అదిరిపోయే లేటెస్ట్ అప్‌డేట్స్‌తో హోండా యాక్టివా లాంచ్.. ఇండియాలోనే అందిరి ఫేవరెట్ స్కూటర్‌కు ఎదురేలేదు
దేశ జనాభా పెరుగుతున్న కొద్ది రవాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టింది మొదలు కచ్చితంగా బైక్ లేదంటే స్కూటర్స్, కార్స్ వంటివి తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే వారికి టూవీలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కష్టపడుతూ ప్రయాణించడం కంటే సొంతంగా టూవీలర్ కొనుక్కొని ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్లడం బెస్ట్ అని చాలా మంది కూడా టూవీలర్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో బైక్స్ వినియోగం ఎక్కువగా ఉండేది. అయితే ఇవి పురుషులు మాత్రమే నడపడానికి అనువుగా ఉండేవి. తర్వాత కాలంలో మహిళల కోసం స్కూటర్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నటూవీలర్ విభాగంలో ఇవి మంచి స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీదారు హోండా ఈ సెగ్మెంట్‌లో ఇండియాలో టాప్ ప్లేస్‌లో ఉంది.
హోండా కంపెనీకి చెందిన యాక్టివా 110 (Activa 110) భారత్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన మోడల్. చాలా కాలంగా యాక్టివా స్కూటర్ అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. మార్కెట్లో ఎన్నో కొత్త మోడళ్లు లాంచ్ అయినప్పటికి కూడా ఈ స్కూటర్‌కు మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హోండా కంపెనీ 2025 మోడల్ యాక్టివా 110 ను విడుదల చేసింది.

కొత్త అప్‌డేట్స్ చేసి యాక్టివా 110 కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మిగతా విభాగాల్లో లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్స్ ఉన్నాయి. పాత మోడల్ మాదిరిగానే ఈ కొత్త స్కూటర్‌లో 109.51 సీసీ ఇంజిన్‌ను అందించారు. అయితే దీనిలో కాలుష్య కారకాలను తక్కువ స్థాయిలో విడుదల చేయడానికి అనువుగా OBD2B ఉద్గార ప్రమాణాలను అందించారు.
ఇంజిన్‌లో ఈ మార్పు కారణంగా 2025 మోడల్ యాక్టివా 110 నుంచి కాలుష్యానికి కారణమయ్యే ఉద్గారాలు తక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. ఇటీవల కాలంలో వాతావరణ కాలుష్యం ఎక్కువగా పెరగడానికి వాహనాల నుంచి విడుదలయ్యే విషపూరిత వాయువులు కూడా ఒక కారణం. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కూడా వాహన తయారీదారులు కొత్తగా ఉత్పత్తి చేస్తున్న మోడళ్లలో ఇంజిన్లను OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.

కొత్త యాక్టివా 110 ఇంజిన్ 8,000 rpm వద్ద 8 ps పవర్. 5,500 వద్ద 9.05 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త దానిలో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఇడ్లింగ్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతో స్కూటర్ ఆగి ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆఫ్ చేసి తిరిగి స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ట్రాఫిక్‌లో బాగా పనికొస్తుంది.
మైలేజ్ కూడా అద్భుతంగా వస్తుందని కంపెనీ పేర్కొంది. బ్లూటూత్ కనెక్టివిటీ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. 4.2-అంగుళాల TFT స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ అందించారు. హోండా రోడింగ్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుని బైక్ మొత్తం వివరాలను తెలుసుకోవచ్చు. వివిధ మార్గాల్లో రైడర్లకు ఉపయోగకరంగా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

కాల్, మెసేజ్ అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ప్రధాన అప్‌డేట్‌లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. ఇది STD, DLX, H-Smart అనే మూడు వేరియంట్లలో లభిస్తాయి. కొత్త యాక్టివా పెర్ల్ సైరన్ బ్లూ, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్,రెబెల్ రెడ్ మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి కలర్స్‌లలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








