుపోయినట్టు ప్రకటించింది. ఇక్కడ కీలకమైన మరో విషయం ఏమిటంటే, హోండా టూవీలర్స్ మొదటి 10 మిలియన్ల (ఒక కోటి) అమ్మకాలను నమోదు చేయడానికి దాదాపు 17 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత వేగంగా హోండా తన టూవీలర్స్‌ను విక్రయించింది.

Honda Southern India Sales

ఒక కోటి అమ్మకాలను చేరుకోవడానికి హోండా కంపెనీకి కేవలం ఏడు సంవత్సరాలు పట్టింది. ప్రధానంగా ఈ రెండు కోట్ల హోండా అమ్మకాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక రాష్ట్రాల్లో నమోదయ్యాయి. 2 కోట్ల అమ్మకాల మైలురాయిని చేరడటంపై హోండా ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గణంకాలు భారతీయ ప్రజల్లో హోండాకు ఉన్నటువంటి ఆదరణను గుర్తు చేస్తున్నాయి.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వెల్లడించిన దాని ప్రకారం, కంపెనీ నుంచి అత్యధికంగా అమ్మకాలను జరిపిన మోడల్‌గా యాక్టివా స్కూటర్ (Activa Scooter) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తరువాత స్థానంలో యాక్టివా స్కూటర్‌లో మరో వేరియంట్ 125 మోడల్ ఉంది. దేశంలో అందిరికి స్కూటర్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది యాక్టివానే. చాలా కాలంగా దీన్ని భారతీయ వినియోగదారులు ఆదరిస్తూనే ఉన్నాయి.

Honda Scooter Achieved 2 Crore Sales Milestone In Southern India

యాక్టివా ఇంజిన్ పనితీరు, దాని డిజైన్, ఫీచర్స్, తక్కువ ధర, బైక్‌తో పాటు సమానమైన మైలేజ్, పురుషులతో పాటు మహిళలు కూడా ఈజీగా డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉండటం కారణంగా ఈ స్కూటర్‌ను చాలా మంది కొనుగోలు చేశారు. మార్కెట్లో దీనికి ఉన్నటువంటి డిమాండ్‌ను గుర్తించిన కంపెనీ పాత దాని స్థానంలో కొత్తగా అప్‌డేట్ మోడల్‌ను అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదల చేస్తూనే ఉంది.

యాక్టివా 125 ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న స్కూటర్‌గా ఉంది. ఇదిలా ఉంటే, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రకారం, యాక్టివా, యాక్టివా 125 స్కూటర్లపై ప్రత్యేకంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ 2 కోట్ల అమ్మకాల మైలురాయిని సాధించిన సమయంలో ఈ రెండు స్కూటర్లపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు వసూలు చేయకుండా వీటిని కొనుగోలు చేయవచ్చని హోండా పేర్కొంది.

Honda Scooter 2 Crore Sales In Southern India

హోండా కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజులు, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేకపోవడం వలన వీటిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం రూ. 82,956 ప్రారంభ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2025, 14:13 [IST]
English summary
Honda motorcycle and scooter achieved 2 crore sales milestone in southern india
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+