మార్కెట్లోకి అతి తక్కువ ధరలో కొత్త హోండా షైన్.. మైలేజ్‌కు ఢోకా ఉండదు.. పేద-మధ్యతరగతి వారికి ఇక పండగే
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) మోటార్ ఇండియా దేశంలో స్కూటర్స్, బైక్స్‌ల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన వాహనాలు దేశంలో ఢిల్లీ నుంచి గల్లి వరకు కూడా కనిపిస్తాయి. సాధారణంగా ఇండియాలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. ఎక్కువ డబ్బులు చెల్లించి బైకులను కొనుగోలు చేయలేని వారు తక్కువ ధరలో లభించేటువంటి హోండా టూవీలర్స్‌ను అధికంగా ఎంచుకుంటారు. ఈ కంపెనీ మోడళ్లు ప్రధానంగా తక్కువ ధరలో లభించడమే కాకుండా మైలేజ్ విషయంలో కూడా బాగా ఇస్తాయి. దేశంలో ప్రస్తుతం పెట్రోల్ రేట్లు రూ.110 కి దగ్గరగా ఉంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండి పేద, మధ్యతరగతి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది భారీ ధరకు లభిస్తున్న పెట్రోల్ కొనుగోలు చేయడం అంటే మరింత ఆర్థిక భారం అవుతుంది. రోజువారి ప్రయాణాలు చేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.
అందుకే ఇలాంటి వారు ఎక్కువగా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే వాటిని ఎంచుకుంటారు. హోండా కంపెనీ అలాంటి వారికి దేవుడు లాగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా పేద, మధ్యతరగతి వినియోగదారులరు దృష్టిలో ఉంచుకునే టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. ఇప్పటికే దేశంలో పలు మోడళ్లను విజయవంతంగా నిర్వహిస్తున్న హోండా తాజాగా 2025 షైన్ 125 (2025 Shine 125) బైక్‌ను విడుదల చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

షైన్ బైక్ ప్రస్తుతం ఇండియాలో తక్కువ ధరలో, అధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లలో ముందు స్థానంలో ఉంది. ఉద్యోగస్తులు ఎక్కువగా తమ రోజువారి అవసరాలకు దీన్నే కొనుగోలు చేస్తారు. లీటర్ పెట్రోల్‌తో మంచి మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటనెన్స్ చాలా తక్కువ. భారతదేశంలో దీని డిమాండ్‌ను గుర్తించిన హోండా దీనికి మరిన్ని అదనపు హాంగులు అద్ది కొత్త ఫీచర్స్‌తో ఇప్పుడు తీసుకొచ్చారు. 2025 షైన్ 125 మరింత ఆకర్షణీయంగా వచ్చింది.
దీని ధర రూ.84,493గా కంపెనీ నిర్ణయించింది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ప్రస్తుతం చాలా మంది లక్ష రూపాయల లోపు ధర కలిగిన వాటిని ఎక్కువగా ఎంచుకుంటున్న నేపథ్యంలో ఈ కొత్త షైన్ ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుందని హోండా అంచనా వేసింది. ఇది వినియోగదారులకు డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ అధునాతన వేరియంట్లలో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 55 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది.
2025 షైన్ 125 ఇంజిన్ విషయానికి వస్తే, 123.94 cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ముఖ్యంగా దీన్ని OBD2B ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే పాత మోడళ్లతో పోలిస్తే,ఈ కొత్త అప్‌గ్రేడ్‌తో ఇంజిన్ పనితీరు మరింత మెరుగవుతుంది. ఇది 10.63 bhp పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను దీనిలో అందించారు.
కొత్త 2025 హోండా షైన్ 125 డిజైన్ చూసినట్లయితే ఇది పాత దాన్ని పోలి ఉంటుంది. ఫీచర్స్ చాలా వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని కలిగి ఉంది. ఇది ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. రైడింగ్‌ను మెరుగైన కంట్రోలింగ్ ఇవ్వడానికి ముందు డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను ఇచ్చారు.
ఇది పెర్ల్ సైరెన్ బ్లూ, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రెబెల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. కొత్త 2025 హోండా షైన్ 125 మార్కెట్లో హీరో సూపర్ స్ప్లెండర్ 125, టీవీఎస్ రైడర్ 125 వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications








