500cc బైక్ పవర్‌తో హోండా EV సెప్టెంబర్ 2న లాంచ్! పెట్రోల్ లేకుండానే పర్ఫార్మెన్స్ అంటే ఇదే
ఇంజిన్ సౌండ్ లేకుండా, కానీ శక్తిని తగ్గించకుండా అధునాతన ఫీచర్స్‌తో శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైకును విడుదల చేయడానికి ప్రముఖ టూవీలర్ తయారీదారు హోండా (Honda) సిద్ధమవుతోంది. ఇంత వరకు ఐసీఈ ఆధారిత వాహనాలను విడుదల చేస్తూ వస్తున్న కంపెనీ ఇప్పుడు తన మార్కెట్‌ను మరింత విస్తరించడానికి ఈవీ విభాగంలో 500 సీసీ బైక్ లాగే పనితీరును కలిగి ఉండే శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌తో రంగంలోకి దిగుతోంది. ఈ బైక్‌కి సంబంధించి కంపెనీ చెబుతున్న కథనాల ప్రకారం, ఇది సంప్రదాయ 500 సీసీ పెట్రోల్ బైక్‌ల మాదిరిగా పనిచేస్తుంది. అంటే పవర్‌లో తగ్గేదేమీ లేదు, కానీ కాలుష్యంలో మాత్రం పెద్ద తేడా. హోండా ఎలక్ట్రిక్ విభాగంలో అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ కొత్త బైక్ భారత మార్కెట్లో కూడా తన సత్తాను చూపించే అవకాశం ఉంది.
ఇప్పటికే హోండా తన సోషల్ మీడియా వేదికలపై ఓ టీజర్ వీడియోను షేర్ చేసింది. ఇందులో కేవలం కొన్ని సెకన్ల ఫుటేజ్ మాత్రమే ఉన్నా, చూస్తే ఆ బైక్ స్పీడ్, డిజైన్, సౌండ్ లెస్ పవర్ ప్రతిభను ఊహించచ్చు. ఈ బైక్ సెప్టెంబర్ 2న అధికారికంగా విడుదల కానుంది. ఇప్పుడు హోండా కేవలం ఫ్యూయెల్ బైక్స్ తయారీపై మాత్రమే కాకుండా ఈవీలపై కూడా ఎక్కువగానే దృష్టి పెడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా EV విభాగంలో తన స్థానం కోసం పోరాడుతున్న హోండా, ఇప్పటికే భారత మార్కెట్లో యాక్టివా EV, యాక్టివా QC రూపంలో ఈవీ స్కూటర్లను విక్రయిస్తుంది. అయితే రాబోయే బైక్ ఇండియాలో విడుదల అవుతుందా.. లేదా అనే దానిపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాచారం ఏది రాలేదు. భారత్‌లో అధిక ధర గల EVలకు అంతగా డిమాండ్ లేకపోవడం, మిడ్-రేంజ్, బడ్జెట్-ఫ్రెండ్లీ వాహనాలకే ఎక్కువ ఆదరణ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ బైక్ రాకపై సస్పెన్స్ కొనసాగుతుంది. త్వరలో విడుదల కానున్న పవర్‌ఫుల్ EV బైక్‌లు భారత మార్కెట్‌కు రాకపోవచ్చు. ఇవి అంతర్జాతీయ ప్రీమియం మార్కెట్లకు మాత్రమే పరిమితం కావచ్చు. అయితే, హోండా EV రంగంలో ఒక్క అడుగు వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు కాకపోయినా రేపు, భారత మార్కెట్ కోసం కూడా హోండా పెద్ద ప్లాన్లు సిద్ధం చేసుకోవడం ఖాయం!
హోండా విడుదల చేయనున్నఈ బైక్ దాదాపు 50 bhp శక్తిని ఉత్పత్తి చేయనుందని సమాచారం. ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, టార్క్ విషయంలో మరింత శక్తివంతంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా పెట్రోల్ బైక్‌లు ఇవ్వగలిగే స్టార్ట్ యాక్సిలరేషన్ కన్నా ఇది గణనీయంగా ముందుండే అవకాశం ఉంది. ఈ బైక్ రైడింగ్ అనుభవం మామూలుగా ఉండకపోవచ్చు.
హోండా తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ బైకులో రెండు బ్యాటరీ ఆప్షన్లు 4.1kWh, 6.3kWhలతో అందించనుంది. చిన్న వేరియంట్ 4.1kWh, సిటీ రైడింగ్‌కి పర్ఫెక్ట్ మ్యాచింగ్. దాదాపు 120 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. మరోవైపు, పెద్ద వేరియంట్ 6.3kWh. ఇది వారంలో వారం రోజులూ రైడ్ చేయాలనుకునే వాళ్ల కోసం. ఒకసారి ఛార్జ్ చేస్తే, 170 కి.మీ. వరకు ఆగకుండా పరుగెత్తే శక్తి. ఈ రేంజ్ విన్నాక ఎవరికైనా బాగా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications








