భారత కుటుంబాలకు బెస్ట్ బ్రాండ్! 30 రోజుల్లో 5.9 లక్షల రికార్డు సేల్స్.. ఎందుకింత క్రేజ్?

నవంబర్ 2025లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) మరోసారి తన మార్కెట్ శక్తిని నిరూపించింది. దేశీయ మార్కెట్‌లోనూ, గ్లోబల్ ఎగుమతుల విభాగంలోనూ హోండా అమ్మకాలు గణనీయంగా పెరిగి కంపెనీకి భారీ ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. మొత్తం మీద, హోండా నవంబర్ నెలను 5,91,136 యూనిట్ల విక్రయాలతో ముగించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 4,72,749 యూనిట్ల నుంచి నేరుగా 25 శాతం కంటే ఎక్కువ వృద్ధి. ఈ ఒక్క సంఖ్యే హోండా బ్రాండ్‌కు కొనసాగుతున్న నమ్మకం ఎంత బలంగా ఉందో చూపుతుంది. ఎగుమతులు బలంగా నిలబడటం, దేశీయ మార్కెట్‌లో రిటైల్ డిమాండ్ తిరిగి మెరుగుపడటం, యాక్టివా-షైన్ వంటి మోడళ్లకు నిరంతరమైన పాపులారిటీ కలిపి హోండా నవంబర్ పనితీరును సానుకూలంగా నిలబెట్టాయి.

అయితే, నెలవారీ గణాంకాలు మాత్రం కొద్దిగా భిన్నంగా కనిపించాయి. పండుగ సీజన్ కారణంగా అక్టోబర్ 2025లో అమ్మకాలు అసాధారణంగా పెరిగి 6,50,596 యూనిట్లను తాకాయి. సహజంగానే పండుగల తర్వాతి నెలల్లో డిమాండ్ కొంత తగ్గడం సాధారణం. అదే ప్రభావం నవంబర్ నెలలో కనిపించింది. అక్టోబర్‌తో పోలిస్తే అమ్మకాలు 9 శాతం కంటే కొంచెం ఎక్కువగా తగ్గినా, మొత్తం మార్కెట్ దృష్ట్యా ఇది ఆందోళన కలిగించే స్థితి కాదు.

Honda Motorcycle November 2025 Sales 25 Percent Growth Compared To Previous

నెలవారీ తగ్గుదల ఉన్నప్పటికీ, సంవత్సర ప్రాతిపదికన భారీ వృద్ధి నమోదు చేయడం హోండా రెండువీల్ మార్కెట్‌లో ఉన్న ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది. దేశీయ మార్కెట్‌లో హోండా నవంబర్ 2025లో మరోసారి తన బలం ఏంటో స్పష్టంగా చూపించింది. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో డిమాండ్ స్థిరంగా పెరగడంతో, కంపెనీ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది.

నవంబర్ 2024లో 4,32,888 యూనిట్లు విక్రయించిన హోండా, ఈసారి దేశీయంగా అదే నెలలో 5,33,645 యూనిట్లకు చేరి 23.28% భారీ వృద్ధి సాధించింది. ఈ వృద్ధి కేవలం శాతం గణాంకాల్లో మాత్రమే కాక, వాల్యూమ్ పరంగా కూడా చాలా పెద్దదే. మొత్తం అమ్మకాలలో 1,00,757 యూనిట్ల అదనపు పెరుగుదల చూపించడం, హోండా పై ప్రజల నమ్మకం ఎంత దృఢంగా ఉందో తెలుపుతోంది.

Honda Motorcycle November 2025 Sales 25 Percent Growth Compared To Previous

యాక్టివా వంటి స్కూటర్లు, షైన్-SP వంటి కమ్యూటర్ బైక్‌లు, డియో, కొత్తగా అప్‌డేట్ చేసిన మోడళ్లకు వచ్చిన డిమాండ్, ఇవి అన్నీ కలిసి దేశీయ మార్కెట్‌లో హోండా వృద్ధికి వేరే స్థాయిలో బూస్ట్ ఇచ్చాయి. ముఖ్యంగా పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా హోండా అమ్మకాలు మళ్లీ పుంజుకోవడం ఈ పెరుగుదలకి ప్రధాన కారణాలలో ఒకటి. గత నెలలో హోండా ఎగుమతుల విభాగం కూడా అదే వేగాన్ని కొనసాగించింది.

నవంబర్ 2024లో 39,861 యూనిట్లు విదేశాలకు పంపించిన HMSI, ఈసారి 57,491 యూనిట్లను ఎగుమతి చేస్తూ 44.23% భారీ వృద్ధిని నమోదు చేసింది. అంటే ఒక్క సంవత్సరంలోనే దాదాపు 17,600 యూనిట్ల పెరుగుదల, ఇది హోండా గ్లోబల్ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో సూచించే స్పష్టమైన సంకేతం. దేశీయ అమ్మకాలతో పోలిస్తే ఎగుమతుల వాటా సహజంగానే తక్కువే.

Honda Motorcycle November 2025 Sales 25 Percent Growth Compared To Previous

నవంబర్ 2025లో హోండా మొత్తం అమ్మకాలలో దేశీయ మార్కెట్ 90.27% వాటాను కలిగి ఉండగా, ఎగుమతులు 9.73% వాటాగా నిలిచాయి. అంటే అమ్మకాలన్నీ భారత మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడినా, ఎగుమతి విభాగం ఇచ్చిన అదనపు బూస్ట్ కంపెనీ మొత్తం వృద్ధిని మరింత బలపరిచింది. మొత్తం మీద, దేశీయ విభాగం కంపెనీకి మరోసారి స్పష్టంగా చెప్పింది. మార్కెట్‌లో పోటీ ఎంత ఉన్నా... కస్టమర్లు హోండాను ఎంచుకునే నమ్మకం మాత్రం తగ్గడం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, December 8, 2025, 15:20 [IST]
English summary
Honda motorcycle november 2025 sales 25 percent growth compared to previous
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+